Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Diwali 2024: దీపావళి ఎప్పుడు.. అక్టోబర్ 31నా లేక నవంబర్ 1నా? పండితులు ఏం చెబుతున్నారంటే?
హిందువులు జరుపుకునే అదిపెద్ద పండుగల్లో ఒకటి దీపావళి పండుగ. చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండుగ ఇది. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ రోజు.. దేశంలోని ప్రతీ ఇల్లు దీప కాంతులతో నిండిపోతుంది. లక్ష్మీ పూజ, బాణాసంచాల మోతలతో ప్రతి ఇల్లు సందడిగా ఆనందానికి నిలయంగా మారుతుంది. ఇలాంటి గొప్ప పండగను జరుపుకునే రోజు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది.
ఎందుకంటే కొందరు దీపావళి అక్టోబర్ 31న జరుపుకోవాలని అంటుంటే, మరికొందరు నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని అంటున్నారు. పండితులు సైతం ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. అయితే ఇంతకీ పండుగ 31న జరుపుకోవాలా? లేదా 1వ తేదీన జరుపుకోవాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి ఎప్పుడు వస్తుందంటే:
నిజానికి దీపావళి పండుగ రోజు లక్ష్మి దేవి భూమిని సందర్శించడానికి వస్తుందని నమ్ముతుంటారు. అందురు లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ప్రతీ ఇంటిని అందంగా అలంకరించి.. దీపాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి దీపావళిని ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆ అమావాస్య ఎప్పుడు వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు.

పండితులు ఏం చెబుతున్నారంటే?
నిజానికి దీపావళి ఆశ్వయుజ మాసంలో వచ్చే ప్రదోష అమావాస్య రోజు జరుపుకుంటారు. అయితే ఈసారి అమావాస్య అక్టోబర్ 31వ తేదీతో పాటు నవంబర్ 1వ తేదీన కూడా వచ్చింది. అయితే నవంబర్ 1న ఆయుష్మాన్ యోగం.. స్వాతి నక్షత్రం కలయిక జరిగింది. అందుకే దీపావళిని నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని, ఆరోజు జరుపుకుంటేనే శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.
వేదం పంచాంగం ఏం చెబుతుందంటే?
వేద పంచాగం ప్రకారం దీపావళి దీపావళి నాడు లక్ష్మీ పూజ.. అమావాస్య తిథి, ప్రదోష కాలాలను అనుసరిస్తూ.. సాయంకాలం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది. దీని ప్రకారం.. అమావాస్య తిథి, ప్రదోష కాలాలతో పాటు శుభసమయాలున్న అక్టోబర్ 31వ తేదీనే దీపావళి జరుపుకోవాలని వేద పంచాగ నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు దీపావళికి కచ్చితమైన తేదీ ఖరారు కాలేదు. దీపావళికి కూడా ఇంకో పది రోజుల సమయం ఉండడంతో పంచాంగ నిపుణులు కూడా ఎదో ఒక తేదీని ఖరారు చేసే అవకాశముంది. ఆ తేదీ ఖరారు అయితే బోల్డ్ స్కై తెలుగులో మేము మళ్ళీ అప్డేట్ చేస్తాము.
దీపావళి రోజున ఏం చేస్తారంటే?
హిందువులు జరుపుకునే అతిపెద్ద అత్యంత విశిష్టమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. ఈ పండుగ రోజున గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తారు. ఇల్లంతా అలంకరించి, దీపాలు వెలిగించి, బాణాసంచాలు కాల్చి పండుగను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications