Maha shivratri 2025: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఎప్పటి నుంచి ఉండాలో తెలుసా? పూజ చేసేందుకు అసలైన టైం ఇదే

మహా శివరాత్రికి సమయం ఆసన్నమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ మహాశివరాత్రి హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండగను శివయ్య భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో జరుపుకుంటారు. శివాలయాలకు వెళ్లి శివనామస్మరణ చేస్తారు. శివుడిని పూజించడం, అభిషేకించడం, ఉపవాసం ఉండడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజున శివుడిని పూజించడం వలన సాక్ష్యాత్తు శివుడి అనుగ్రహం లభిస్తుందని, శివయ్య కోరిన కోరికలు తీరుస్తాయని భక్తులు నమ్ముతుంటారు. అంతటి పవిత్రమైన ఈ శివరాత్రి పండగ ఏ సమయంలో జరుపుకోవాలి? ఏ సమయంలో ఈ పండగ మొదలవుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శివరాత్రి ఎప్పుడొస్తుందంటే

తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మహా శివరాత్రి.. మాఘ మాసంలో కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి అంటే.. ఫిబ్రవరి 26న వస్తుంది. ఆరోజున ఉదయం 11:08 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. అయితే బ్రహ్మముహూర్తం ఉదయాన్నే ప్రారంభమవడం వలన ఆరోజున ఉదయం నుంచే శివుడి పూజలు చేయొచ్చని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే లేచి స్నానమాచరించి పూజలు నిర్వహించాలని పేర్కొంటున్నారు.

Maha shivratri 2025 pooja and Jagaran starting timings in telugu

శుభ ముహూర్తాలు:

బ్రహ్మ ముహుర్తం: ఫిబ్రవరి 26న ఉదయం 5:17 గంటల నుంచి 6:05 గంటల వరకు
మొదటి ప్రహార్ పూజ సమయం: సాయంత్రం 6:29 గంటల నుంచి రాత్రి 9:34 గంటల వరకు
రెండో ప్రహార్ పూజ సమయం: ఫిబ్రవరి 26న రాత్రి 9:34 గంటల నుంచి 12:39 గంటల వరకు
మూడో ప్రహార్ పూజ సమయం: ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 12:39 గంటల నుంచి 3:45 గంటల వరకు
నాలుగో ప్రహార్ పూజ సమయం: ఫిబ్రవరి 27న ఉదయం 3:45 గంటల నుంచి 6:50 గంటల వరకు

పూజ చేసే విధానం ఇదే..

మహా శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. ఈరోజున శివుడి సరిగ్గా పూజించి ఎలాంటి కోరికలు కోరినా నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అయితే ఈరోజున బ్రాహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఒక మట్టి కుండలో నీరు లేదా పాలు నింపి, పైన బిల్వ పత్రాలు, పువ్వులు, బియ్యం వేసి శివలింగానికి సమర్పించాలి. శివాలయం లేకపోతే, ఇంట్లోనే మృత శివలింగాన్ని తయారు చేసి పూజలు చేయవచ్చు. అలాగే శివనామస్మరణతో రోజంతా గడపాలి.

జాగరణ చేస్తే ఏమవుతుంది?

గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాలలో పేర్కొన్నట్లు, మహా శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న వ్యక్తులు శివలింగాన్ని బిల్వపత్రాలతో పూజించడం ద్వారా శివుడి అనుగ్రహం పొందవచ్చు. ఈ సమయంలో, మంత్రాలు తెలియని వారు కూడా భక్తితో శివ లింగంపై నీరు పోసి పూజించడం వలన శివుడి కృపను పొందవచ్చు. జాగరణ చేయడం వల్ల శివుని ఆశీర్వాదం పొందడంతో పాటు నరకం నుంచి విముక్తి, మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ ఒక్క రోజున ఉపవాసం, జాగరణ చేయడం ద్వారా తీర్థయాత్రలు అవసరం లేకుండా శివ అనుగ్రహాన్ని పొందవచ్చు.

Desktop Bottom Promotion