Latest Updates
-
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
Merry Christmas 2021 : క్రిస్మస్ పండుగ ప్రత్యేకతలేంటో తెలుసా...!
క్రిస్మస్ పండుగ యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఏసు క్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.

ఈ సమయంలో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఏసు క్రీస్తు పుట్టి ఇప్పటివరకు సుమారు రెండు వేల ఏళ్ల దాటిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. జీసస్ పుట్టినప్పటి నుండి కరుణామయుడిగా.. దయామయుడిగా క్రైస్తవులందరి ఆరాధానలను అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు చరిత్ర ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

క్రిస్మస్ చరిత్ర..
సుమారు 2 వేల సంవత్సరాల క్రితం రోమ్ కింగ్ డమ్ ను పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో లెక్కించాడు. ఈ లెక్కలను ఈజీగా సేకరించేందుకు ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25వ తేదీలోపు చేరుకోవాలని ఆదేశించాడు.

మేరీతో జోసెఫ్ పెళ్లి..
అదే సమయంలో రోమాన్ రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజున మేరీకి గాబ్రియేల్ అనే దైవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుని జన్మనిస్తావు..

ఏసు అనే పేరు..
అంతేకాదు పుట్టే బిడ్డకు ఏసు అని పేరు పెట్టాలని, అతను దేవుని కుమారుడు ' అని తెలియజేసింది. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ తర్వాత అచ్చం దేవదూత చెప్పిన విధంగానే మేరీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

దేవుని వరంతో..
ఆ తర్వాత ఒకసారి దైవదూత జోసెఫ్ కలలో కనిపించి ‘మేరీని విడిచిపెట్టకు.. ఆమె దేవుని వరంతో ప్రెగ్నెంట్ అయ్యింది. కాబట్టి ఆమెకు పుట్టే బిడ్డ దేవుని బిడ్డ. తనను నమ్మిన ప్రజలందరిని వాళ్ల పాపాల నుండి విముక్తి కల్పిస్తాడు'అని చెప్పింది.

మేరీని ప్రేమతో..
అప్పటినుండి జోసెఫ్ దైవదూత మాటలను నమ్మి మేరీని ప్రేమతో ఆదరించాడు. అదే రాజు ఆదేశాల మేరకు జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమై బెత్లేహామ్ కు వెళ్తారు. అయితే వారు అక్కడికి వెళ్లేసరికి వారికి ఉండటానికి చోటు దక్కదు.

పశువుల పాకలో..
చివరికి ఎలాగోలా ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరికి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తుండగా.. ఆ సమయంలో ఆకాశంలో నుండి ఒక దేవదూత కిందికి దిగొచ్చాడు.

వెలుగులు రావడంతో..
వారి చుట్టూ అకస్మాత్తుగా వెలుగులు రావడంతో గొర్రెల కాపరులు భయపడ్డారు. అప్పుడు దైవదూత ‘మీరు భయపడొద్దు.. ఓ శుభవార్తను చెప్పడానికి ఇక్కడికొచ్చాను ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు అని.. తనకు సంబంధించిన ఆనవాళ్లను చెప్పాడు.

అందరికీ చెప్పారు..
వారు వెంటనే పశువుల పాకలో తొట్టిలో పడుకుని ఉన్న శిశువుతో పాటు మేరీ, జోసెఫ్ లను చూశారు. దేవదూత వారికి చెప్పిన విషయాన్ని అందరికీ తెలియజేశారు. అలా 2 వేల ఏళ్ల కింద డిసెంబర్ 24వ తేదీన అర్ధరాత్రి వేళ ఏసు జన్మించాడు.

డిసెంబర్ 25న
అప్పటి నుండి డిసెంబర్ 25వ తేదీన ప్రతి ఏటా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగ నెలరోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అందంగా అలంకరిస్తారు. ఇళ్లలో నక్షత్రాల లైట్లు, క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేస్తారు. ఇదే ఈ పండుగ యొక్క ప్రత్యేకత.
ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఏసు పుట్టినరోజుగా భావిస్తారు. అందుకే ఈరోజున క్రీస్తు వేడుకలను నిర్వహిస్తారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.



Click it and Unblock the Notifications
