Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంతకీ దసరా ఏ రోజు జరుపుకోవాలి 12న లేదా 13న? పండితులు ఏం చెబుతున్నారంటే?
దసరా పండగ దగ్గపడింది. ప్రతి ఒక్కరూ పండగ మోడ్‌లో విహరిస్తున్నారు. షాపింగ్ నుంచి మొదలుకొని, పిండి వంటలు చేసుకోవడం వంటి పనుల్లో మునిగిపోయారు. అయితే ఈ సంవత్సరం దసరా రెండు రోజులు వస్తుండడంతో ఏ రోజున పండుగ జరుపుకోవాలనేది సందిగ్ధంగా మారింది. ఇంతకీ పండగ ఏ రోజున జరుపుకోవాలి? పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇక్కడ చెప్పాము పూర్తిగా చదవండి..
దసరా ఏ రోజున వస్తుందంటే?
దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగల్లో దసరా పండగ ముఖ్యమైనది. ఈనెల 3వ తేదీ నుంచే దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులందరూ దేవి శరన్నవరాత్రుల్లో, అమ్మవారి పూజలో మునిగితేలుతున్నారు. అయితే ఇంతకీ దసరా ఎప్పుడనే సందిగ్ధం భక్తుల్లో నెలకొంది. నిజానికి ఈ ఏడాది దసరా రెండు రోజులు వచ్చింది. ఈనెల 12వ తేదీ ఉదయం 10.58 గంటలకు విజయదశమి ప్రారంభమవుతుంది. అలాగే ఈనెల 13వ తేదీ అంటే అక్టోబర్ 13వ తేదీ ఉదయం 9.08 గంటలకు వరకు దసరా ఘడియలు ఉండడనున్నాయి.

పండగ ఏ రోజున జరుపుకోవాలంటే?
దసరా పండుగ రెండు రోజులు వచ్చాయి. అయినప్పటికీ దశమి ఘడియలు 12వ తేదీన ప్రారంభమవుతున్నాయి. అంటే అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10.58 గంటల తరువాత విజయ దశమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దశమి ఘడియలు ప్రారంభమైన రోజునే పండుగ జరుపుకుంటే.. ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు, శ్రయోభిలాషులకు తెలియజేసేందుకు ఈ స్టోరీని షేర్ చేయండి.
దసరా ప్రాముఖ్యత తెలుసా?
హిందూ సంప్రదాయంలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దసరా పండుగ. రావణాసురుడిపై రాముడు విజయం సాధించడం, అలాగే దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, వివిధ పద్ధతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు. నవరాత్రులు మొదలైనప్పటి నుంచి రావణుడి దహనం వరకు.. దేశమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా నిర్వహించుకునే పండుగే ఇది.



Click it and Unblock the Notifications