Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
అక్కడ గంటకు పదిరూపాయలకే అద్దెకు అమ్మాయిలు, భార్యలను అద్దెకిస్తున్న భర్తలు, వారికి లక్షల సంపాదన
మధ్యప్రదేశ్ లోని శివపురిలో దధీచ సంప్రదాయంలో అద్దెకు భార్యలు. అక్కడ గంటకు పదిరూపాయలకే అద్దెకు అమ్మాయిలు, భార్యలను అద్దెకిస్తున్న భర్తలు, లక్షలు సంపాదన.
భారతదేశంలోని స్త్రీ ను ఒక ఆటబొమ్మల ఒక వస్తువుగా చూడటం ఇప్పటికీ కొనసాగుతుందనే చెప్పాలి. అమ్మాయిలు నిత్యం ఏదో రకంగా చీదరింపులు ఎదుర్కొనే పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. నేటికీ స్త్రీ వ్యక్తిత్వాన్ని కొన్నిచోట్ల దిగజార్చుతోంది ఈ సమాజం. కేవలం పడక సుఖానికే మహిళ అంకితం అన్నట్లుగా ఇంకా కొందరు భావిస్తున్నారు. రోజు రోజుకి స్త్రీలపై కీచక పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి.

పరాయి పురుషుడికి అద్దెకు
స్త్రీ గర్భాశయాన్ని అద్దెకిచ్చే దశ నుంచి, భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడికి అద్దెకిచ్చే దశకి వచ్చారు.. అవును, మీరు విన్నది నిజంగా నిజమే. భార్యను పరాయి పురుషుడికి అద్దెకి ఇచ్చే సంప్రదాయం ఇంకా కొన్ని చోట్ల ఉంది. స్త్రీని దేవతగా పూజించిన దేశం మనది.

అద్దెకు తెచ్చుకునే సంస్కృతి
పురాణాలు, ఇతిహాసాల్లో సైతం వారికి పెద్దపీటనే వేశాయి. సమాజంలో అన్ని వస్తువులు అద్దెకు తెచ్చుకునే సంస్కృతి ఉంది. కానీ మధ్యప్రదేశ్‌లో సమాజం తలదించుకొనేలా మహిళలను అద్దెకు ఇస్తారు. ఇలాంటి దారుణాలు మధ్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్, గుజరాత్‌లో తరచూ జరుగుతుంటాయి.

వారి సంప్రదాయం ప్రకారం అద్దెకు ఇవ్వొచ్చట
దధీచ ఈ సంప్రదాయాన్ని మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో పాటిస్తున్నారు. వారి సంప్రదాయం ప్రకారం స్త్రీలను, వారి సొంత భార్యలను ఇతరులకు ఇవ్వవచ్చు అట.అద్దెకి ఇవ్వవచ్చు. స్టాంపు పేపరుపై కేవలం ఒకే ఒక సంతకంతో, ఒక స్త్రీ భర్త మారిపోతాడు. ఒక్కసారి ఒప్పందం కుదిరిన తర్వాత, ఆ మహిళ మరో వ్యక్తికి అమ్ముడుపోతుంది.

స్టాంప్ పేపర్లపై సంతకం
ఈ ఒప్పందాన్ని అధికారికం చేయటానికి రూ.10 నుంచి రూ.100 వరకూ ఉన్న స్టాంపు పేపర్లపై వీళ్లు సంతకం చేస్తారు. ఎంత ఎక్కువ ధర పలికితే, అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచివుంటుంది. అలా ఒప్పందం సమయం అయిపోయాక, ఆ తిరిగొచ్చిన స్త్రీ మళ్లీ మరొక వ్యక్తి కోసం బేరంలో నిలుచుంటుంది.

నెలకి 8000 రూపాయలకు అద్దెకిచ్చాడు
గతంతో గుజరాత్‌కు చెందిన ఓ నిరుపేద వ్యక్తి తన భార్యను ఒక పటేల్ ఇంట్లో నెలకి 8000 రూపాయల అద్దె భార్యగా పంపాడు. మెహ్సానా, పతన్, రాజకోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లో పిల్లలని కనలేని స్త్రీలు, పేద కుటుంబాల వారికి డబ్బు ఎరగా వేసి ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు.

డబ్బులు సంపాదిస్తున్న మధ్యవర్తులు
అటవీ ప్రాంతంలో ఉండే గిరిజన యువతులకు రూ.500 నుంచి రూ.60000 ఇచ్చే విధంగా మధ్యవర్తులు బేరం ఆడతారు. అనంతరం వారికి ఇచ్చే డబ్బులో మధ్యవర్తులు కమీషన్లు వసూలు చేసుకుంటారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో వ్యక్తి నెలకి రూ.1.5 లక్ష నుంచి 2 లక్షల వరకూ సంపాదిస్తాడు.

పోలీసుల ఎదుటే
ఇలాంటి చర్యలు అనేకసార్లు పోలీసుల ఎదుట కూడా జరిగాయి. కానీ స్త్రీలు తమంతట తాము నోరువిప్పనంతకాలం, తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోనంతకాలం ఎలా అలాంటి వాటిపై చర్యలు తీసుకోగలరు? ఆడవారు ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఆ జిల్లాల పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు.

గంటకు పది రూపాయలు
కొందరు తమ భార్యల్ని గంటల ప్రకారం కూడా అద్దెకు ఇస్తుంటారు. ఆర్థిక పరిస్థితుల వల్ల గంటకు పది రూపాయలకు కూడా అద్దెకు ఇచ్చిన భర్తలున్నారు.ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను లోబర్చుకుని వారిద్వారా విటులకు వలవేసి డబ్బులు గుంజుతున్న ముఠాలు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలానే ఉన్నాయి. అలాంటి ఉదంతాలు రోజుకొక్కటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.



Click it and Unblock the Notifications
