Latest Updates
-
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026
ఆ ఆలయంలోని మంటలను ప్రత్యక్షంగా చూస్తే.. పక్షవాతం నయమవుతుందట...!
అగ్నితో స్నానమాచరించే ఆలయం యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం.
మన దేశంలో కొన్ని వేల సంఖ్యల దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆలయాలు మాత్రం ఎంతో విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటివెన్నో ఉన్నాయి. ఉదాహరణకు లేపాక్షిలో కింద ఎలాంటి సపోర్ట్ లేకుండా ఓ రాతి స్తంభం ఇప్పటికీ కనిపిస్తుంటూ ఉంటుంది. అలాగే కర్నాటకలో రాళ్లను మీటితే సంగీత శబ్దం వస్తుంది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అనేక ఆలయాల్లోని మిస్టరీల గురించి మనలో చాలా మందికే తెలుసు...

అయితే ఉత్తర భారతంలోని ఆలయాల గురించి.. అక్కడ దేవతల గురించి మన తెలుగు రాష్ట్రాల ప్రజలలో అతికొద్ది మందికే తెలుసు. ఉత్తర భారతం అనగానే మనందరికీ ఉత్తరప్రదేశ్ లోని కాశీ, వారణాసి ఎక్కువగా గుర్తొస్తుంటాయి.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఇలాంటి మిస్టరీలుగా ఉన్న దేవాలయాల్లో ఆ రాష్ట్రంలోని ఓ దేవాలయం కూడా ఉంది. అక్కడున్న దేవత దానంతట అదే అగ్నిస్నానమాచరిస్తుందట.. అంటే అక్కడ మంట ఆటోమేటిక్ గా వచ్చేస్తోందట. ఇంతకీ ఆ మందిరం ఎక్కడ ఉంది.. ఆ ఆలయం యొక్క విశిష్టత.. చరిత్ర ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ గుడి ప్రత్యేకత..
రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ సమీపంలోని ఆ గుడిలో అగ్నిని నీరుగా తీసుకునే దేవాలయం ఇదాన మాతాలయం. ఈ గుడిలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి ఆరావళి పర్వతాల సమీపంలో ఉంటుంది. ఇది ఉదయపూర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడి నిర్మాణం పైన రూఫ్ లేకుండా చతురస్రాకారంలో ఉంటుంది.

మేవాల్ మహారాణి..
ఇదాన ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీద ఉన్న ఆ దేవాలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ ఉన్న దేవాలయంలో అగ్నిని స్నానంగా తీసుకుంటుందట. ప్రతి నెలా రెండు లేదా మూడుసార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటారని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. అక్కడ మంట దానంతట అదే వస్తుంది.

అమ్మవారి విగ్రహం తప్ప..
ఆ దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహూతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన సుందరమైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.

ఎన్ని పరిశోధనలు చేసినా..
అయితే ఇది ఎలా సాధ్యపడుతుందని.. మంట ఎక్కడి నుండి వస్తుంది.. ఎలా వస్తుందనే విషయాలపై పరిశోధకులు ఎన్ని పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది. దీంతో ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిందట.

పక్షవాతం, మానసిక ఆందోళన విముక్తికి..
ఆ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళనకు గురవుతున్న వారు వారి రోగాలను నయం చేసుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఆలయంలోని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటే అన్ని రోగాల నుండి విముక్తి దక్కుతుందని భక్తులు నమ్ముతారు.

జ్వాలాదేవి రూపం..
ఈ ఆలయంలో ఉండే అమ్మవారు జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఈ దేవాలయ పూజారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుండి 20 అడుగుల వరకు వస్తుందట.

మంటలను ప్రత్యక్షంగా చూస్తే..
ఆలయంలో అమ్మవారి మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు తొలగిపోయి.. పుణ్య ఫలం చేకూరుతుందని చాలా మంది భక్తులు నమ్ముతారు. అలాగే ఆ ఆలయంలో ఉన్న త్రిశూలాన్ని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని, అందుకే ఆ త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారట. పక్షవాతం ఉండే రోగులకు ఆరోగ్యం కుదుటపడుతుందని, వారి కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారట.



Click it and Unblock the Notifications