Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
శివుడు, అర్జునుడి మధ్య భీకర యుద్ధం..ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం అక్కడే..
మహాదేవుడికి అంకితం చేయబడిన అతిపెద్ద పండుగ మహాశివరాత్రిని ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. ఈ రోజున శివ భక్తులు సరైన ఆచారాలతో శివుడిని పూజిస్తారు,శివుడికి సంబంధించిన అనేక పురాణగాథలను చదువుతుంటారు,వింటారు. ఇందులో చాలా ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకంగా ఉండే అర్జునుడు, శివుడి మధ్య జరిగిన యుద్ధం గురించి ఇప్పుడు చూద్దాం. మహాభారత కాలంలో పాండవులు బహిష్కరించబడినప్పుడు అర్జునుడు గొప్ప విలుకాడు కావడానికి, దైవిక ఆయుధాలను పొందటానికి తీవ్రమైన తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మహాభారత యుద్ధంలో కౌరవులను జయించటానికి అత్యున్నత శక్తిని పొందడం అర్జునుడి లక్ష్యం.
శివుడు,అర్జునుడి మధ్య భీకర యుద్ధం
హిందూ పురాణాల ప్రకారం.. అర్జునుడు హిమాలయాలలో శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకు సంతోషించిన మహాదేవుడు అతన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో మహాదేవ్ అర్జునుడిని పరీక్షించడానికి వేటగాడు రూపంలో వచ్చాడు. శివుడు అర్జునుడి దగ్గరకు ఒక అడవి పందిని పంపాడు. అర్జునుడు,వేటగాడు ఇద్దరూ ఒకేసారి ఆ అడవి పందిపై బాణాలు వేసి చంపేశారు. కానీ ఒకే ఒక్క బాణం బయటకు వచ్చింది. తన బాణమే పందిని చంపిది అంటూ ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీనిపై వివాదం చెలరేగి శివుడు, అర్జునుడు మధ్య భీకర యుద్ధం జరిగింది.

అర్జునుడు సత్యాన్ని గ్రహించాడు
అర్జునుడి బాణాలు ముగిశాయి,ఎంత చేసినా శివుడిని ఏం చేయలేకపోతున్న అర్జునుడు తీవ్ర కోపంతో తన గట్టిపడిన కత్తిని తీసుకొని భగవంతుని తలపై పగులగొట్టాడు..ఆశ్చర్యకరంగా అది కూడా ముక్కలుగా విరిగిపోయింది. ఇక చెట్లు, రాళ్ళు, బండరాళ్లతో పోరాడటం ప్రారంభించాడు, చివరికి ఒట్టి చేతులతో పోరాడటం ప్రారంభించాడు. కానీ శివుడితో జరిగిన పోరాటంలో తీవ్రంగా కొట్టబడ్డాడు, గాయపడ్డాడు. కొద్దిసేపటికి అర్జునుడు మూర్ఛపోయాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత అతను తన ప్రయాణ ఉద్దేశ్యాన్ని గుర్తుచేసుకున్నాడు, చాలా నొప్పితోనే బాధపడుతూ మట్టితో శివలింగాన్ని తయారు చేసి మహాదేవుడిని ప్రార్థించడం ప్రారంభించాడు.
అర్జునుడు యుద్ధంలో తన పూర్తి బలాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించినా కానీ వేటగాడి రూపంలో ఉన్న శివుడిని ఓడించలేకపోయాడు. ప్రతి బాణం, ఆయుధం విఫలమవడం చూసిన అర్జునుడు.. ఇతను సాధారణ వ్యక్తి కాదని గ్రహించాడు. అర్జునుడు శివుడిని పూజించి, పూల దండను సమర్పించగా.. ఆశ్చర్యకరంగా అదే దండ వేటగాడి మెడలో కనిపించింది. అప్పుడు అర్జునుడు నిజం గ్రహించాడు.
మహాదేవ్ నుండి పాశుపతాస్త్రం
తపస్వి అర్జునుడు శివుని పాదాలపై పడి క్షమాపణ కోరడం ప్రారంభించాడు. అతని భక్తి, అంకితభావానికి సంతోషించిన శివుడు అతనికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధమైన పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు విజయం సాధిస్తాడని ఆశీర్వదించాడు.
ప్రాముఖ్యత
శివుడు, అర్జునుడి మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన ఈ కథ అర్జునుడి తపస్సు, అంకితభావాన్ని వర్ణించడమే కాకుండా నిజమైన భక్తి, శరణాగతితో ఉంటే దేవుడే భక్తుడిని పరీక్షించి అతని సామర్థ్యానికి అనుగుణంగా శక్తిని, ఆశీర్వాదాలను ఇస్తాడని కూడా బోధిస్తుంది. అర్జునుడిలా అంకితభావంతో ఓపికతో పనిచేస్తే ఎవరైనా ఖచ్చితంగా విజయం సాధిస్తాడు.



Click it and Unblock the Notifications