హనుమంతుడు నేటికీ నివసిస్తున్నట్లు చెబుతున్న 5 ప్లేస్ లు ఇవే..అక్కడ ఆంజనేయస్వామిని చూడొచ్చు!

సాధారణంగా మనం చీకటిలో వెళ్తూ భయం వేస్తే శ్రీ ఆంజనేయం..ప్రసన్నాంజయేం అని మనసులో అనుకుంటాం. దీంతో భయం పోతుందని నమ్మకం. ఆంజనేయస్వామి దెబ్బకు ఎలాంటి దెయ్యమైనా పరారవ్వాల్సిందే అని అంటుంటారు. అయితే తన శక్తి గురించి తనకే తెలియని హనుమంతుడు చిరంజీవిగా వరం పొందిన విషయం తెలిసిందే. శ్రీరాముడిపై తనకున్న అంచచలమైన ప్రేమతో, ప్రతి రామ భక్తుడిని కంటికి రెప్పలా కానాడే దాకా ఈ లోకం విడిచి వెళ్లనని హనుమంతుడు శపథం చేశాడు. అందుకే ఇప్పటికీ రహస్యమైన రీతిలో తన భక్తులను కాపాడుతూ వారికి మార్గనిర్దేశం చేస్తుంటాడని నమ్ముతారు.

హనుమంతుడు ఈ భూమ్మీద ఎక్కడ నివసిస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుుసుకోవాలని చాలామంది తహతహలాడుతుంటారు. ఎందరో యోగులు, సాధువులు, భక్తులు హనుమంతుని ఉనికిని సృష్టంగా గుర్తించిన కొన్ని ప్రదేశాల గురించి చెప్పారు. అవే దివ్యమైన శక్తి కేంద్రాలు..అక్కడ అద్భుతాలు జరుగుతాయి..కోరిన కోర్కెలు నెరవేరుతాయి..అనిర్వచనీయమైన శాంతి మనస్సుని నింపుతుంది. ఇప్పటికీ ఆంజనేయస్వామి నివసిస్తున్నాడని విశ్వసించే 5 పవిత్ర స్థలాలు ఎక్కడనున్నాయో ఇప్పుడు చూద్దాం.

Is Hanuman Still on Earth 5 Amazing Places That Hint at Hanuman s Presence

అంజనాద్రి కొండ
కర్ణాటక రాష్ట్రంలోని హంపీ దగ్గర్లో ఉన్న అంజనాద్రి కొండ హనుమంతుని జన్మస్థలంగా నమ్ముతారు. పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి ఒక దివ్యమైన బిడ్డను ప్రసాదించాలని ఇక్కడ ధ్యానం చేసింది. ఈ కొండపై హనుమంతునికి అంకితం చేయబడిన ప్రసిద్ద ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఒక అనిర్వచనీయమైన శక్తిని ఫీల్ అయినట్లు చాలామంది చెబుతున్నారు. హనుమంతుని నిరంతర ఉనికితో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లొ ఇది ఒకటి.

గంధమాదన పర్వతం
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో ఉన్న గంధమాదన పర్వతాన్ని హనుమంతుని పాదముద్రలున్న దివ్య భూమిగా పిలుస్తారు.రామాయణం ప్రకారం హనుమంతుడు లంకకు వెళ్లేటప్పుడు మహా సముద్రాన్ని దాటింది ఇక్కడి నుంచే అని నమ్ముతారు. ఇప్పటికీ ఈ పర్వతంపై ఆంజనేయస్వామి పాదముద్రలుగా భావించే ఒక పవిత్రమైన రాయి ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఏటా ఇక్కడికి వస్తుంటారు..ఇంకా ఇక్కడ హనుమంతుని ఉనికి ఉందని నమ్ముతారు.

మానస సరోవరం
టిబెట్ దేశంలో ఉన్న కైలాస పర్వతం సమీపంలో ఉన్న మానస సరోవరం శివుడికి మాత్రమే కాకుండా చిరంజీవుల సమావేశ స్థలం అని కూడా నమ్ముతారు. ఆంజనేయస్వామి..వ్యాస మహర్షి, బలి చక్రవర్తి వంటి ఇతర శాశ్వతమైన జీవులతో కలిసి ఈ సరస్సుని ప్రత్యేక సమయాల్లో సందర్శించి దాని దివ్య శక్తిని గ్రహిస్తాడని నమ్మతారు. ఈ సరస్సు ఒడ్డున ధ్యానం చేసే అనేకమంది ఆథ్యాత్మిక సాధువులు మాటల్లో చెప్పలేని ఉనికిని అనుభవించినట్లు చెబుతుంటారు. ఇది హనుమంతుడు ఇప్పటికీ ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తాడనే నమ్మకాన్ని బలపరుస్తుంది.

హిమాలయాలు
దేవతల నివాసంగా పిలువబడే హిమాలయాలు..హనుమంతుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలలో ఒకటిగా నమ్ముతారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హనుమాన్ టిబ్బా, కేదార్‌నాథ్ చుట్టూ ఉన్న గుహలు వంటి అనేక ప్రదేశాలు ఆయనతో సంబంధం కలిగి ఉన్నాయి. కొంతమంది సాధువులు,యోగులు హనుమంతుడు తన సూక్ష్మ రూపంలో ఈ మారుమూల ప్రాంతాలలో ఇప్పటికీ ధ్యానం చేస్తూ, పర్వతాల దివ్య శక్తిని గ్రహిస్తున్నాడని చెబుతారు. ఈ ప్రాంతాలలో హనుమంతునికి అంకితం చేయబడిన ఎత్తైన ఆలయాలు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉన్నాయని చెబుతారు, అనేక మంది యాత్రికులు అద్భుతమైన అనుభవాలను మరియు చెప్పలేని శాంతిని పొందినట్లు చెబుతారు.

హనుమాన్ ధార
కర్ణాటకలోని చిత్రకూట్‌లో ప్రసిద్ధ హనుమాన్ ధార ఆలయం ఉంది. పురాణాల ప్రకారం హనుమంతుడు తన తోకతో లంకను కాల్చిన తర్వాత భరించలేని వేడి నుండి ఉపశమనం పొందడానికి చిత్రకూట్‌ వచ్చాడు. ఆయన బాధను చూసిన రాముడు, హనుమంతునిపై నిరంతరం నీటిని పోసే ఒక దివ్యమైన జలధారను సృష్టించాడు..తద్వారా ఆయనను చల్లబరిచాడు. ఈ పవిత్ర స్థలం శతాబ్దాలుగా అద్భుతాలకు నిలయంగా ఉంది, భక్తులు ఇక్కడ హనుమంతుని శక్తితో ఒక లోతైన అనుబంధాన్ని అనుభవిస్తారు. హనుమంతుడు ఇప్పటికీ ఈ ఆలయంలో అదృశ్యంగా, ఎల్లప్పుడూ ఉంటాడని, నిజమైన భక్తితో ఆయనను వెతికే వారిని కాపాడుతూ ఉంటాడని చాలా మంది నమ్ముతారు.

Story first published: Saturday, April 19, 2025, 18:05 [IST]
Desktop Bottom Promotion