గురువారంనాడు ఉపవాసం ఉండటం వలన భాగ్యవంతులవుతారు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

హిందూ పురాణాల ప్రకారం, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితమివ్వబడింది. అదే విధంగా, గురువారం నాడు బృహస్పతిని కొలుస్తారు. 'గురు' లేదా 'బృహస్పతి' అన్న పేరుతో భారతీయులు జూపిటర్ ను పిలుస్తారు. బృహస్పతిని 'లార్డ్ ఆఫ్ జూపిటర్' గా పిలుస్తారు.

హిందూ ఇతిహాసాల ప్రకారం, శుక్లపక్షం నాడు ఉపవాసాన్ని ఆచరించడం మంచిది. శుక్లపక్షం నాడు మొదటి గురువారంలో ఉపవాసం ఉండటం వలన భాగ్యవంతులు అవుతారు.

అనేకమంది భారతీయ మహిళలు గురువారం నాడు ఉపవాసం ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వలన అనేక లాభాలను పొందుతారు.

గురువారం నాడు ఉపవాసం ఉండేటప్పుడు పాటించవలసిన విధివిధానాలను ఇక్కడ వివరించాము.

observe-a-thursday-fast-to-become-prosperous

పూజా విధి:

గురువారం నాడు బృహస్పతిని కొలుస్తారు. జూపిటర్ ప్లేనేట్ ను పాలించేవాడు బృహస్పతి. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారంగా బృహస్పతిని కొలుస్తారు. అందువలన, శ్రీమహావిష్ణువు మరియు బృహస్పతి ప్రతిమ ముందు బృహస్పతి పూజను చేస్తారు.

భక్తులు ఉదయాన్నే సూర్యోదయం ముందే నిద్రలేవాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఈ రోజు తలస్నానం చేయకూడదు అలాగే బట్టలను కూడా ఉతకకూడదు. పూజాసామాగ్రిని సిద్ధం చేసుకోండి. అందులో ధూపాన్ని, దీపం, పెసరపప్పు, శనగపిండితో తయారుచేయబడ్డ తీపి పదార్థం మరియు అరటిపండును ఉంచండి.

ఈ రోజు మీరు కేవలం ఒకసారి మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పును ఏ రకంగానూ ఈ రోజు తీసుకోకూడదు. కేవలం పెసరపప్పు లేదా పెసర పిండితో తయారుచేయబడిన పసుపురంగు ఆహారాలని మాత్రమే ఈ రోజు స్వీకరించాలి. వీటిలో ఉప్పు ఉండకూడదు.

వ్రతకథ:

ఒకప్పుడు ఒక భాగ్యవంతమైన కుటుంబం ఉండేది. వారికి జీవితంలో అన్ని విలాసాలు కలవు. అయితే, ఆ కుటుంబానికి చెందిన మహిళకు దానధర్మాలు చేయడం ఇష్టముండేది కాదు. కనీసం ఒక్క రూపాయి కూడా దానం చేసేవారు కాదు. ఒకరోజు, ఆ ఇంటికి ఒక సాధువు విచ్చేసి బిక్షం అడుగుతాడు. ఇంటిపనులలో నిమగ్నమైన ఆ మహిళ ఆ సాధువుని ఇంకొకరోజు రమ్మని చెప్తుంది. ఆ సాధువు మరుసటి రోజు మళ్ళీ బిక్ష కోసం వీరింటికి వస్తాడు.

ఆ సమయంలో ఆ మహిళ తన కుమారుడికి అన్నం వడ్డిస్తోంది. తనకి తీరిక లేదని మరెప్పుడైనా రమ్మని సాధువును కోరుతుంది. ఆ సాధువు మరల తిరిగి వెళ్ళిపోతాడు. మరల మూడవ సారి వీరింటికి వస్తాడు సాధువు.

ఇప్పుడు కూడా ఆ మహిళ తీరిక లేకుండా ఉంది. కాబట్టి, ఈ గజిబిజి జీవితం నుంచి శాశ్వతమైన సెలవు తీసుకోవాలని ఉందా అని ఆ సాధువు ఆమెను అడగగా, అలా జరిగితే సంతోషమేని ఆమె తన అంగీకారాన్ని తెలుపుతుంది.

ఈ విషయాన్ని విన్న సాధువు, కొన్ని సూచనలు ఇస్తాడు. వాటిని పాటిస్తే శాశ్వతమైన తీరిక లభిస్తుందని తెలియచేస్తాడు. ఆ సూచనాలేమనగా, సూర్యోదయం తరువాత నిద్రలేవాలి. స్నానం చేయకూడదు. పసుపు రంగు దుస్తులను ధరించకూడదు. తలస్నానం చేయాలి. పసుపు మట్టితో నేలను అలకకకూడదు. ఇంట్లోని మగవారిని క్షవరం చేసుకోమనాలి. బట్టలు ఉతకాలి. సూర్యాస్తమయం తరువాత పూజామందిరంలో దీపాన్ని వెలిగించాలి. వండిన పదార్థాలని కిచెన్ వెనుకభాగంలో ఉంచాలి.

observe-a-thursday-fast-to-become-prosperous

ఈ సూచనల్ని ఆ మహిళ పాటించింది. కొన్ని వారాల తరువాత ఆమె ఇంట్లోని సంపదంతా పోయింది. తినడానికి తిండి కూడా వారికి లేదు.

