Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
జులై 29న పద్మిని ఏకాదశి.. ఈరోజు ఇవి దానం చేశారంటే ఆర్థిక సమస్యలకు చెక్, ఫుల్లగా లాభాలు!
అధికమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పద్మిని ఏకాదశి అంటారు. దీనిని కమల ఏకాదశి లేదా పురుషోత్తమి ఏకాదశి అని పిలుస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం పద్మిని ఏకాదశి ఉపవాసం ఎక్కువ కాలం ఉండే నెలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండేందుకు చాంద్రమానం ఏదీ నిర్ణయించబడ లేదు. పద్మిని ఏకాదశి ఉపవాసం జూలై 29వ తేదీ శనివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున శ్రీమహా విష్ణువును భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ఈ శీఘ్రాన్ని పాటించడం వల్ల కీర్తి పెరుగుతుంది. అలాగే మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కల్గుతుంది.

పద్మినీ ఏకాదశి ప్రాశస్త్యం..!
త్రేతా యుగంలో కీత్రి వీర్యుడు అనే రాజు ఉండేవాడు. ఈయనకు చాలా మంది భార్యలు ఉన్నారు. కానీ సంతానం మాత్రం కల్గలేదు. దీంతో రాణులతో కలిసి తపస్సు చేస్తే పిల్లలు పుడతారని భావించిన అతడు తన రాణులతో కలిసి తపస్సుకు బయలుదేరాడు. ఏళ్ల తరబడి తపస్సు చేసినా రాజు తపస్సు ఫలించలేదు. అప్పుడు ఒ రాణి... అనుసూయా దేవిని ఒక పరిష్కారం కోరింది. మాల మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని దేవత చెప్పింది. అందుకు సంబంధించిన నియమాలను కూడా వివరించింది. అలాగే పద్మినీ ఏకాది రోజు రాణి ఉపవాసం ఉంది. ఇది పూర్తైన వెంటనే దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని చెప్పగా.. నాకు కాదు నా భర్తకు వరమివ్వమని అడుగుుతుంది.
ఇలా దేవుడు రాజును వరం కోరుకొమ్మని చెప్పగా.. గుణవంతుడైన కుమారుడు కావాలని కోరుకుంటాడు. తథాస్తు అని దేవుడు మాయం అయిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే రాణి గర్భం దాల్చడం, కొడుకు పుట్టడం జరుగుతుంది. అయితే పుట్టిన ఆ బిడ్డకు కార్తవీర్య అర్జునుడు అని పేరు వచ్చింది. ఈ పిల్లవాడు తరువాత చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, శ్రీకృష్ణుడు మొదట పురుషోత్తమి ఏకాదశి ఉపవాస కథను అర్జునుడికి వివరించి, దాని ప్రాముఖ్యతను తెలియజేసాడు.
అయితే పద్మినీ ఏకాదశి రోజు ఈ కథ విన్నా.. కొన్ని వస్తువులను దానం చేసినా గొప్ప పుణ్యఫలం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక సమస్యలు అన్నీ మాయం అయి ధనలాభం కల్గుతుంది. అయితే అందరూ అవే వస్తువులను కాకుండా తమ రాశికి తగ్గట్లుగా ఆయా వస్తువులను దానం చేయాలి. అయితే ఏ రాశి వారు ఏం దానం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
| మేష రాశి : | ఎరుపు బట్టలు, తామ్రడ పాత్రలు, కుంకుమ, బెల్లం |
| వృషభ రాశి : | తెల్ల బట్టలు, పప్పు, సుగంధ, మహాలక్ష్మి దేవాలయంలో వెండి కాలు ఉంగరాలు |
| మిథున రాశి : | బట్టలు, ఆకుపచ్చ పండ్లు, పాత్రలు, శంఖాలు, నాణేలు |
| కర్కాటక రాశి: | పప్పు, బియ్యం, వస్తువులు, తెల్లని రంగు బట్టలు |
| సింహ రాశి : | శంఖ చిప్పలు, వెండి మరియు లక్ష్మి నారాయణ దేవాలయంలో దానం |
| కన్యా రాశి : | ఆకుపచ్చ పండ్లు, వస్త్రాలు |
| తులా రాశి : | దేవాలయంలో పాలు, తెల్లని వస్త్రాలు, సుగంధ, సుగంధ పుష్పాలతో చేసిన స్వీట్ |
| వృశ్చిక రాశి : | ఎరుపు స్వీట్లు, కేసరి, బెల్లం, జీను, ఎరుపు బట్టలు |
| ధనుర్రాశి: | పసుపు బట్టలు, పండ్లు |
| మకర రాశి: | నూనె, నీలి రంగు బట్టలు, నల్ల నీలి వస్త్రాలు, స్వీట్లు, బేసన్ లడ్డూలు, పుస్తకం, పెన్సిల్, పెన్నులు |
| కుంభ రాశి: | బార్లీ, నీలం వస్త్రాలు, నల్ల బట్టలు |
| మీన రాశి : | పసుపు స్వీట్లు, బేసన్ లడ్డులు, పుస్తకం, పెన్సిల్, పెన్ను |
మీ రాశికి అనుగుణంగా ఈ వస్తువులను దానం చేస్తే భగవాన్ విష్ణువు ఆశీర్వాదం పొందవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











