Latest Updates
-
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా!
Puri jagannath rath yatra 2025: పూరీ నుంచి ఈ వస్తువులు తెచ్చుకోండి..లక్ష్మీ కటాక్షం మీపై గ్యారెంటీ!
పూరీ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది జగన్నాథ స్వామి ఆలయం,ఏటా జరిగే రథయాత్ర. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఏటా పూరీలో జరిగే జగన్నాథ రథయత్రలో పాల్గొంటారు. జై జగన్నాథ అంటూ కోట్లాది భక్తుల జయజయధ్వానాల మధ్య, రథాలపై ఊరేగే ఆ జగన్నాథ, బలభద్ర, సుభద్రలను దర్శించుకోవడం ఒక నయనానందకరమైన దివ్యానుభూతిని అందిస్తుంది. పూరీ జగన్నాథ యాత్ర కేవలం ఒక తీర్థయాత్ర కాదు, అది మనసును ప్రశాంతతతో, ఆత్మను విశ్వాసంతో నింపే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడిని అక్కడి సానుకూల శక్తి ఆవహించి కొత్త ఉత్తేజాన్నిస్తుంది.
ఈ ఏడాది జూన్ 27 నుంచి పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది.జులై 5న ముగుస్తుంది. అయితే ఈసారి మీరు జగన్నాథ రథయాత్రకు వెళ్తుంటే అక్కడి నుంచి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదమైనదిగా చెబుతుంటారు. ఆ ప్రత్యేకమైన వస్తువులు కేవలం శుభప్రదమైనవి మాత్రమే కాదు, అవి సాక్షాత్తు శ్రీకృష్ణుడిని, లక్ష్మీదేవిని మన ఇంట్లో కొలువుండేలా చేస్తాయని ప్రగాఢ విశ్వాసం. పూరీ నుంచి ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ పవిత్ర వస్తువులేంటో ఇక్కడ చూడండి.

నిర్మాల్యం
జగన్నాథుని దర్శనం తర్వాత భక్తులు తప్పక స్వీకరించేది నిర్మాల్యం. ఇది జగన్నాథునికి నైవేద్యంగా సమర్పించిన అన్నాన్ని ఎండబెట్టి తయారుచేసిన మహాప్రసాదం. దీనిని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి భక్తులకు అందిస్తారు. ఈ నిర్మాల్యాన్ని ఇంటికి తీసుకువచ్చి, పూజా మందిరంలో లేదా ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచడం వల్ల ఇంట్లో సిరిసంపదలకు, ధాన్యానికి ఎప్పటికీ కొరత ఉండదని నమ్ముతారు. ఇది ఇంట్లో ఒక అక్షయ పాత్రలా పనిచేసి కుటుంబ సభ్యుల అభివృద్ధికి తోడ్పడుతుందని భక్తుల విశ్వాసం.
చెరకు
జగన్నాథ ఆలయ ప్రాంగణం నుండి పవిత్రమైన కర్రను లేదా చెరకును తీసుకురావడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. దీనిని ఇంట్లో ఉంచడం ద్వారా ధైర్యం, జ్ఞానం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని భక్తుల నమ్మకం. పూజ సమయంలో దీనిని తాకడం వల్ల మనకు భగవంతుని శక్తి లభిస్తుందని భావిస్తారు. ఈ కర్ర ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన గృహంలో అడుగుపెడుతుందని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు.
తులసి మాల
శ్రీ మహావిష్ణువుకు ముఖ్యంగా కృష్ణావతారానికి తులసి అత్యంత ప్రీతిపాత్రమైనది. పూరీ క్షేత్రం నుండి ఒక తులసి మాలను తీసుకురావడం ఎంతో శ్రేయస్కరం. ఈ మాలను ఇంట్లో ఉంచడం వల్ల గృహంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. తులసి మాల ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేసి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఇది ఇంట్లో ఉంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందని విశ్వాసం.



Click it and Unblock the Notifications