కొన్ని రోజుల తరువాత, ఆ సాధువు వారింటికి భిక్షకై విచ్చేశాడు. ఇప్పుడు, ఆ మహిళకు ఎంతో తీరిక ఉంది. అయితే, ఆ సాధువుకు దానం చేసేందుకు ఏవీ ఆమె వద్ద లేవు. ఆమె తన తప్పును గ్రహించింది. క్షమాపణలు వేడుకుంది.

ఈ సమస్యకు పరిష్కారాన్ని కోరింది. తిరిగి, వారు మాములు స్థితికి ఏ విధంగా చేరుకోవాలి తెలియచేయమని ప్రార్థించింది.

అప్పుడు, ఆ సాధువు ఆమెను గురువారం నాడు ఉదయాన్నే లేచి నేలను పసుపు మట్టితో అలాగే పేడతో శుభ్రంచేయమని చెప్తాడు. దేవుడి వద్ద సూర్యాస్తమయానికి ముందే దీపాన్ని వెలిగించమని చెప్తాడు. పసుపు వస్త్రాలను ధరించమని సూచిస్తాడు.

ఇంట్లోని మగవారు ఆ రోజు క్షవరానికి వెళ్లకూడదని చెప్తాడు. అలాగే, ఆడవాళ్లు ఆరోజు తలస్నానం చేయకూడదని గుర్తుచేస్తాడు.

ఇలా కొన్ని గురువారాలు పాటించగానే, వారి సంపద వారిని వెతుక్కుంటూ వస్తుంది. అలా వారు భాగ్యవంతులవుతారు.

రెండవ వ్రతకథ:

స్వర్గంలో ఇంద్రుడు తన సభలో సమావేశాన్ని ఏర్పాటుచేస్తాడు. ఈ సమావేశానికి దేవుళ్ళతో పాటు ఋషులు విచ్చేస్తారు. బృహస్పతి విచ్చేయగా అందరు గౌరవపూర్వకంగా నిలుచుని వందనాలు పలుకుతారు. అయితే, ఇంద్రుడు మాత్రం కూర్చునే ఉంటాడు. తనని అవమానించినట్లు భావించిన బృహస్పతి ఆ సమావేశం నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంద్రుడు తన తప్పును తెలుసుకుని బృహస్పతిని క్షమాపణలు వేడుకుంటాడు.

అయితే, బృహస్పతి ఆగ్రహం చల్లారలేదు. అక్కడి నుంచి బృహస్పతి మాయమైపోతాడు.

రాక్షసుల రాజైన వృషవర్మ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పన్నాగం పన్నుతాడు. ఇంద్రుడిని మోసం చేయడం ప్రారంభిస్తాడు. మొదట్లో, ఇంద్రుడికి ఈ విషయం అర్థం కాదు. ఆ తరువాత, బ్రహ్మను కలిసి విషయాన్ని వివరిస్తాడు. బృహస్పతి నుంచి మద్దతు లభించటం లేనందువలన ఒక బ్రాహ్మణుడిని గురువుగా భావించమని సలహా ఇస్తాడు. విశ్వరూప అనబడే బ్రాహ్మణ కుమారుడిని గురువుగా భావిస్తాడు ఇంద్రుడు.

ఈ విషయాన్ని రాక్షసులు కూడా తెలుసుకుంటారు. విశ్వరూపుడు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నప్పుడు అతడిని ఓడించాలని ప్రయత్నిస్తారు. ఇందువలన, పవిత్ర మైన యజ్ఞం విఫలం అవుతుంది. ఎటువంటి ప్రయోజనం కలగదు. చివరికి, ఇంద్రుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే, బ్రహ్మదేవుడు బృహస్పతిని వెంటబెట్టుకుని ఇంద్రుడి వద్దకు వస్తాడు. ఈ పరిస్థితిని నుంచి వారిని రక్షిస్తాడు. స్వర్గంలో శాంతి నెలకొంటుంది.

English summary

observe-a-thursday-fast-to-become-prosperous

Guru or Brihaspati is the Indian name of the planet Jupiter. Brihaspati Dev is worshiped on a Thursday. The devotee must take a bath before sunrise. Offer dhoop, deep, ghee, gram dal or sweets made of gram flour with yellow flowers to the deity. Abstain from eating salt, and avoid washing hair, clothes or taking a haircut on a Thursday.