Latest Updates
-
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
Navratri 2024 : దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే మీకు అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి!
Navratri 2024: మరికొద్ది రోజుల్లో దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో అమ్మవారిని ఏ రకంగా పూజించాలి? ఈ నవరాత్రులు చేసేటటువంటి వేళ కలశ స్థాపన ఎలా చేయాలి ఖచ్చితంగా చేయాలా? ఉపవాసం ఏ రకంగా ఉండాలి ? అలాగే అఖండ దీపం పెట్టాలా వద్దా?ఇలా అనేక రకాల సందేహాలు చాలా మంది కలుగుతాయి. వాటికి సంబందించిన పూర్తి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
అక్టోబర్ మూడో తారీకు గురువారం నుండి పాడ్యం నుండి 12 శనివారం విజయదశమి వరకు వరకు దేవి శరన్నవరాత్రులు జరగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనమందరం కూడా ఈ దసరా పది రోజులు కూడా అమ్మవారిని విశేషంగా అర్చిస్తాం. పూజిస్తాం. ఎవరి శక్తి కొలది వారు చక్కగా అమ్మవారికి ఆరదన చేసుకుంటారు. కొంత మంది ఎరురంగు బట్టలు కట్టుకుని భవాని మాలలు వేసుకుని దీక్షగా 10 రోజులు పూజలు చేస్తారు.

కానీ చాలా మంది మాలలు వేసుకోకుండా ఇళ్లలోనే చక్కగా కలశం పెట్టుకుని 10 రోజులు దీక్షచేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ రకంగా ఇంట్లో దీక్ష చేసే ఇంట్లో పూజించుకునే వారి ఇంట్లో అర్చన చేసుకునే వారు, వాళ్ళకి ఎటువంటి ఆచార సంప్రదాయాలు పాటించాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసి కొన్ని నియమాలను ఇక్కడ తెలుపుతున్నాం వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఇంట్లో ఎవరైతే దంపతులు అవ్వచ్చు సింగిల్ కావచ్చు ఎవరైనా కొలవవచ్చు. అయితే 9 రోజులు అమ్మవారిని మనం ఇంట్లో కూడా అలంకరించుకోవాలా అనే సందేహం ఉంటుంది. అలాగే ఒక్కొక్క అవతారానికి ఒక్కో అష్టోత్తరం చదవాలా అనే సందేహం కూడా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి స్వరూపం లక్ష్మీ అష్టో అలా చదవడం చాలా మంచిది . అష్టోత్తరాలు లేదా ఇంటర్నెట్ లో లేదా బయట పుస్తకాలు దొరుకుతాయి.

కాబట్టి అవతారం రోజున అవతారా స్తోత్రం చదవకపోయినా రోజు దుర్గా అష్టోత్తరం కూడా పారాయణం చేయవచ్చు. దుర్గా స్తోత్రం కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఏ అవతారం ఆ అవతారానికి పూజించడం అనేటటువంటి చాలా విశేషము.
ఎలాంటి సందేహం లేకుండా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయండి. కానీ నిష్టగా నిబద్దతో చేయండి. మంత్రాలు చదవేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. కొంచెం తప్ప చదివినా వాటి ప్రభావం వేరుగా ఉంటుంది. దుర్గాసప్త సతి అక్షరదోషం లేకుండా చదవండి.
ఈ నవరాత్రులలో చండీ హోమం చేయించుకోవడం కానీ చండీ పారాయణం చేయించుకోవడం కానీ ఖచ్చితంగా ఎంతో విశేషమైన ఫలితాలు ఇస్తుంది. గురుఉపదేశం లేకుండా చండీ పారాయణం చేయొద్దు .
ప్రతి రోజూ కుమారి పూజ లేదా సువాసినా పూజ చేయిస్తే మంచిదా
దైవం మానుష్య రూపేనా నిజంగా దైవం అమ్మవారి స్వరూపం అంటే కనుక అలాగే దైవ చిన్నపిల్లలకి కానీ కూర్చోబెట్టి చక్కగా ఏ రోజు ఏ అవతారం ఆ అవతారంతో పిల్లలను అలంకరించి సులభంగా పూజించవచ్చు.
కలశ స్థాపన చేయాలా అన్నది కొందరికి సందేహం ఉంటుంది
చాలా మంది నవరాత్రుల్లో కలశం పెట్టుకోవడం ఆనవాయి. కలశం పెట్టుకుంటే మంచి విషయం. పెట్టుకుంటే మంచి జరగుతుంది. కలశం లేకుండా కూడా పూజచేయించుకోవచ్చు.

