Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఓం నమః శివాయ:..శివరాత్రి రోజున పఠించాల్సిన 5 ప్రధాన మంత్రాలు,వాటి విశిష్టత
దేశవ్యాప్తంగా ఇవాళ మహా శివరాత్రి పండుగను జరుపుకుంటున్నారు. హిందూ ధర్మంలో మహా శివరాత్రికి అత్యంత విశిష్ఠమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణతో పాటు శివనామ స్మరణ చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది.
శివరాత్రి రోజున మనసు, వాక్కు లగ్నం చేసి కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల తెలిసి, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. మహా శివరాత్రి రోజున తప్పకుండా చదవాల్సిన, అత్యంత ప్రభావవంతమైన 5 ప్రధాన మంత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

శివ పంచాక్షరీ మంత్రం
ఇది శివుడికి సంబంధించిన మంత్రాలలో అత్యంత సరళమైనది, శక్తివంతమైనది.
మంత్రం: ఓం నమః శివాయ.
అర్థం: నేను శివునికి నమస్కరిస్తున్నాను.
విశిష్టత: ఈ మంత్రంలోని ఐదు అక్షరాలు (న, మ, శి, వా, య) పంచభూతాలకు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) ప్రతీకలు. ఈ మంత్రాన్ని నిరంతరం జపించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఆత్మ శుద్ధి జరుగుతుంది, మోక్ష మార్గం సుగమం అవుతుంది. శివరాత్రి నాడు కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి.
మహా మృత్యుంజయ మంత్రం
ఆరోగ్య సమస్యలు, మృత్యు భయం ఉన్నవారు ఈ మంత్రాన్ని తప్పక పఠించాలి. ఇది రుగ్వేదంలోని అత్యంత శక్తివంతమైన మంత్రం.
మంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్..ఉర్వార్ రుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్.
భావం: మూడు కన్నులు గలవాడు, సుగంధ పరిమళాలు వెదజల్లేవాడు, జీవులను పోషించేవాడు అయిన పరమేశ్వరుని మేము పూజిస్తున్నాము. దోసకాయ తీగ నుండి ఎలా విడివడుతుందో, అలాగే మమ్మల్ని మృత్యు బంధాల నుండి విడిపించి అమరత్వాన్ని ప్రసాదించు గాక.
ఫలితం: ఈ మంత్ర జపం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి, అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
రుద్ర గాయత్రీ మంత్రం
శివుని అనుగ్రహం, బుద్ధి కుశలత కోసం ఈ మంత్రాన్ని పఠించాలి.
మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి..తన్నో రుద్రః ప్రచోదయాత్.
భావం: ఆ పరమ పురుషుని తెలుసుకుందాం.. మహాదేవుని ధ్యానిద్దాం.. ఆ రుద్రుడు మన బుద్ధిని ప్రేరేపించి సన్మార్గంలో నడిపించుగాక.
ఫలితం: ఈ మంత్రం వల్ల మానసిక ఆందోళనలు తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.శివరాత్రి రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలని సూచించారు.
శివ యజుర్ మంత్రం (కర్పూర గౌరం)
చాలా మందికి హారతి సమయంలో ఈ మంత్రం వినడం అలవాటు. ఇది శివుని స్వరూపాన్ని వర్ణించే అద్భుతమైన శ్లోకం.
మంత్రం: కర్పూర గౌరం కరుణావతారం..సంసార సారం భుజగేంద్ర హారం..సదా వసంతం హృదయారవిందే..భవం భవానీ సహితం నమామి.
భావం: కర్పూరం వలె తెల్లని కాంతి గలవాడు, కరుణకు ప్రతిరూపం, ఈ ప్రపంచానికి సారం, పామును హారంగా ధరించినవాడు, ఎల్లప్పుడూ నా హృదయ కమలంలో నివసించే పార్వతీ సమేతుడైన శివునికి నమస్కరిస్తున్నాను.
మోక్ష మంత్రం
శివరాత్రి నాడు శివాభిషేకం చేసేటప్పుడు ఈ చిన్న మంత్రాన్ని జపించవచ్చు.
మంత్రం: ఓం నమో భగవతే రుద్రాయ
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల రుద్రుని అనుగ్రహం లభించి, కోరికలు నెరవేరుతాయి.
మంత్ర జపం ఎలా చేయాలి?
శివరాత్రి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
విభూతిని నుదుట ధరించి, రుద్రాక్ష మాలతో జపం చేయడం శ్రేయస్కరం.
ముఖ్యంగా లింగోద్భవ కాలంలో (అర్ధరాత్రి సమయంలో) ఈ మంత్రాలను పఠించడం వల్ల కోటి రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications