Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
బతికున్న నరసింహ స్వామి దేవాలయం.. దర్శించుకుంటే 24 గంటల్లో కోరికలు నెరవేరిపోతాయి! ఎక్కడుందంటే?
హిందూ దేవుళ్లలో నరసింహ స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడిగా పేరుంది. నరసింహ స్వామి ఆలయాలకు కూడా చాలా ప్రత్యేకతలు, చరిత్ర ఉంటుంది. ప్రజలందరినీ హింసిస్తున్న హిరణ్య కశ్యప అనే రాక్షసుడిని విష్ణువు నరసింహ స్వామి అవతారంలో అవతరించి అంతమొందించిన విషయం తెలిసిందే. సగం మనిషి, సగం జంతువు ఆకారంలో నరసింహ స్వామి తన చేతి గోళ్ళతో హిరణ్యకశ్యపుడి పొట్టను చీల్చి అతడిని చంపేశారు.
ఇలా చంపిన తరువాత నరసింహ స్వామి ఉగ్రరూపంలో భగభగా మండిపోతూ ఉంటారట. అలా ఉగ్ర రూపంలో ఊగిపోతున్న స్వామి వారిని చల్లబరిచేందుకు దేవతలు వెయ్యి నూతుల నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేశారట. అక్కడ ఉద్భవించిన గుడే కడప జిల్లాలోని వెయ్యి నూతుల నరసింహ స్వామి దేవాలయం. ఆ ఆలయం విశిష్టతలు ఏంటి? ఆ ఆలయ ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గుడి ఎక్కడుందంటే?
నరసింహ స్వామి వారు హిరణ్య కశ్యపుడిని చంపిన తరువాత కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి ప్రాంతంలోని వెయ్యి నూతుల కోన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఉగ్ర రూపంలో ఊగిపోతున్న స్వామి వారిని చల్లబరిచేందుకు దేవతలకు ఏం చేయాలో అర్ధం కాక, ఆ కొండ చివరలో వెయ్యి నూతులను సృష్టించారట.
ఆ నూతుల్లోని నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేసిన తరువాత స్వామి వారు శాంతించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ దేవాలయంలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశారని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడి నరసింహ స్వామి ఉగ్ర రూపానికి ప్రతీకమని, నిజమైన ఉగ్రరూపమని చెబుతుంటారు. స్వామి వారికి అతీతమైన శక్తులు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
స్వామి వారు కృతయుగంలో జన్మించారని అనడానికి ఈ దేవాలయము ఒక సాక్ష్యమని, నిదర్శనమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి అనేక మంది భక్తులు వచ్చి తమ కోరికలు చెప్పుకొని, నోములు నోచుకోని, మొక్కులు చెల్లించుకుంటారు.
స్వామి వారి మహిమలు
ఇక్కడి నరసింహ స్వామి ఇంకా బతికే ఉన్నారనే వార్తలు వస్తుంటాయి. స్వామి వారు నిజంగానే ఆ క్షేత్రంలో తిరుగుతున్నారనే ఆనవాళ్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని భక్తులు చెబుతుంటారు. వారికి అతీతమైన మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి స్వామి వారిని దర్శించుకుంటే అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయని భక్తులు చెబుతుంటారు. ఈ దేవాలయానికి వచ్చి, స్వామి వారిని దర్శించుకొని వెళితే ఏ పని అయినా క్షణాల్లోనే పూర్తవుతుందని చెబుతుంటారు.
పైగా ఇక్కడ స్వయంభుగా వెలిసిన నరసింహుడు ఉగ్రరూపం తరువాత చల్లబడ్డాడు కాబట్టి, ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. మీరు కూడా ఓసారి ఈ ఆలయాన్ని సందర్శించండి మరి. ఈ ఆలయాన్ని సందర్శించి, మనశ్శాంతితో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందండి.



Click it and Unblock the Notifications
