ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ది చెందిన ఈ శివాలయాలను మీరు ఎప్పుడైనా సందర్శించారా..తప్పకుండా సందర్శించండి

మనకు ఉన్న ప్రత్యేక అలవాటు .. ఎక్కడెక్కడి ఆలయాలనో తెలుసుకొని అక్కడికి వెళ్లి దర్శించడం. కానీ, మన రాష్ట్రంలో ఉన్న ఆలయాల సంగతి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అంతేలే ఎక్కడో ఉన్న దేవాలయాల గురించి తెలుసుకొనెంత టైం మన దగ్గర ఉన్న ఆలయాల వద్దకు వచ్చేసరికి సన్నగిల్లిపోతుంది. మీకోసం ఎపి లోని కొన్ని ప్రత్యేకమైన శివాలయాలు గురించి ఈ వ్యాసం ... చూసి దర్శించండి.

సాధారణంగా మనకేదైనా కష్టం వచ్చినప్పుడు లేదా అడ్డంకులు ఎదురైనప్పుడు, వాటి నుంచి గట్టెక్కించమని ఆ భగవంతుడినే వేడుకుంటాం.. మానసికంగా ధైర్యం, ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తుంటాం. మనకు ఎదురయ్యే సమస్యలన్నీ దేవుడికి చెప్పుకుని.. వాటిని తీర్చమని కోరుకుంటూ ఉంటాం. దీంతో మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తిలో ఎంతో అద్భుతమైన గుణం ఉంది. ఎవరి జీవితంలో అయినా కావాల్సింది సంతోషం, శక్తి, ధైర్యం, ప్రశాంతత ఇవన్నీ దేవుడే ఇస్తాడని చాలా మంది నమ్ముతారు. అన్నింటికంటే ముఖ్యంగా ''శివుడి ఆదేశం లేనిదే చీమైనా కుట్టదు'' అనే నానుడి ఎప్పటినుంచో ఉంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే..

Must-visit These Shiva Temples in Andhra Pradesh

ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట. సాధారణంగా ప్రతి ఊళ్లోనూ శివాలయాలు ఉంటాయి.. అయితే కొన్ని శివాలయాలు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో కొన్ని స్వయంభుగా వెలసిన ఆలయాలైతే.. మరికొన్ని శతాబ్దల క్రితం రాజులు కట్టించినవి. అలాంటి పరమేశ్వరుని దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. ఆ శివాలయాల ప్రత్యేకతలేంటి.. అవి ఎక్కడున్నాయనే పూర్తి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

భీమవరం సోమేశ్వర ఆలయం
భీమవరం లోని సోమేశ్వర ఆలయం 2 కిలోమీటర్ల దూరంలోని గునుపూడి లో కలదు. ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించాడని స్టళ్లపురాణంలో చెప్పబడింది. చంద్రుడి పేరుమీద ఇక్కడి స్వామివారిని సోమేశ్వర స్వామి అని అంటారు. ఈ ఆలయ ప్రత్యేకత విషయానికి వస్తే, అమావాస్య నాడు చంద్రుడు బూడిద లేదా గోధుమ రంగులోనూ మరియు పౌర్ణమి నాడు తెలుపు రంగులోనూ కనిపిస్తాడు.

Must-visit These Shiva Temples in Andhra Pradesh

కోటిపల్లి సోమేశ్వర స్వామి
తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలంలో కోటిపల్లి గ్రామం కలదు. ఇక్కడ శివుని ఆలయం ప్రసిద్ది చెందినది. ఇందులో శివలింగం తక్కువ ఎత్తు కలిగి ఉంటుంది. ద్రాక్షారామం (10 కి. మీ) నుండి కోటిపల్లి కి ప్రతిరోజూ ఆర్డినరీ సర్వీస్ బస్సు నడుస్తుంది. ఈ క్షేత్రం లో ఏమి చేసిన కోటి ఫలితాల్ని ఇస్తుందని భక్తుల నమ్మకం.

​యాగంటి ఉమా మహేశ్వరుడు..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మరో ప్రముఖ శివాలయం ఉంది. ఇది కర్నూలు నగరం నుండి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో ఇదొకటి. దీన్ని 5వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. దీన్ని తొలుత పల్లవులు నిర్మించగా.. చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు ఈ దేవాలయానికి పునర్నిర్మించారు. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే.. పార్వతీ పరమేశ్వరులు అర్ధనాదీశ్వర రూపంలో ఒకే రాతితో చెక్కిన విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. అంతేకాదు శివయ్యను లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కొలిచేది కూడా ఇక్కడే అని చాలా మంది చెబుతారు. ఇక్కడుండే నంది ప్రతి ఏటా కొంచెం పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలోకి ఒక్క కాకి కూడా ప్రవేశించదు.

Must-visit These Shiva Temples in Andhra Pradesh

యాగంటి బసవన్న
యాగంటి కర్నూలు జిల్లాలోని బనగానపల్లె లో చేరువలో కలదు. ఇక్కడ ఉమామహేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందినది. ఆలయ గర్భగుడికి ఎదురూగా బసవన్న(నంది) విగ్రహం ఉంటుంది. వీరబ్రహేంద్రస్వామి కాలజ్ఞానంలో రాసినట్లు నంది విగ్రహం అంతకంతకు పెరిగిపోతుందని, కలియుగాంతంలో లేచి రంకె వేస్తాడని చెప్పబడింది. ఇప్పుడు అచ్చం అలాగే నంది విగ్రహం పెరిగిపోతుందని పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.

గుడిమల్లం
దేశంలోనే ... కాదు కాదు ప్రపంచములోనే అరుదైన శివలింగం గుడిమల్లం. ఇది చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలంలో కలదు. దీనిని క్రీ. పూ. 1 వ శతాబ్దంలో ఆంధ్రా శాతవాహనులు నిర్మించారు. దీని చరిత్ర కావాలంటే కెహెద్రగిరి మ్యూజియం వెళ్లి తెలుసుకోవచ్చు. గర్భగుడి లోని శివలింగం లింగరూపంలో కాకుండా మానవరూపంలో వేటకు వెళుతున్న మహావేటగానివలె ఉన్నాడు.

​కోటప్పకొండ శివయ్య..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కోటప్పకొండలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడ శివయ్యను త్రికుటేశ్వరంగా, త్రికుటాచలేశ్వరుడు, త్రికోటేశ్వరునిగా కొలుస్తారు. ఈ కొండను ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు. అందుకే ఈ కోటప్ప కొండను కాకులు వాలని కొండగా పిలుస్తారు. ఈ స్వామి వారిని దర్శించుకున్న వారి కుటుంబ జీవితంలో సిరి సంపదలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు, రైలు రవాణా అందుబాటులో ఉన్నాయి. కార్తీక మాసంలో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన శివాలయాల్లో కోటప్ప కొండ ఒకటి.

Story first published: Thursday, July 13, 2023, 11:41 [IST]
Desktop Bottom Promotion