Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కేదార్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకువారికి భారీ శుభవార్త..శివరాత్రి నాడే
హిందువులు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకున్న ఆథ్యాత్మిక యాత్రలలో కేదార్ నాథ్ ఒకటి. శంకరుని అత్యంత ప్రసిద్ధ నివాసమైన కేదార్‌నాథ్..ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో హిమాలయాల ఒడిలో ఉంది. శివుని అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉండే కేదార్ నాథ్ కి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలోనే భక్తులు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది కేదార్ నాథ్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.
వేదాలు, పురాణాలలో చార్ ధామ్ ప్రయాణం చాలా పవిత్రమైనదిగా వర్ణించబడింది. చార్ ధామ్ అంటే కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలోని ఆలయాల దర్శనం. కేదార్‌నాథ్‌లో శివుడు, బద్రీనాథ్‌లో విష్ణువు, గంగోత్రిలో గంగాదేవి, యమునోత్రిలో యమునాదేవి ఉంటారు. చార్ ధామ్ సందర్శించే వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని, జీవితంలోని అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

చార్ ధామ్ లలో ఒకటైన కేదార్ నాథ్ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శిస్తే ఆ వ్యక్తి జనన పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందుతాడని భావిస్తారు. జ్యోతిర్లింగాన్ని పూజించి.. ఆలయంలోని పవిత్ర జలాన్ని తాగితే జీవితకాలానికి సరిపడా ఆశీర్వాదం శివుని నుంచి దక్కుతుందని భావిస్తారు. అలాగే చిన్నవయసులో ఈ యాత్రకు వెళ్తే.. ఎక్కువ జ్ఞానం, పరిపక్వతతో తిరిగి వస్తారని.. ఇది వారి జీవితాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో హెల్ప్ చేస్తుందని చెప్తారు.
కేదార్‌నాథ్ ఆలయ యాత్ర ప్రారంభ, ముగింపు సమయాన్ని అనేక జ్యోతిష్య, మతపరమైన అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రతి సంవత్సరం కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరిచే తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటిస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కేదార్ నాథ్ ఆయల తలుపు తెరిచే తేదీని మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రకటిస్తారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి 26 ఫిబ్రవరి 2025 వస్తుంది. కాబట్టి ఆ రోజున ఎప్పుటి నుంచి ఈ ఏడాది కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమవుతుందో అధికారిక ప్రకటన చేయబడుతుంది. అయితే 2 మే 2 నుంచి మే 10 మధ్యలో యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన తేదీ కోసం మహాశివరాత్రి రోజున అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాల్సిందే.
ఆలయ చరిత్ర
కేదార్ నాథ్ లో ఉన్న ప్రస్తుత ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు నిర్మించారని చెబుతారు. ఇది ద్వాపర యుగంలో పాండవులు నిర్మించిన మునుపటి ఆలయానికి పక్కనే ఉంది. మరోవైపు, కొంతమంది పండితులు ఇది 12వ లేదా 13వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చెబుతుంటారు. ఈ ఆలయం ఎంత పురాతనమైనదో చెప్పడానికి ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు లేవు. అయితే కేదార్‌నాథ్ వేల సంవత్సరాలుగా హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది. ఆలయ గర్భగుడిలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది.



Click it and Unblock the Notifications