Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Maha Kumbh Mela 2025: 1000 అశ్వమేథ యాగాలు చేస్తే వచ్చే ఫలితం..కుంభమేళాలో ఆ రోజున స్నానం చేస్తే లభిస్తుంది!
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, ఆథ్యాత్మిక కార్యక్రమైన మహాకుంభమేళా ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ప్రారంభమైంది. దేశ విదేశాల నిత్యం లక్షల మంది భక్తులు, నాగసాధువులు, సన్యాసులు, బుషులతో ప్రయాగరాజ్ నగరవీధులు కిక్కిరిసిపోతున్నాయి. కోట్ల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తతెల్తకుండా అన్ని ఏర్పాట్లును యూపీ ప్రభుత్వం పకగడ్బందీగా ఫ్లాన్ చేసింది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహాకుంభమేళా కొనసాగుతుంది.
144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన మహాకుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ లోని గంగా,యమునా,సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే అప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయని,మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే కుంభమేళా సమయంలో కూడా కొన్ని ప్రత్యేక తేదీల్లో స్నానం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట. శనిదేషాలు అన్నీ తొలగిపోతాయంట.

అమృత స్నానం జరిగే తేదీలివే
పౌష పూర్ణిమ,జనవరి 13
మకర సంక్రాంతి(మొదటి శని స్నానం)
మౌని అమావాస్య,జనవరి 29(రెండవ శని స్నానం)
వసంత పంచమి,ఫిబ్రవరి 3(మూడవ శని స్నానం)
అచల సప్తమి,ఫిబ్రవరి 4,2025.
మాఘ పూర్ణిమ,ఫిబ్రవరి 12,2025.
మహా శివరాత్రి,ఫిబ్రవరి 26,2025.
రెండవ అమృత స్నానం
కుంభమేళాలో మెదటి అమృత స్నానం మకర సంక్రాంతి నాడు పూర్తవగా..రెండో అమృత స్నానం జనవరి 29,2025న ఉంటుంది. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 13 నాగ సాధు అఖాడాలు సంగం నది ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని భక్తిలో మునిగిపోయారు. ఈ నాగ సాధువులే అమృత స్నానం రోజున ముందుగా స్నానం చేస్తారు. ఋషులు,సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
అమృత స్నానం చేయడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మహా కుంభమేళాలో అమృత స్నానం చేసిన తర్వాత ఋషులు, సాధువులు భగవంతుడిని ధ్యానిస్తారు. ఈ కారణంగానే సాధువులు, ఋషులు లోక సంక్షేమం, మోక్షం కోసం మహా కుంభమేళాకు వస్తారు.



Click it and Unblock the Notifications