For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Maha Shivratri 2022: శివుని అనుగ్రహం పొందేందుకు ఇంట్లో ఇలా పూజించండి...

మహా శివరాత్రి సమయంలో మీ ఇంట్లోనే శివుడిని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

హిందువులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ పురాణాల ప్రకారం మహా శివరాత్రి రోజేనే లింగరూపం ఉద్భవించిందని..

Maha Shivratri 2021: How To Worship Lord Shiva At Home in Telugu
మరికొన్ని ఇతిహాసాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజునే పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మీ ఇంట్లోనే శివుడిని ఎలా ఆరాధించాలి. శివ పురాణాల ప్రకారం, మహా శివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడిని స్తుతించడానికి ఇంట్లోనే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. ఆ పూజా విధానం ఏమిటి? ఇలా పూజలు చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Mercury Transit 2021:మహాశివరాత్రి రోజున బుధుడి సంచారంతో.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!Mercury Transit 2021:మహాశివరాత్రి రోజున బుధుడి సంచారంతో.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!

గరుడ పురాణం ప్రకారం..

గరుడ పురాణం ప్రకారం..

గరుడ పురాణం ప్రకారం, మహా శివరాత్రి రోజున ఇంట్లోనే వ్రతం చేసుకునే సమయంలో కొన్ని నియమాలను మనసులోనే సంక్పలించుకోవాలి. ‘హే మహాదేవా! నేను చతుర్దశి రోజున జాగరణ చేస్తాను. నా భక్తి సామర్థ్యాన్ని బట్టి దాన, తప, హోమాన్ని చేయగలను. నేను ఈరోజు ఉపవాసం ఉంటాను. రెండో రోజు మాత్రమే తింటాను, నా విన్నపాలన్నీ ఆలకించు, మోక్షాలను అనుగ్రహించు శివా' అని సంక్పలం చేసుకోవాలి.

ఈ నియమాలను పాటించండి..

ఈ నియమాలను పాటించండి..

మహా శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేచి నదిలో స్నానం చేయండి. మీరు ఇంట్లో స్నానం చేస్తున్నట్లయితే.. కొంచెం నువ్వులను నూనె వేసి నీటిలో ఉడకబెట్టండి. దీన్ని పరిపూర్ణ శుద్ధీకరణ అని నమ్ముతూ ఉపవాసాన్ని ప్రారంభించాలి.

ఇవి సిద్ధం చేసుకోండి..

ఇవి సిద్ధం చేసుకోండి..

ఇంట్లో శివుని ఆరాధనకు అనుకూలంగా ఉండే ఒక గదిని సిద్ధం చేసుకోండి. అందులో ఒక దస్తావేజును సమర్పించండి. ఇది స్వచ్ఛతకు చిహ్నం. తర్వాత శివలింగానికి అభిషేకరం చేయాలి. ఆ తర్వాత లింగంపై కుంకుమపువ్వు వేయాలి. ఇది జ్ణానం యొక్క చిహ్నం. ఐదు రకాల పండ్లను సమర్పించాలి. ఇవి కోరికలు తీర్చేందుకు ప్రతీక. దీని తర్వాత దూపం యొక్క సువాసనతో దీపం వెలిగించండి. ఇది జ్ణానానికి సంకేతం. చివరగా ప్రాపంచిక సంతృప్తిని సూచించే బిల్వా పత్రాన్ని సమర్పించండి.

శివుని అనుగ్రహం కోసం..

శివుని అనుగ్రహం కోసం..

శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు నిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు శివలింగానికి నీరు, పాలు, తేనెతో అభిషేకం చేయాలి. అప్పుడు దీపం వెలిగించి, శివుడికి పువ్వులు, పండ్లు అర్పించి శివుడిని జపించండి. రాత్రి శివ నామస్మరణ చేసుకుంటూ జాగరణ చేయండి.

శివ కథలు వింటూ..

శివ కథలు వింటూ..

మహా శివరాత్రి రోజున జాగరణ సమయంలో శివ కథలు వింటూ మూడు, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం వరకూ మౌనవ్రతం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ' మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి.

శివరాత్రి మరుసటి రోజు..

శివరాత్రి మరుసటి రోజు..

శివరాత్రి మరుసటి రోజున ఆహారం, వస్త్రాలను, ఛత్రం వంటి వాటిని దానం చేయాలి. అనంతరం శివపార్వతుల చిత్రపటాలకు లేదా విగ్రహాలకు పుష్పాలు, బిల్వపత్రాలు, పంచామ్రుతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు శివుని అనుగ్రహం పొందుతారు.

FAQ's
  • 2022 సంవత్సరంలో మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది?

    2022 సంవత్సరంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి ఉత్సవాలను జరుపుకోనున్నారు. హిందువులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ పురాణాల ప్రకారం మహా శివరాత్రి రోజేనే లింగరూపం ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజునే పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని పండితులు చెబుతున్నారు.

English summary

Maha Shivratri: How To Worship Lord Shiva At Home in Telugu

Maha Shivratri 2021: Here we explain How To Worship Lord Shiva At Home in Telugu, Have a look.
Desktop Bottom Promotion