2019 లో వచ్చే అమావాస్యల పూర్తి వివరాలు, ఏ తేదీన అమవాస్య వస్తుందో చూసి తెలుసుకోండి

కొన్ని సందర్భాలలో ఒకే నెలలో రెండు అమావాస్యలు రావడం జరుగుతుంటుంది. వివిధ మతాలు, భాషల కారణంగా, మాసాలకు వివిధ పేర్లను, ప్రాముఖ్యతలను కలిగిఉన్న కారణాన అమావాస్యకు కూడా భిన్న నామాలను, మతపరమైన ప్రాధాన్యతను జ

హిందూ క్యాలెండర్ ప్రకారం, కృష్ణ పక్షంలో వచ్చే 15 వ రోజును భారతదేశంలో అమావాస్యగా పరిగణించడం జరుగుతుంది. దీనిని ఆంగ్లంలో న్యూమూన్ అని వ్యవహరిస్తుంటారు. పదిహేనవ రోజు పగటిపూట వస్తుంది. ఈ రోజు హిందువుల పరంగా మాత్రమే కాకుండా, మరి కొన్ని ఇతర మతాలలో కూడా కొన్ని అంశాల పరంగా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటుంది. నెలలో రెండు పక్షాలు ఉండగా, శుక్ల పక్షం పౌర్ణమితో, కృష్ణ పక్షం అమావాస్యతో ముగుస్తుంది. క్రమంగా 12 మాసాలకు గాను, సుమారు 12 అమావాస్యలు ఉంటాయి.

వీటిలో కొన్ని అమావాస్యలు హిందూ కాలెండర్ ప్రకారం ఏంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి, ఉదాహరణకు మహాలయా అమావాస్య, చోళంగి అమావాస్య వంటివి.

కొన్ని సందర్భాలలో ఒకే నెలలో రెండు అమావాస్యలు రావడం జరుగుతుంటుంది. వివిధ మతాలు, భాషల కారణంగా, మాసాలకు వివిధ పేర్లను, ప్రాముఖ్యతలను కలిగిఉన్న కారణాన అమావాస్యకు కూడా భిన్న నామాలను, మతపరమైన ప్రాధాన్యతను జోడించడం జరుగుతుంటుంది. క్రమంగా ప్రాంతాలు, మతాల వారీగా సమయాలలో కూడా కొంత మార్పులు చోటుచేసుకోవడం జరుగుతుంటుంది. క్రమంగా కొంత గందరగోళం నెలకొనడం పరిపాటి. కావున ఎటువంటి అనుమానం ఉన్నా, నివృత్తికై మీ ఆలయ పూజారిని లేదా పండితుని సంప్రదించడం ఉత్తమం.

గమనిక : సాధారణంగా కొన్ని కాలెండర్ల ప్రకారం, సూర్యోదయాన్ని అనుసరించి, తిధిని పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతుంది.

అమావాస్యను పూర్వీకుల ఆరాధనకు అంకితం చేయబడిందని చెప్పబడింది. ఆరోజును విరాళాలు, దానాలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. 2019 లో వచ్చే అమావాస్యల గురించిన వివరాలు ఇక్కడ ఈ వ్యాసంలో.

నిజానికి అమావాస్య పక్షానికి చివరి రోజున ఉన్న కారణంగా హిందూ కాలెండర్ ప్రకారం, పూర్తైన మాసం పేరు అమావాస్య రోజుకు వర్తిస్తుంది. కానీ, మన హిందూ కాలెండర్లు గ్రెగోరియన్ కాలెండర్ నకు అనుసంధానించిన కారణంగా, అమావాస్య తర్వాత వచ్చే మాసాన్ని, గ్రెగోరియన్ నెలకు పరిగణించడం జరుగుతుంటుంది.

జనవరి

జనవరి

జనవరిలో వస్తున్న అమావాస్యను దర్ష అమావాస్యగా లేదా పుష్య కృష్ణ అమావాస్యగా పరిగణించడం జరుగుతుంది. ఇది హిందూ మతం ప్రకారం, పుష్య మాసంలో ఉండడం మూలంగా దీనిని పాష్ లేదా పుష్య అమావాస్యగా పిలవడం జరుగుతుంది. ఇది జనవరి 5, 2019 వ తేదీన రానుంది. జనవరి 5 న ఉదయం 4.58 గంటలకు ప్రారంభమై, జనవరి 6 న ఉదయం 6.58 గంటలకు ముగుస్తుంది.

ఫిబ్రవరి

ఫిబ్రవరి

ఫిబ్రవరి నెలలో వస్తున్న అమావాస్యను మాఘ అమావాస్యగా పరిగణించబడుతుంది. ఈరోజు ఫిబ్రవరి 3, 2019న రాత్రి 11.52 గంటలకు అమావాస్య ఘడియలు ప్రారంభమై, ఫిబ్రవరి 5, 2019 వేకువజామున 2.33 గంటల వరకు కొనసాగుతుంది.