అమ్మవారి పూజకి వాడే పుష్పాలు
అమ్మవారికి పసుపు కుంకుమ పూజ చేయడం చాలా విశేషం. అమ్మవారికి తెలుపు, ఎరుపు, పసుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం. ఇక అమ్మవారి పూజకి తెలుపు రంగు పుష్పాలు మల్లె, విరజాజులు మందారం, సంపెగ పువ్వుల అంటే అమ్మవారికి చాలా ఇష్టం. గులాబి పువ్వులు, తామరపువ్వులతో అమ్మవారిని పూజచేసుకోవచ్చు. ఇంకా విశేషంగా మారేడు దలంతో కూడా పూజించుకోవచ్చు.
నైవేద్యాలు ఎలాంటివి పెట్టాలి?
నైవేద్యంలో రకరకాల ఉన్నాయి. మీ శక్తి కొలది మీకు ఇష్టమైన నైవేద్యం పెట్టవచ్చు. పులిహోర, దద్దోజనం, చక్కరపొంగలి, పరమాన్నం, గారెలు, బూరెలు, అరిసెలు, అప్పాలు పెట్టుకోవచ్చు. మీ ఓపిక, అవకాశంను పెట్టి పూజించుకోవచ్చు.
రెండుపూటలా పూజచేయలా?
మూడు సందళ్లే పూజచేస్తే మంచిది. కానీ ఇప్పటి జీవన శైలిలో ఉదయం మరియు సాయంత్రం లేదా రాత్రి కూడా ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారిని భక్తితో రోజూ ఒక నియమంతో పూజ చేయవచ్చు. అలాగే కుంకుమ పూజను కూడా చేసుకోవాలి. ఇది మగ ఆడవాళ్లు అమ్మవారిని కుంకుమతో ఆరాధన చేయవచ్చు.
దీక్ష ఎన్ని రోజులు చేసుకోవచ్చు
చాలామందికి 9 రోజులు దీక్ష చేయడం అంటే చాలా కష్టం. దీక్ష ఒక్కరోజు చేయొచ్చా? 5 లేదా 7 రోజులు చేయవచ్చా, లేకపోతే లాస్ట్ లో మూడు రోజులు చేయొచ్చాఅనే సందేహం ఉన్నవారికి తొమ్మిది రోజులు దీక్ష చేయలేని వారు ఎవరైనా ఉంటే కనుక చివరి 3 రోజులు ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు.
అఖండ దీపం పెట్టాలా ?
ఇంట్లో నవరాత్రి పూజలు చేసే వారు గుళ్ళలో పెట్టుకోవచ్చు. ఇంట్లో అవసం లేదు. పెట్టినా పెట్టకపోయిన నష్టం ఉండదు. అయితే పెడితే జాగ్రత్తగా నియమాలు పాటించాలి.
ఉపవాసం
నవరాత్రులో రోజంతా ఉపవాసం ఉండాలి, లేదా రెండు పూటల లేదా ఒక్కపూట భోజంన అనే సందేహం ఉన్నవారికి మీ ఆరోగ్యాన్ని బట్టి మాత్రమే చేసుకోండి. ఆహారనియమాల విషయంలో మీ ఆరోగ్యాని బట్టి చూసుకోండి. మామూలు వాళ్ళు ఉదయం ఫలహారం, మద్యహ్నానం కూడా ఫలహారం రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు.



Click it and Unblock the Notifications