Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
దీపావళి రోజు తప్పక కొనాల్సిన మూడు వస్తువులు.. ధర కూడా చాలా తక్కువ.. ఎక్కడ దొరుకుతుందంటే?
దీపావళి.. ఇది అయిదు రోజుల అతిపెద్ద పండుగ. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండగను జరుపుకుంటారు. పిల్లా పాపల నుంచి కురు వృద్ధుల వరకు ఈ పండగను ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమతో నిర్వహించుకుంటారు. కేవలం హిందువులు మాత్రమే కాదు, సిక్కులు, జైనులు కూడా ఈ పండగను వేడుకగా నిర్వహించుకుంటూ ఉంటారు. అతడి గొప్ప చరిత్ర కలిగిన ఈ పండగను ఈనెల 31వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు.
అయితే పవిత్రమైన గొప్ప పండగ అయిన దీపావళి రోజు కొన్ని కొన్ని వస్తువులు కొంటే ఎంతో శుభప్రదమని భక్తులు, ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలా కొనడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుడు సంతృప్తి చెంది, మనపై కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారని చెబుతున్నారు. అయితే ఆ వస్తువులు ఏంటి, ఎందుకు వాటిని కొనాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా దీపావళి రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం..
శ్రీరాముడు రావణాసురుడిని చంపి అయోధ్యకు వచ్చినందుకు దీపావళిని జరుపుకుంటారని చెప్పుకుంటారు. అలాగే నరకాసురుడిపై కృష్ణుడు విజయం సాధించిన దానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారని చెప్పుకుంటారు. ఈ దీపావళి రోజు ఇల్లంతా శుభ్రంగా అలంకరించి, వేడుకగా ముస్తాబు చేస్తారు. రంగు రంగుల ముగ్గులు గీసి, వాటిలో దీపాలను పేర్చి ఆవు నెయ్యి, లేదా ఇతర దీపం నూనెలతో దీపాలను వెలిగిస్తారు.
అనంతరం కుబేరుడు, గణేషుడిని పూజిస్తారు. దాని తరువాత దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి ఆర్ధిక సమస్యలను తొలగించడంతో పాటు, మనకు శాంతి శ్రేయస్సు పంచుతుందని నమ్ముతుంటారు.
దీపావళి రోజు ఎలాంటి వస్తువులు కొనాలంటే..
ఉప్పు: పవిత్రమైన దీపావళి పర్వదినం రోజున ఉప్పు కొనడం శుభప్రదంగా భక్తులు భావిస్తారు. ఈ దీపావళి రోజున కొన్న ఉప్పును ఇంటి ప్రవేశ ద్వారం ముందు ఉంచడం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు. అలాగే ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించే శక్తి ఉండడంతో.. ఏదైనా ప్రతికూల శక్తులను మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉప్పు ఆపగలుగుతుందని చెబుతుంటారు.
పచ్చ కర్పూరం: సాధారణ కర్పూరం కంటే పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన వాసన కూడా అధికంగా వస్తుంది. అందుకే ఈ దీపావళి నాడు ఈ పచ్చ కర్పూపం కొని, ఇంట్లో వెలిగించడం వల్ల.. ఇంట్లోని ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల శక్తులు ఇంటి నుంచి వెళ్ళిపోతాయని, తద్వారా ఇంట్లో మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చెబుతుంటారు.
నల్ల పసుపు: ఈ పవిత్రమైన దీపావళి రోజున నల్ల పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళి రోజున నల్ల పసుపు కొనుక్కొని, దేవి ముందు ఉంచి పూజ చేయాలట. అలా పూజ చేసిన పసుపును డబ్బు లేదా ఇంట్లోని ఏదైనా ప్రదేశంలో ఉంచడం ద్వారా, ఆర్ధిక సమస్యలు తొలిగి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. వీలైతే మీకు దగ్గరలోని దుకాణంలో లేదా వేరే ఏదైనా ప్రదేశంలో పైన పేర్కొనబడిన మూడు వస్తువులను దీపావళి రోజున కొనడానికి ప్రయత్నించండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ పలువురు జోతిష్య నిపుణులు, అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. అలాగే వీటిని విశ్వసించడమనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications