Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Mahashivratri: మహాశివరాత్రి నాడు ఈ పండు నైవేద్యంగా పెడితే..ఐశ్వర్యవంతులైపోతారు
ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రిని జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు పరమేశ్వరుడి ఆశిస్సుల కోసం పూజలు చేస్తారు,ఉపవాసం ఉంటారు,రాత్రంతా జాగారం చేస్తారు. అయితే మహాశివరాత్రి నాడు పూజ సమయంలో చాలామంది బంతి పువ్వులు, ధూతుర పువ్వులను ఉపయోగిస్తారు. పరమేశ్వరుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఒక పండు లేకుండా శివుని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అదే బేల్ పండు.
బేల్ పండు.. భారతదేశంలోని పురాతన పండ్లలో ఒకటి, దీని గురించి రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. దీనిని బిల్వ పండు,మారేడు పండు, ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. భారతదేశంతో పాటు ఈ పండు చైనా, యూరప్, రష్యా,అనేక ఇతర దేశాలలో పండిస్తారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని, ఎముకలను బలోపేతం చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. శివయ్యకు ఈ పండు అంటే చాలా ఇష్టం, ఈ బెల్ పండు ఆయనకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండును శివుడి పూజలో మాత్రమే కాకుండా, ఆయనకు ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పిస్తారు.

బిల్వ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మారేడు పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది..హైపర్ టెన్షన్ తగ్గుతుంది..కొలెస్ట్రాల్ కరుగుతుంది..గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. బిల్వ వృక్షం ఆకులు కూడా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి.
బిల్వ ఆకులు.. మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు ఒంట్లో వేడి పోతుంది.
శివుడికి నివేదన చేసేందుకు తమలపాకులను కూడా ఉపయోగిస్తారు. తమలపాకులను ఉపయోగించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.



Click it and Unblock the Notifications