Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Margashirsha purnima: మార్గశిర పూర్ణిమ..ఈ రోజు అలా చేస్తే 32 రెట్లు ఎక్కువ ఫలితం
హిందూమతంలో ఏడాది పొడవునా పండగలు,ఉపవాసాలు ఉంటాయి. అయితే మార్గశిర మాసంలో వచ్చే పూర్ణిమ(margasira purnima) చాలా ముఖ్యమైన,పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పూర్ణిమ ఉపవాసానికి(fasting) ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉపవాసం జీవితంలో సానుకూల శక్తిని, శ్రేయస్సును తెస్తుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి,చంద్రుని ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.
మార్గశిర పూర్ణిమ రోజున చేసే దాన,మంచి పనుల ఫలితాలు ఇతర పౌర్ణమి రోజు కంటే ముప్పై రెండు రెట్లు ఎక్కువ ఉంటాయంట. అంటే మార్గశీర్ష పూర్ణిమ నాడు ఉపవాసం చేస్తే..32 పూర్ణిమల సమయాల్లో ఉపవాసం చేయడం వల్ల వచ్చే సమానమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

మార్గశిర పూర్ణిమ ఎప్పుడు
ఈ ఏడాది మార్గశిర పూర్ణిమ తిథి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 15న మధ్యాహ్నం 2:31 గంటలకు పూర్ణిమ తిథి ముగుస్తుంది. ఈ క్రమంలో మార్గశిర పూర్ణిమ ఆదివారం నాడు జరుపుకుంటారు.
మార్గశిర పూర్ణిమ పూజా విధానం
-మార్గశీర్ష పూర్ణిమ రోజున ఉపవాసం ఉండాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున గంగాస్నానం చేస్తే విష్ణువు,లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలాగే తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందుతాడు.
-మార్గశీర్ష పూర్ణిమ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసి విష్ణువు, లక్ష్మీ దేవికి పంచామృతంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఓం నామో నారాయణ మంత్రాన్ని జపించండి.
-లక్ష్మీదేవికి ఎర్రచందనం,ఎర్రని పూలు,పదహారు అలంకారాలు సమర్పించండి.
-నెయ్యి దీపం వెలిగించి, ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి.
-పూర్ణిమ వ్రత కథ, శ్రీ లక్ష్మీ సూక్తం పఠించండి.
-విష్ణువు ఆరతిని నిర్వహించి స్వామికి పాయసం సమర్పించండి.
-చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల అన్ని దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
-పౌర్ణమి రోజు జాగారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అలా చేయలేకపోతే రాత్రి విష్ణువు విగ్రహం దగ్గర నేలపై పడుకోండి.
ఈ మంత్రాలను జపించండి
-ఓం శ్రన్ శ్రేం శ్రన్ సః చన్ద్రాయ నమః
-అథవా రక్తామ్బుజవాసినీ విలాసినీ చన్దంశు తేజస్వినీ । లేదా రక్త రుధిరాంబర హరిసఖి లేదా శ్రీ మనోల్హాదిని.
-శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశ్ విశ్వాధారం గగనసదృశం మేఘం వర్ణం శుభాంగం. -లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వన్దే విష్ణు భవభయహరం సర్వ్లోకైకనాథమ్.



Click it and Unblock the Notifications