Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Maha Shivratri 2022:శివరాత్రి గురించి పార్వతీదేవికి శివుడు చెప్పిన కథ గురించి తెలుసా...
మహా శివరాత్రి సందర్భంగా శివునికి సంబంధించిన ఈ పురాణ కథల గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం, ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతీ, పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేదీ అని అడిగెను.

అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది జవాబివ్వడంతో పాటు ఆ వత్రం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని,

తెలిసి చేసినా.. తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని దండన నుండి తప్పించుకుని ముక్తి పొందుతారని వివరించారు. అదే సందర్భంలో పార్వతీ దేవికి ఒక ఆసక్తికరమైన కథను చెప్పాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

పర్వత ప్రాంతంలో..
ఒకప్పుడు పర్వత ప్రాంతంలో హింస చేసే వ్యాధుడొకడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం వేళలో అడవికి వేటకు వెళ్లి సాయంకాలం లోపు ఏదో ఒక జంతువును కచ్చితంగా వధించి ఇంటికి తెచ్చేవాడు. అలా ప్రతిరోజూ తనతో పాటు తన కుటుంబం యొక్క కడుపు నింపేవాడు.

ఎంత వెతికినా..
ప్రతిరోజూ అడవికి వేట నిమిత్తం వెళ్లే అతనికి ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఏ జంతువు కనబడదు. దీంతో ఆరోజు సమయం బాగాలేదనుకుని.. ఖాళీ చేతులతోనే ఇంటికి తిరుగు ముఖం పట్టాడు.

దారి మధ్యలో..
అయితే అలా ఇంటికి బయలుదేరిన అతనికి దారిలో ఒక ఆలోచన వచ్చింది. అక్కడే ఓ వాగు కనిపించింది. అక్కడికి నీరు తాగేందుకు జంతువులు కచ్చితంగా వస్తాయని భావించాడు. అంతే ఆ వెంటనే దగ్గర్లోని చెట్టునెక్కి అటు వైపు అదే పనిగా చూస్తున్నాడు.

‘శివ శివ’
అయితే తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను, కాయలను విరిచి కింద పడేశాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఆ సమయంలో ‘శివ శివ' అంటూ గజ గజ వణుకుతూ విల్లు ఎక్కి పెట్టి జంతువుల కోసం ఎదురుచూశాడు.

తెల్లవారుజామున..
అయితే అలా ఎదురుచూస్తున్న అతనికి తెల్లవారుజామున ఓ లేడి కనిపించింది. అంతే వెంటనే తన విల్లులోని బాణాన్ని ఎక్కు పెట్టాడు. అది చూసిన లేడీ ‘వ్యాధుడా నన్ను చంపకు' అని మనిషిలాగా మాట్లాడింది. వ్యాధుడు ఆశ్చర్యపోయి మనిషిలాగా మాట్లాడుతున్నావే.. ఎవరు నువ్వు అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ ‘నేను పూర్వ జన్మలో రంభను' అని సమాధానమిచ్చింది. పూర్వం నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడిని పూజించుట మరిచిపోయాను.

తనకు శాపం..
దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో కామ కూతురయైన నీవు, నీ ప్రియుడిని జింకలుగా పన్నేండేళ్లు గడిపి, ఒక వ్యాధుడు బాణంతో చంపనుండగా శాపవిముక్తిలౌదరని చెప్పాడు. ఇప్పుడు నేను గర్భిణి, అవధ్యను కనుక నన్ను వదలేయ్. మరొక జింక ఇక్కడికి వస్తుంది. అది బాగా బలిసింది. కాబట్టి దాన్ని నువ్వు చంపుకో. నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను' అని వ్యాధుడిని ఒప్పించి వెళ్లెను.

నీ కుటుంబానికి సరిపోను..
మరో జింక కొద్దిసేపటి తర్వాత రావడంతో.. వ్యాధులు సంతోషంగా విల్లు ఎక్కు పెట్టి బాణం విడిచే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషి లాగా ‘ఓ వ్యాధుడా, నేను విరహంతో ఉన్నాను. నాలో మేధోమాంసలు లేవు. నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది. దానిని చంపుకో.. లేదంటే నేను తిరిగి వస్తాను' అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు.

మనసు ఒప్పదు..
అలా నాలుగు జింకలు అతనని వేడుకుని తిరిగి వెళ్లిపోతాయి. అయితే మరో జింక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వ్యాధుడికి మరుసటి రోజు నాలుగు జింకలు వచ్చి నన్ను మొదట చంపు.. లేదు నన్నే మొదట చంపమని తన ఎదుట మోకరిల్లుతాయి. ఆ జింకల నిజాయితీని వ్యాధుడు ఆశ్చర్యపోతాడు. దీంతో అతనికి వాటిని చంపడానికి మనసు ఒప్పదు. దీంతో హింసా వ్రుత్తిపై అతనికి విసుగు కలుగుతుంది.

అన్నింటినీ వదిలేస్తాడు..
అప్పుడు వ్యాధుడు జంతువులనుద్దేశించి ఇలా అంటాడు. ‘నాకు మాంసం అక్కర్లేదు. నేను ఇప్పటి నుండి జంతువులకు బంధించుట, వధించుట, బెదిరించుట, చంపుట వంటివి చేయను. నా కుటుంబం కోసం కూడా నేను ఈ పాపం చేయను. ధర్మాలకు దయ మూలం. మీరు నాకు గురువులాంటివారు. మీరు కుటుంబ సమేతంగా వెళ్లండి' అని వాటిని వదిలిపెడతాడు. అంతలో ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది. దేవదూతలు మనోహరమైన విమానాన్ని తెచ్చి శివరాత్రి సందర్భంగా నీ పాతకం క్షీణించింది. ఉపవాసం మరియు జాగరణ కూడా చేశావు. నీవు తెలియకుండానే యామ, యామమునను పూజించావు, నీవు ఎక్కిన చెట్టు బిల్వవ్రుక్షం. దాని కింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగునపడి ఉంది. నీవు తెలియకుండానే బిల్వపత్రాలను తుంచివేసి శివలింగాన్ని పూజించావు. అని చెబుతారు.

ఆ నక్షత్రాలే..
అలా ఆ కథను పార్వతీదేవికి వినిపించిన పరమేశ్వరుడు.. తనతో ఇలా అంటాడు. దేవీ! ఆ కుటుంబమే నేడు ఆకాశంలో కనిపిస్తున్న మ్రుగ నక్షత్రం. మూడు నక్షత్రాలలో ముందున్న రెండు జింక పిల్లలు. వెనుక ఉన్నది మూడవది ఈ మూడింటి మ్రుగశిరలు అంటారు.



Click it and Unblock the Notifications