మార్చి

మార్చి

ఫాల్గుణ కృష్ణ అమావాస్యగా పరిగణించబడుతున్న ఈ అమావాస్య, బుధవారం మార్చి 5 న రాత్రి 11.52 గంటలకు ప్రారంభమై, మార్చి 6 న రాత్రి 9.34 గంటలకు ముగుస్తుంది.

ఏప్రిల్

ఏప్రిల్

ఏప్రిల్ 4, గురువారం నాడు చైత్ర కృష్ణ అమావాస్య రానుంది. ఇది ఏప్రిల్ 4 న రాత్రి 12.51 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 5 న మద్యాహ్నం 2.20 గంటలకు ముగుస్తుంది.

మే

మే

వైశాఖ అమావాస్య శనివారం, మే 4, 2019 న రానుంది. మే 4వ తేదీ, ఉదయం 4.04 గంటలకు ప్రారంభమయిన అమావాస్య, మే 5న ఉదయం 4.15 గంటలకు ముగుస్తుంది.

జూన్

జూన్

జూన్ 3, 2019 న జ్యేష్ట అమావాస్య రానుంది. ఈ అమావాస్య జూన్ 2 వ తేదీన 4.40 గంటలకు ప్రారంభమై, జూన్ 3 న మద్యాహ్నం 3.32 గంటలకు ముగుస్తుంది.

జూలై

జూలై

ఆషాడ కృష్ణ అమావాస్యగా పేరున్న ఈ అమావాస్య, జూలై 2, 2019న ఉదయం 3.06 గంటలకు ప్రారంభమై, జూలై 3, వేకువజామున 12.46 గంటలకు ముగియనుంది. అదేవిధంగా జూలై 31 వ తేదీన, మరొక అమావాస్య రానుంది. దీనిని, శ్రావణ కృష్ణ అమావాస్యగా పరిగణించడం జరుగుతుంది. ఇది జూలై 31, 2019 ఉదయం 11.57 కు ప్రారంభమై, ఆగస్ట్ 1 ఉదయం 8:41 కు ముగియనుంది.

ఆగస్టు

ఆగస్టు

ఆగష్టు 1, 2014 న 8.41 గంటలకు ముగుస్తున్న శ్రావణ కృష్ణ అమావాస్య, జూలై 31 ఉదయం 11:51 నుండి కొనసాగుతుంది. హిందూ నెల కూడా గ్రెగోరియన్ నెల ప్రకారం మారుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్యను బాద్రపద అమావాస్యగా కూడా పరిగణించడం జరుగుతుంది.

అంతేకాకుండా ఆగస్టు 29, శుక్రవారం నాడు మరో అమావాస్య రానుంది, దీనిని భాద్రపద కృష్ణ అమావాస్యగా పరిగణించడం జరుగుతుంది. ఇది ఆగస్ట్ 29, రాత్రి 7:55 కు ప్రారంభమై, ఆగస్టు 30 సాయంత్రం 4.07 గంటల వరకు కొనసాగుతుంది.

సెప్టెంబర్

సెప్టెంబర్

దీనిని ఆశ్వయుజ కృష్ణ అమావాస్యగా పరిగణిస్తారు. ఇది సెప్టెంబర్ 28, 2019 శనివారం నాడు పరిశీలించబడుతుంది. ఈ అమావాస్య, సెప్టెంబర్ 28 న ఉదయం 3.46 గంటలకు ప్రారంభమై, అదేరోజు రాత్రి 11.56 గంటలకు ముగియనుంది.

అక్టోబర్

అక్టోబర్

అక్టోబర్లో వస్తున్న ఈ అమావాస్యను కార్తిక కృష్ణ అమావాస్య అని కూడా పిలుస్తారు. అక్టోబరు 27, 2019 న ఆదివారం మద్యాహ్నం 12.23 గంటలకు ప్రారంభమయ్యే ఈ అమావాస్య, అక్టోబరు 28 న ఉదయం 9.08 వరకు కొనసాగుతుంది.

నవంబర్

నవంబర్

నవంబర్లో వచ్చే ఈ మార్గశిర కృష్ణ అమావాస్య 25 నవంబర్, సోమవారం నాడు ఉదయం 10.40 గంటలకు మొదలయి, 26 నవంబర్, మంగళవారం నాడు ఉదయం 8.35 గంటలకు ముగుస్తుంది.

డిసెంబర్

డిసెంబర్

డిసెంబర్లో వచ్చే పుష్య కృష్ణ అమావాస్య, గురువారం, డిసెంబర్ 25, శుక్రవారం సాయంత్రం ఉదయం 11.17 నుండి ప్రారంభమై, డిసెంబర్ 26, శుక్రవారం ఉదయం 10.43 వరకు కొనసాగుతుంది.

అమావాస్య పూర్వీకుల ఆరాధనకు అంకితం చేయబడిందని చెప్పబడింది. ఈరోజు విరాళాలు, దానాలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Desktop Bottom Promotion