Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
దేవి నవరాత్రులు 2024: అమ్మవారికి సమర్పించే నైవేద్యం తింటే ఏమవుతుందో తెలుసా?
దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేసిన అనంతరం.. తీరొక్క రీతిలో భక్తులకు ఉన్న దాంట్లో కొంతమేర నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ నైవేద్యంతో అమ్మవారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరే అవకాశముంది.
నైవేద్యానికి సమర్పించే పిండి వంటల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకవిలువలు ఉన్నాయని, అవి తింటే మన శరీరానికి ఎంతో మంచిదని వైద్యులతో పాటు మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. అలాంటి నైవేద్యాల్లో దాగి ఉన్న ఔషధగుణాలు, నైవేద్యం తింటే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తామంటే:
నవరాత్రుల్లో అమ్మవారికి బెల్లంతో చేసిన నైవేద్యంతో మొదలుకొని.. వడపప్పుతో చేసే నైవేద్యం వరకు అన్నీ సమర్పిస్తూ ఉంటాము. వీటిలో ఒక్కో నైవేద్యంతో ఒక్కో మేలు జరుగుతుంది.
బెల్లంతో చేసిన నైవేద్యంతో ఆరోగ్య ప్రయోజనాలు
> బెల్లంలో అనేక రకాల పోషకవిలువలు దాగి ఉన్నాయని మనందరికీ తెలిసిందే. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు దాగి ఉన్నాయి. ఇవి శరీరాన్ని ధృడంగా ఉంచడంతో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
> శరీరానికి తక్షణమే శక్తిని అందించేందుకు బెల్లం బాగా ఉపయోగపడుతుంది. మీకు బాగా అలసటగా అనిపించినప్పుడు ఒక బెల్లం ముక్క తింటే సరిపోతుంది. వెంటనే మీకు శక్తి లభిస్తుంది.
> బెల్లంలో ఐరన్ శాతం కొంచెం అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని రక్తహీనతల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇదొక వరమనే చెప్పుకోవచ్చు.
> బెల్లంలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు.. శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే.. ఫ్రీరాడికల్స్ కారణంగా తలెత్తే కణజాల వ్యవస్థ దెబ్బతినడాన్ని నివారిస్తుంది.
> బెల్లం సహజ సిద్ధమైన, కలెన్సింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. ఇది శ్వాశకోశ గ్రంథులు, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది.
వడపప్పులో ఇన్ని ఉపయోగాలా?
దుర్గమ్మకు బెల్లంతో చేసిన నైవేద్యంతో పాటు, వడపప్పుతో చేసిన నైవేద్యం కూడా సమర్పిస్తుంటారు. వీటితో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
> ఈ పప్పులో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్స్.. ఏ, బీ, సీ, ఈలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా అధిక మొత్తంలో దొరుకుతాయి.
> పప్పులో తక్కువ మొత్తం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ పప్పులో ఉండే ప్రోటీన్, ఫైబర్ వంటి పదార్థాలు.. రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి.
> ఈ పప్పులో ఉండే యాంటీ యాక్సిడెంట్ గుణాలు, ఇతర ఖనిజాలు.. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి . అలాగే జీర్ణవ్యవస్థను పటిష్టపరుస్తుంది.
అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో భక్తితో పాటు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.
గమనిక: ఈ కథనంలో అంశాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.



Click it and Unblock the Notifications