Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.!
అసలే శ్రావణమాసం, ఆపై శివ పూజ.. ఈ తప్పులు చేశారంటే అనుగ్రహం ఏమో కానీ ఆగ్రహం తప్పదు!
శ్రావణమాసం మొదలు కాబోతోంది. ఈ సమయంలో శివుడికి పూజలు చేసే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ప్రతీ సోమవారం ప్రత్యేక పూజలు, ఆరాధనలు, అభిషేకాలు, శివ మంత్రాల పఠనం ఇలా తమకు నచ్చిన రీతిలో శివయ్యను స్మరిస్తుంటారు. అయితే శివ పూజ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పూజారులు చెబుతున్నారు. పూజలు మనం చేసే ఈ చిన్న తప్పుల వల్ల శివానుగ్రహం ఏమో కానీ శివాగ్రహానికి గురవుతామని అంటున్నారు. ఆ శంకరుడి పూజలో అస్సలే చేయకూడని ఆ తప్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎట్టి పరిస్థితుల్లోనూ శంఖం ఊదకూడదు:
శివ పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ శంఖం ఊదకూడదు. శ్రీ మహా విష్ణువుకు శంఖం అంటే చాలా ఇష్టం. సాంప్రదాయ పూజల్లో శంఖాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి పూజ సమయంలో శంఖం ఊదుతారు. శంఖం ఊదిన ఆ కోనేరులో విష్ణువు, లక్ష్మీ ఉంటారని భక్తుల నమ్మకం. కానీ శివారాధన చేసేటప్పుడు మాత్రం అస్సలే శంఖం పూరించకూడదని చెబుతారు. శ్రావణ మాసం శివుడికి అంకితం. కాబట్టి ఈ నెలలో పూజ చేసేటప్పుడు శంఖం పూరించకూడదని అంటారు.
అసలెందుకు శంఖం పూరించకూడదు..?
ఒకప్పుడు శంఖచూడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ రాక్షసుడు శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో జన్మించాడు. అతని బలం కారణంగా అతడిని ఓడించడం చాలా కష్టం. అయితే అతని మాటలకు దేవతలే ఆశ్చర్యపోయే వారని అంతా అంటుండేవారు. అలాగే బ్రహ్మదేవుడి దయ, విష్ణువు అనుగ్రహం వల్ల శంఖచూడునికి కూడా శ్రీకృష్ణుడు కవచం లభించింది. దీంతో అతనిలో అహం పెరిగిపోయింది. దీనికి తోడు తులసితో వివాహం కూడా జరిగింది. తులసి కవచం కారణంగా అతడిని చంపడం కష్టంగా మారింది. అయితే దేవతలు శివుడి వద్దకు వెళ్లారు. అయితే ఆ రాక్షసుడి బారి నుంచి విముక్తి కావాలని వేడుకుంటారు. విష్ణువు కూడా ఆ భోళా శంకరుడిని ఇందుకు పరిహారం చేయమని కోరతాడు.
శివుడి బూడిదతో శంఖం ఏర్పడిందని ప్రతీతి:
దీంతో శివుడు తన త్రిశూలంతో శంఖచుడుడ్ని సంహరిస్తాడు. అప్పుడు అతడు తన శరీరాన్ని తినేస్తాడని అంతా నమ్ముతారు. ఈ సమయంలో శివుని బూడిద నుంచి ఈ శంఖం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే శివుడి పూజలో శంఖం లేదా దాని నీటిని ఉపయోగించరు. అలాగే తులసిని కూడా శివారాధనకు వాడరు.
మాంసాహారం, శృంగారానికి దూరం:
అలాగే శ్రావణ మాసంలో శివారాధన చేసే వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టుకోకూడదు. కేవలం మాంసాహారమే కాదు గుడ్లు, ఉల్లిపాయ, ఎల్లిపాయలకు కూడా చాలా దూరంగా ఉండాలి. మద్యపానం కూడా చేయకూడదు. ప్రతీ సోమవారం ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి. అలాగే పూజ చేసే రోజు, ముందు రోజు, తర్వాత రోజు శృంగారానికి దూరంగా ఉండాలి. వాటన్నిటిని విడిచి పెట్టి కేవలం ఆ శివయ్యపైనే మనసు ఉంచండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications