Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
దీపావళి రోజున ఏ నూనెతో దీపం వెలిగించాలో తెలుసా? అలా అయితేనే శుభం కలుగుతుంది! ఎందుకంటే..
భారత దేశం ఆధ్యాత్మికతకు నిదర్శనం. ఎన్నో కులాలు, ఎన్నో మతాలకు నెలవైన ఈ అఖండ భారతంలో ప్రతి రోజూ ఎదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది. వాటిలో ముఖ్యమైన పండుగ దీపావళి. అశ్వీయుజమాస బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటే దీపముల వరుస అని అర్ధం.
ఈ పండుగలో సాంప్రదాయంతో పాటు ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటుంది. ఈ పండుగను జరుపుకోవడంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా దాగి ఉన్నాయని పండితులతో పాటు పలువురు నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. ఈ దీపావళి నాడు ప్రత్యేకంగా దీపాలను వెలిగించి పండుగను జరుపుకుంటారు. అయితే ఎలాంటి నూనెతో దీపాన్ని వెలిగించాలి, ఎలాంటి దీపంతో వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి ఎలా జరుపుకోవాలి?
అశ్వీయుజమాస బహుళ అమావాస్య నెలకొన్న చీకట్లను తొలగించేందుకు, దీపాలను వెలిగిస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజున.. లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కానీ కొందరు ఆధునికతకు అలవాటు పడి, ఆర్టిఫిషల్ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అయితే తప్పనిసరిగా ఇంటి గుమ్మం, తులసి చెట్టు వద్ద.. నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాలని అప్పుడే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.

ఎప్పుడు పూజ చేస్తారు!
దీపావళి రోజున ప్రదోష సమయంలో లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఆ సమయంలో ధనలక్ష్మిని పూజిస్తే, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, ధన ధాన్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ దీపావళి నాడు వెలిగింది దీపం.. జ్ఞానం, ఐశ్వర్యం, సంపద, ఆనందాలకు ప్రతీకగా చెప్పుకుంటారు.
అగ్గిపుల్లతో వెలిగించరాదు!
దీపావళి రోజున సాయంకాలం సమయంలో లక్ష్మీదేవిని పూజించి.. ఇంటి గుమ్మం ముందు, తులసి కోట ముందు దీపాలను వెలిగిస్తారు. ఆ దీపాల్లో సకల దేవతల అనుగ్రహాలు, వేదాలు, శాంతి, ధనం, సిరి సంపదలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. అయితే ఆ దీపాలను అగ్గిపుల్లతో వెలిగించరాదని, పండితులు చెబుతున్నారు. మొదట ఒక దీపాన్ని అగరవత్తితో వెలిగించి, తరువాత మరొక దీపాన్ని ఆ దీపంతో వెలిగించాలి. అనంతరం దీపారాధన చేయాలి.
దీపాన్ని ఎవరు వెలిగించాలి?
దీపావళి రోజున దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి, స్వయంగా ఆ ఇంటి ఇల్లాలు దీపాలను వెలిగించాలి. ఆ అయిదు దీపాలకు అయిదు ప్రత్యేకతలు ఉంటాయి. మొదటి దీపం భర్త కోసం, రెండో దీపం అత్త మామల క్షేమం కోసం, మూడవ దీపం సోదర, సోదరీమణుల క్షేమం కోసం, నాలుగవది ధర్మం, గౌరవాభివృద్ది కోసం, అయిదవది వంశాభివృద్ధి కోసమని దేవతలను పూజిస్తూ వెలిగించాలి.
ఏ ఏ నూనెలతో దీపాలను వెలిగించొచ్చు?
వేప నూనెతో దీపావళి రోజున దీపాలను వెలిగించొచ్చు. వేప నూనెలో ఆవు నెయ్యిని కలిపి శివుడు ముందు దీపం వెలిగిస్తే, విజయం ప్రాప్తిస్తుందని నమ్మకం. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేయడం వల్ల, దాంపత్య జీవితం బాగుంటుంది. భార్య భక్తులు కలిసి సుఖంగా ఉంటారు. దీపావళి రోజున చేసే విఘ్నేశ్వర పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.



Click it and Unblock the Notifications