Latest Updates
-
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి
Muharram 2021:మొహర్రం పండుగ కాదా? దీని వెనుక ఉన్న కథేంటో తెలుసా...
ఇస్లామిక్ నూతన సంవత్సరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజలు రంజాన్, బక్రీద్ తర్వాత అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగల్లో మొహర్రం ఒకటి. దాదాపు పది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి.

ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలందరికీ వారి క్యాలెండర్ ప్రకారం రంజాన్ తర్వాత వచ్చే రెండో పవిత్ర మాసం నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. దీనినే హిజ్రా న్యూ ఇయర్ లేదా హిజ్రా అని అంటారు. ఇది క్రీ.శ 622లో మొహర్రం మొదటి రోజు మక్కా నుండి మదీనాకు మహమ్మద్ ప్రవక్త ప్రయాణాన్ని సూచిస్తుంది.

మహమ్మద్ ప్రవక్త ధర్మం కోసం అన్యాయాలను, అక్రమాలను వ్యతిరేకించారు. పాలకులు ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, ప్రజందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో ఇస్లామిక్ నూతన మాసం ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది.. మొహర్రం పండుగ యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

నూతన మాసం..
ఇస్లామ్ మతం క్యాలెండర్ ప్రకారం మొహర్రం అంటే పండుగ కాదు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ చేసుకునే కార్యక్రం ఇది. అది ముస్లిముల యొక్క నూతన మాసాన్ని మొహర్రం నెలగా భావిస్తారు. అంటే హిందువులకు చైత్ర మాసం ఎలాగో.. ముస్లిములకు మొహర్రం అలాగన్న మాట. ముస్లిములకు ఈ నెల నుండి తొలి మాసం ప్రారంభమవుతుంది. ఈ మొహరం పండుగ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో ఆగస్టు 20వ తేదీన వచ్చింది. అంతేకాదు ముస్లిముల నూతన మాసంలో పదో రోజుకు ఓ ప్రత్యేకత ఉంది.

పీర్ల ఊరేగింపు..
మొహర్రం పండుగ సందర్భంగా ముస్లింలందరూ పీర్లను కూర్చొబెడతారు. తొలి రోజు నుండి పది రోజుల వరకు వివిధ రకాల అలంకరణలు, ప్రార్థనలు చేస్తారు. ఈ పీర్లను కేవలం ముస్లిములే కాదు.. హిందువులు కూడా పూజిస్తారు. ఈ సందర్భంగా చాలా మంది బెల్లంతో తయారు చేసిన తీపి పదార్థాన్ని, అలాగే రొట్టెలను సమర్పించుకుంటారు. అనంతరం పదో రోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో హజరత్ ఇమామ్ హుస్సేన్ కు గుర్తుగా పంజా(ప్రతిమ)లను ఊరేగించి తమ సంతాపాన్ని తెలియజేస్తారు. దీనికి ముందు అగ్నిలో కూడా పాదాలతో నడుస్తారు. ఆ సమయంలో వారి పాదాలకు ఏ చిన్న గాయం కూడా అవ్వదు. ఇదంతా అల్లాహ్ మహిమే అని ముస్లిం పెద్దలు చెబుతారు. ఇలాంటి ఆచారాన్ని పూర్వకాలం నుండి నేటి ఆధునిక కాలంలోనూ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

కొత్త ఏడాదిలో..
ఇస్లామిక్ క్యాలెండరులో కూడా అచ్చం తెలుగు, ఇంగ్లీష్ ఎన్ని నెలలైతే అన్నే నెలలు అంటే 12 మాసాలు ఉంటాయి. కానీ కేవలం 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఇస్లామిక్ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువ మత కార్యక్రమాలు సాధారణంగా ఉండవు. కొన్ని ముస్లిం దేశాలలో ఈరోజు అధికారిక సెలవు దినం కానీ.. మరికొన్ని దేశాలలో అది సెలవు దినంగా ప్రకటించబడలేదు.

నమాజ్ సమయంలో..
చరిత్ర ప్రకారం.. మొహర్రం నెలలో తొలి రోజున ఇరాక్ లో కర్బలా మైదానంలో యుద్ధం ప్రారంభమైంది. యజీద్ సైన్యం హుస్సేన్ తో పాటు కుటుంబసభ్యులను, మహిళల్ని, పసిపిల్లల్ని సైతం పాశవికంగా హతమార్చింది. మొహర్రం నెల పదో రోజు సాయంత్రం నమాజ్ చేస్తున్న సమయంలో ఇమాం హుస్సేన్ ను శుత్రు సైన్యం చుట్టుముట్టింది.

తమను క్షమించాలని..
శత్రువుల చేతిలో దాదాపు 70 మంది వరకు మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులయ్యారు. ఈ సందర్భంలో హజరత్ హుస్సేన్ ఆ తెగకు శాపం పెడతారు. ఈ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ ప్రాణాలు విడుస్తాడు..యుద్ధం ముగిసిన తర్వాత యాజిద్ తెగ వారు పశ్చాత్తాపం చెందుతారు. దైవ ప్రవక్త మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమార్చాం.. కానీ మమ్మల్ని క్షమించాలని గుండెల మీద చేతులతో బాదుకుంటూ.. గట్టిగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు.

శుభకార్యాలు నిర్వహించరు.
అలా ప్రారంభమైన ఆచారం నేటికీ చాలా చోట్ల కొనసాగుతోంది. పీర్ల ప్రతిమలను కూర్చొబెట్టిన వారు ఎర్రగా మండే నిప్పు కణికలలో నడుచుకుంటూ వెళ్తారు. మరోవైపు మహ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు అమరులైన తమ పెద్దలను తలచుకుంటూ వారికి సంతాపంగా రెండురోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. అయితే మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.



Click it and Unblock the Notifications
