Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ 2 మంత్రాలు హనుమాన్ చాలీసాలోనే శక్తివంతమైనవి.. ఇలా జపిస్తే 21 రోజుల్లో ఎలాంటి కోరిన అయినా నెరవేరుతుంది!
హనుమాన్ జయంతి వచ్చేసింది. నేడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్నీ హనుమాన్ ఆలయాన్నీ ముస్తాబయ్యాయి. హనుమంతుడి ఊరేగింపు కోసం వేదికలు కూడా సిద్ధమయ్యాయి. అయితే మన దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని పూజిస్తుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా హనుమంతుడి గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. హనుమంతుడిని మోక్షం కోసం పూజిస్తుంటారు. అయితే హనుమంతుడి అనుగ్రహం కలగాలంటే కొన్ని మంత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఇవి అత్యంత శక్తివంతమైన మంత్రాలని, వీటిని పఠిస్తే కోరుకున్న కార్యాలన్నీ నెరవేరిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ మంత్రాలను పఠించడం వలన శక్తివంతమైన వ్యక్తులుగా మారుతామని చెబుతున్నారు. అసలు ఇంతకీ ఆ హనుమంతుడి మంత్రాలు ఏంటి? వాటిని ఏ విధంగా పఠించాలి? వాటిని పఠించడం వలన ఎలాంటి ఉపయోగాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ మంత్రాలు దేనికి పనికొస్తాయి..
హనుమంతుడి కోసం జపించే మంత్రాల్లో ఈ రెండు మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. ఈ రెండు మంత్రాలు కోరికలు తీర్చుకోవడానికి, అలాగే ఎలాంటి వ్యాధులను కూడా నయం చేసుకోవడానికి పని చేస్తాయని చెబుతుంటారు. ఈ మంత్రాలు అత్యంత శక్తివంతమైవిగా ఉండడంతో పాటు.. కోరుకున్న కోరికలు 21 రోజుల లోపు లేదా 2 నెలల్లో పూర్తవుతాయి. ఇప్పటికే చాలా మంది తమ తమ కోరికలు పూర్తయ్యాయని చెప్పారు కూడా. అయితే ఈ మంత్రాలను ఎలా చదవాలి, ఎలా చదివితే మంత్రాలు ఫలిస్తాయి అనేది చూద్దాం..

మంత్రాలను పఠించే విధానం..
ఈ రెండు శక్తివంతమైన మంత్రాలను పఠనం చేసే విధానం రెండూ ఒకే విధంగా ఉంటాయి. మంత్రాలను చదివే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఈ మంత్రాలను చదివే ముందు ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ హనుమంతుడికి పూజలు నిర్వహించి.. హనుమంతుడి చుటూ 108 ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాలను చదవాలి. అలాగే ఈ మంత్రాలు చదివేటప్పుడు మంచి ద్రుష్టి ఉండాలి. ఎలాంటి దుర్బుద్ధితో ఉన్నా మీ కోరికలు ఫలించవు. అలాగే ఆ మంత్రాలు పనికిరాకుండా పోతాయి.
మంత్రాలు ఏంటంటే
కోరికలు తీర్చే మంత్రం..
ఆంజనేయం మహావీరం
బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్కప్రభమ్ శాంతం
ఆంజనేయ నమామ్యహం
ఈ మంత్రం చదివేటప్పుడు హనుమంతుడి చుటూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం చదివితేనే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ మంత్రం ఫలిస్తుంది. అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు పేపర్‌పై ప్రదక్షణలను కౌంట్ చేయకూడదు. ఈ మంత్రాలను చదివేటప్పుడు చేసే ప్రదక్షణలను కేవలం పూలతో మాత్రమే కౌంట్ చేయాలి. ఒక కవర్‌లో ఈ పూలను వేసుకొని.. ప్రదక్షణ పూర్తనైప్పుడు ఒక్కో పూలను బాక్సులో వేస్తుండాలి. ఇలా చేస్తూ ఈ మంత్రాన్ని పూజించాలి. అలాంటప్పుడు ఈ మంత్రం ఫలిస్తుంది.
రోగాలను నయం చేసుకోవడానికి..
హనుమాన్ అంజనా సూనో వాయుపుత్రో
మహాబలః, అకస్మాత గతోత్పాతం
నాశయాసు నమోస్తుతే!
ఈ మంత్రాన్ని చదివే ఆ హనుమంతుడి అనుగ్రహం మనపై కలిగి.. మనలో ఉన్న రోగాలు నయమైపోతాయని హనుమంతుడి భక్తులు విశ్వసిస్తుంటారు. అలాగే ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుందని చెబుతుంటారు. ఈ మంత్రం చదివేటప్పుడు కూడా పైన చెప్పిన విధానాన్నే పాటించాలి. పైన చెప్పిన విధంగా మంత్రాన్ని జపిస్తే కచ్చితంగా ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.



Click it and Unblock the Notifications