Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నవరాత్రి స్పెషల్ : దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సమర్పించాల్సిన నైవేద్యాలు..!
శక్తి స్వరూపిణి దుర్గామాత ప్రాధాన్యతను చాటే నవరాత్రి ఉత్సవాలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి. దసరా పండుగకు 9రోజుల ముందు నుంచి ఆరంభమయ్యే ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. నవ అంటే తొమ్మిది. సంస్కత బాషలో నవానం రాత్రీనాం సమహార: నవరాత్రి. అంటే నవరాత్రి తొమ్మిది రాత్రుల సమహారమని. ఈ తొమ్మిది రాత్రులు అమ్మావారిని ఆరాధించాలి కనుక దేవి నవరాత్రులన్నారు. నవ సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం. ఈ నవరాత్రులు మనిషికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాయి. ఈ నవరాత్రులలో దేవి భాగవతం చదవడంకానీ, వినడం కానీ చేస్తారు.
మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. మరి అమ్మను 9 రోజుల పాటు వివిధ రూపాలలో, వివిధ అలంకరణలతో పూజిస్తారు. ఆ రూపాలకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తున్నారు. మరి 9 రోజుల పాటు దేవిని ఎలా ప్రసన్నం చేసుకుంటారో. ఏవిధంగా అలంకరిస్తారో క్రింద వివరించబడినది....

ప్రథమ శైలపుత్రి దేవి:
మొదటి రోజు అమ్మవారు ప్రథమ శైలపుత్రిగా అంటే శ్రీబాలా త్రిపురసుందరి దేవిగా పసుపు రంగు వస్త్రాలు, పువ్వులతో అలంకారముగా అవతరిస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మ దుర్గాదేవికి సమర్పించుకొనే నైవేద్యం నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తారు. రెండువ పద్ధతి నవరాత్రి దుర్గా దేవికి కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు.

బ్రహ్మ చారిణి దేవి:
రెండవ రోజు దుర్గాదేవిని ఉమ లేదా బ్రహ్మ చారిణి అనగా శ్రీ అన్నపూర్ణాదేవిగా, ఆకుపచ్చని కలర్ తో అలంకరిస్తారు. తరువాత నైవేద్యం రూపంలో పంచదారను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు.

చంద్రఘంటా దేవి:
మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటా అనగా గాయత్రీ శ్రీదేవి రూపంముగా గ్రే కలర్ లో అలంకరిస్తారు. ఈ అమ్మవారు, మన బాధలు, కష్టాలు తీర్చి, మన కోరికలు తీర్చుతుందని ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ దేవి మాతకు నైవేద్యంగా పాలు లేదా పాయసం సమర్పించుకుంటారు.

కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి:
నవరాత్రి ఉత్సవాలలో నాలుగువ రోజు అమ్మవారిని కూష్మాండ శ్రీ మహాలక్ష్మి దేవి రూపంముగా ఆరెంజ్ కలర్ లో అలంకరిస్తారు. ఈ రోజు న దేవికి నైవేద్యంగా మాల్పువా స్వీట్ డిష్ ను భక్తిశ్రద్ధలతో పెడతారు.

స్కంధమాత:
ఐదవ రోజు పంచమి లేదా నవరాత్రి 5వ రోజు దుర్గాదేవిని స్కంధమాత సరస్వతి దేవిగా అలంకరిస్తారు. . సింహాం మీద కూర్చొని, ఎడు రకాల ఆయుధాలతో ఆమె ఎనిమిది చేతుల్లో ఉన్నట్లు అవతరిస్తుంది. ఆరోజు అమ్మవారికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పించుకుంటారు.

కాత్యాయనీ మాత:
నవరాత్రుల్లో ఆరవ రోజు లేదా షష్టి రోజున దుర్గా దేవిని కాత్యాయనీ శ్రీలలితాదేవి రూపముగా అలంకరిస్తారు. ఆరోజున అమ్మవారికి నైవేద్యంగా తేనెను సమర్పిస్తారు.

కాళరాత్రి మాత:
ఏడవ రోజు లేదా సప్తమి రోజున అమ్మవారిని కాళరాత్రి శ్రీ దుర్గాదేవి రూపముగా అలంకరణ చేస్తారు. కనకదుర్గ దేవికి నైవేద్యంగా శాకాన్నం లేదా బెల్లంను సమర్పించుకుంటారు .

మహాగౌరీ మాత:
ఎనిమిదవ రోజు లేదా అష్టమి రోజున అమ్మవారిని మహా గౌరి శ్రీ మహిషాసుర మర్దనీ దేవిగా పీకాక్ గ్రీన్ కలర్ లో అలంకరణ చేస్తారు. నైవేద్యంగా కొబ్బరికాయను మరియు చక్కర పొంగల్ ని పెడుతారు.

సిద్ధిరాత్రి మాత:
తొమ్మిదవ రోజు లేదా నవమి దుర్గాదేవిని సిద్ధిదాత్రి శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. నువ్వులను సమర్పిస్తారు .



Click it and Unblock the Notifications