Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Diwali 2024: వింత ఆచారం.. ఆ గ్రామంలో దీపావళి జరుపుకోరట! కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాధారణంగా దీపావళి రోజు దేశం మొత్తం అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటారు. దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి దీపావళిని జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, పిల్లా పాపలతో కలిసి ఈ వేడుకను చూడముచ్చటగా అందంగా నిర్వహించుకుంటారు. దీపావళి రోజు లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తూ తమ కోరికలు కోరుకుంటారు.
ఇంతటి పవిత్రమైన దీపావళిని దేశం మొత్తం జరుపుకుంటే.. ఏపీలోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని జరుపుకోరు. ఆ గ్రామం ఎక్కడుంది? ఆ గ్రామంలో ఎందుకు దీపావళిని జరుపుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ గ్రామం ఎక్కడుందంటే?
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో సుమారు 70 సంవత్సరాల నుంచి దీపావళిని, నాగుల పంచమిని జరుపుకోవడం లేదు. ఈ రెండు పండగలను జరుపుకోవడం వల్ల తమ గ్రామానికి కీడు సోకుతుందని, ఎదో ఒక అపాయం జరుగుతుందని ఆ గ్రామస్థుల నమ్మకమట. అందుకే సుమారు 70 సంవత్సరాల నుంచి ఈ పండగలను జరుపుకోవడం లేదట.

దీపావళిని ఎందుకు జరుపుకోకపోవడానికి కారణం ఏంటంటే..
ఈ దీపావళిని జరుపుకోకపోవడానికి కూడా ఓ కారణం ఉందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. పూర్వం ఆ గ్రామస్థులు దీపావళిని జరుపుకొని నాగుల చవితిని జరుపుకుంటారు. దీపావళి పండగ జరుపుకొని నాగ దేవతను పూజించే వారు. అయితే గతంలో దీపావళిని పూర్తి చేసుకొని నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇంటి వద్ద ఉన్న ఓ చంటి బిడ్డ మరణించాడు.
మరో ఏడాది ఇలానే నాగుల పంచమి రోజు నాగు పాముకు పుట్టలో పాలు పోసి ఇంటికి వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన పశువులు.. అంటే ఎద్దులు, ఆవులు మృతి చెందాయట. దీంతో అప్పటి నుంచి ఆ గ్రామస్తుల్లో భయం నెలకొంది. దీపావళి, నాగులపంచమిని నిర్వహించుకుంటే తప్పనిసరిగా తమ గ్రామంలో కీడు జరుగుతుందని నమ్మారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు దీపావళి పండగను, నాగుల పంచమి పండగను జరుపుకోరు.
యువత పండగ జరపడానికి ప్రయత్నించినప్పటికీ..
గ్రామ పెద్దలది మూఢ నమ్మకమని పండగను జరుపుకుంటే ఎలాంటి హాని జరగదని ఆ గ్రామ యువత, కొత్తగా వచ్చిన కోడళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు. విద్యావేత్తలు, యువత, కోడళ్ళు పండగను నిర్వహించుకోవాలని పట్టు బడుతున్నప్పటికీ ఆ గ్రామంలోని పెద్దలు దీనికి ఒప్పుకోవడం లేదట. తాము అనాదిగా ఈ పండగను జరుపుకోవడం లేదని, పండగను జరుపుకుంటే కచ్చితంగా ఎదో కీడు జరుగుతుందని ఆ గ్రామ పెద్దమనుషులు చెబుతున్నారట.
సుమారు 70 సంవత్సరాల నుంచి తమ గ్రామంలో దీపావళి, నాగుల పంచమి పండగను జరుపుకోమని, ఆ రెండు పండగలు మినహా ప్రతీ పండగను ఘనంగా జరుపుకుంటామని అక్కడి గ్రామస్థులు పేర్కొంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలు, అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. అవి కచ్చితమైనవని మేము నిర్ధారించడం లేదు. వాటిని విశ్వసించడం అనేది మీ బాధ్యత. అందుకే ఇలాంటి విషయాలను విశ్వసించడం, అనుసరించే ముందు తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదా నిపుణుల నిర్ణయాలు, సలహాలు తీసుకోవాలి. అదే ఉత్తమమైన నిర్ణయం.



Click it and Unblock the Notifications