Latest Updates
-
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి
నవగ్రహ ప్రదక్షిణలో పాటించాల్సిన నియమాలేంటి ?
నవగ్రహాలు అంటే.. చాలా మందికి సందేహాలు ఎక్కువ. ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొంతమందికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. మరికొందరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో కూడా తెలియదు. అందుకే.. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని.. అక్కడ పూజ చేయడానికి కూడా సంకోచిస్తారు.
అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాలలో సూర్యుడి విగ్రహం మధ్యలో తూర్పు వైపు ఉంటుంది. కాబట్టి సూర్యుడిని చూస్తూ లోపలికి వెళ్లాలి.. అక్కడి నుంచి ఎడమవైపు నుంచి కుడివైపుకి 9 ప్రదక్షిణలు చేస్తే మంచిది.

అయితే నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. అంటే స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించినప్పుడే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అలాగే ప్రదక్షిణలు చేసే సమయంలో నవగ్రహాలను తాకరాదు. ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు, మడిదుస్తులు ధరించినప్పుడే నవగ్రహాలను తాకవచ్చు.
9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత.. రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు చేయాలి. అంటే.. మొత్తం 11 ప్రదక్షిణలు చేయాలి. అందరూ ప్రదక్షిణ చేయవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొంతమందికి గ్రహదోహం ఉంటుంది. మీకున్న గ్రహదోషాన్ని బట్టి.. ఆయా గ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో ఇప్పుడు చూద్దాం. సూర్యుడికైతే 6, చంద్రుడి అనుగ్రహానికైతే 10, కుజ గ్రహానికి7, బుధ గ్రహానికి 17, గురు గ్రహానికి 16, శుక్రగ్రహానికి 20, శనిగ్రహానికి 19, రాహు గ్రహానికి 18, కేతు గ్రహా అనుగ్రహానికైతే 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి.



Click it and Unblock the Notifications