Latest Updates
-
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.?
Maha Shivratri 2022:శివ లింగానికి రుద్రాభిషేకం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలివే...
మహా శివరాత్రి 2022 సందర్భంగా, రుద్రాభిషేకం అంటే ఏమిటి, పూజా విధానం కావావల్సిన వస్తువులేంటో తెలుసుకోండి.
హిందువుల పండుగలలో మహా శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుడికి అంకితమివ్వబడిన ఈ పండుగను మరి కొద్ది గంటల్లో దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. లింగం ఉద్భవించిన ఈరోజున భోళాశంకరుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా శివునికి అనేక ప్రాంతాల్లో చాలా పేర్లు ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో శివుడిని మహాదేవ్, శంకరుడు, మల్లికార్జునుడు, భోలే నాథ్, ఈశ్వర్ తదితర పేర్లతో పిలుస్తుంటారు. అయితే వీటన్నింటిలో శివునికి సంబంధించిన పేర్లలో రుద్ర ఒకటి. రుద్ర అనే పదం వేదాలలో ప్రస్తావించబడింది. శివుని స్వభావం యొక్క భయానక, దూకుడు మరియు విధ్వంసక వైపు ద్రుష్టి కేంద్రీకరించబడిందని చాలా మంది నమ్ముతారు.

రుద్ర తాండవం, శివుని కనికరం లేని స్వభావం యొక్క ఉదాహరణగా భావిస్తారు. ఈ సందర్భంగా శివుడిని రుద్ర అని ఎందుకు పిలుస్తారు? మహా శివరాత్రి రోజున రుద్రాభిషేకం కచ్చితంగా ఎందుకు చేయాలి.. రుద్రాభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రుద్రాభిషేకం పూజ..
సాధారణంగా శివుడిని శివ లింగం రూపంలో పూజిస్తారు. అనేక దేవాలయాల్లో మనకు ఇదే కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ శివుడిని అనేక పేర్లతో కొలుస్తారు. అయితే వాటిలో ప్రముఖమైనది రుద్రుడు. శివుని రుద్ర స్వరూపం ఉగ్రమైనది. ఆ భగవంతునికి ఇష్టమైన పూజా విధానం రుద్రాభిషేకం అని పండితులు చెబుతారు. రుద్రాభిషేకంలో భాగంగా పాలు, గంగాజలం, పెరుగు, చెరుకు రసం, గంధపు పొడి వంటి పవిత్ర ద్రవాల మిశ్రమంతో అభిషేకం చేయాలి. ఈ సమయంలో సానుకూల శక్తులు ఉంటాయని చాలా మంది నమ్ముతారు.

పాటించాల్సిన నియమాలు..
రుద్రాభిషేకం చేసే సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు చేసిన అభిషేకం నుండి ఫలితం వస్తుంది. చాలా మంది రుద్రాభిషేకం చేసే సమయంలో చెరువులో నుండి లేదా బావిలో నుండి తెచ్చిన బిందెలతో తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుంటారు. ఇలా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే చెరువులలో లేదా బావిలోని నీటిలో విషపదార్థాలు ఉండటం వల్ల మీరు ఆ జలంతో చేసిన అభిషేకం ఫలితం శూన్యంగా మారిపోతుంది. కాబట్టి మీరు శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో కలశంలో ఉంచిన శుభ్రమైన నీటితో అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు.

రుద్రాభిషేక పూజకు కావాల్సిన పదార్థాలు..
* అభిషేక ద్రవాలు : గంగాజలం, మరియు గులాబీ నీళ్లు, ఉడకని ఆవు పాలు, చెరకు రసం లేదా పండ్ల రసాలు కలిపిన నీరు.
* పంచామృతం అంటే ఆవుపాలు(ఉడకనివి), పెరుగు, తేనే, చక్కెర మరియు నెయ్యి
* గంగాజలం కలిపిన నీటిని చిలకరించడానికి చిన్న కుశ గడ్డి మరియు ఒక స్పూన్, ధూపం, కర్పూరం, నేతి దీపం
* గంధపు పొడి, సుగంధ నూనెలు, అగర్ బత్తీలు(సువాసన వెదజల్లేవి), అక్షింతలు(బియ్యం)
* నైవేద్యాలు : స్వీట్లు, బట్టలు, పూలు, పండ్లు, యాపిల్ చెట్టు ఆకులు, తమలాపాకులు, కొబ్బరి

మారేడు ఆకులను..
శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో శివ లింగంపై మారేడు దళాలను ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్లతో కలశపూజ చేసి ప్రతి కలశంలో శివపంచాక్షరితో అభిమంత్రించాలి. ఇలా ముందుగా 108 కళశాలలో నీటిని సిద్ధం చేసుకుని ఆ నీటిని శివపంచాక్షరితో అభిమంత్రించి సిద్ధంగా ఉంచుకోవలి. ఇలా రెడీగా ఉన్న నీటితో మాత్రమే శివునికి అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తయ్యేసరికి కలశంలో ఉన్న నీరు మొత్తం సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి. ఇలా మారేడు దళాలు ఉంచి కలశంలో ఉన్న నీటితో అభిషేకం చేస్తే రుద్రాభిషేకం పూర్తవుతుందని, అప్పుడే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

ఉపవాసం ఉండాలి..
మహా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. స్నానం చేసిన అనంతరం పూజా గదిని శుభ్రం చేసుకుని ఈ పండుగ సమయంలో అంటే చతుర్దశి నాడు కచ్చితంగా ఉపవాసం ఉండాలి. మహా శివరాత్రి రోజున పూజా విధానాన్ని శ్రీక్రిష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడిని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు. వాటిలో ఒకటి శివపూజ, ఉపవాసం, జాగారణ. వీటిలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటూ శివనామ స్మరణ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితు చెబుతారు. ఉపవాసం ఉండటం వల్ల శారీరక శుద్ధి జరుగుతుందని, జాగారణ చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయట.

ఈ పువ్వులతో శివుని పూజ..
* మహా శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్లాలి.
* ‘ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి.
* శివునికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి.
* శివ లింగానికి పంచామృతాన్ని సమర్పించాలి.
* మారేడు ఆకులతో ఇంట్లో, ఆలయంలో శివుడిని ఆరాధించాలి.
* ఈరోజున ఉపవాసం, జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
* ఉపవాసం ఉండే వారు కేవలం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి.
* పురుషుడు శివుని యొక్క గర్భగుడికి వెళ్లే సమయంలో చొక్కాలకు బదులుగా కండువాలను ధరించాలి.
* శివలింగానికి కచ్చితంగా జలాభిషేకం చేయాలి.
* మహా శివరాత్రి రోజున పేదలకు అన్నదానం, ఇతరుల దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.
* శివుడికి చందనం, విభూదిని పెడితే సరిపోతుంది.
* నాగమల్లి పువ్వులంటే శివుడికి ఎంతగానో ఇష్టం. ఈ పువ్వులతో శివరాత్రి రోజున పూజ చేస్తే.. శివుని అనుగ్రహం దక్కుతుంది.
హిందువుల పండుగలలో మహా శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివుడికి అంకితమివ్వబడిన ఈ పండుగను 2022లో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. మహా శివరాత్రి పండుగ ప్రతి ఏటా హిందూ పంచాంగం ప్రకారం, మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి.



Click it and Unblock the Notifications