Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
పాములకు వున్న అతీత శక్తులు.. వాటిలో వున్న విషం పై ఎన్నో మిస్టరీలు..మీకు తెలుసా..?
శివుడి మెడలో పాము వుంటుంది. హిందువుల్లో పామును దేవతగా కొలుస్తారు. ఇక పామును కొలుస్తూ ఎన్ని గుళ్లు వున్నాయో లెక్క లేదు. పామును దైవంగా చూడ్డం మూడనమ్మకమా. పాముకు నిజంగా అతీత శక్తులు వున్నాయా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మెదళ్లోకి వస్తుంది. దీనిపై ప్రముఖ పండిుతులు ఏమంటున్నారో తెలుసుకుందాం. జంతువుల జీవితం మొత్తం వాటి మనుగడ చుట్టే అల్లుకొని వుంటుంది. ఏ జంతువైనా తన కడుపు నిండితే చాలని అనుకుంటుంది. కానీ మనుషులు దనికి భిన్నంగా వుంటారు. మనుగడ అనేది మనిషి లక్ష్యం కాదు అది కేవలం ప్రారంభం మాత్రమే. కానీ మిగతా ప్రాణులన్నింటికీ మనుగడే లక్ష్యం. కొన్ని ప్రాణులు గ్రహణ శక్తిని కొంచెం ఎక్కువ కలిగి వుంటాయ్. దీనినే చైతన్యంగా వుంటాయని చెప్పుకోవచ్చు.

భారతీయ సాంప్రదాయాల్లో ఎల్లప్పుడూ నాగుపాము కనిపిస్తుంది. ఈ పాములు ఏదైనా ప్రమాదం వుంటే వెంటనే అక్కడికి చేరుకుంటాయ్. ఇవి ఇలా వుండడానికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన శక్తే కారణం. దీనిని శాస్త్రీయంగా కూడా నిర్ధారించాలి. దక్షిణ భారతదేశంలో వుండేే పాములకు చెవులు వుండవు, వాటి శరీరం మొత్తం నేలను తాకుతూ వుంటుంది, ఆ శరీరమే చెవుల్లా పనిచేస్తుంది. ప్రపంచంలో ఎక్కడో ఏదో దేశంలో భూకంపం వస్తుందంటే దక్షిణ భారతదేశంలో వున్న నాగుపాము భిన్నంగా ప్రవర్తించడం మనం గమనించవచ్చు. ఈ నాగు పాము కదిలికలను ఆ సమయంలో బాగా గమనిస్తే కచ్ఛితంగా ఆ కదలికలను బట్టి ఎక్కడో భూకంపం రానుందని మనం అంచనా వేసుకోవచచ్చు. భూమి మీద చోటు చేసుకునే స్వల్ప ప్రకంపణలను కూడా నాగు పాము పసిగట్టగలవు. ఇందువల్లే కొన్ని రకాల ప్రకంపనల పట్ల అది సున్నితత్వం కలిగి వుంటుంది.
మనం దేన్నైతే చైతన్యం అని పిలుస్తున్నామో దాన్ని అందుబాటులో గనుక తెచ్చుకోగలిగితే మనం ఎన్నో అలజడులను తగ్గించుకోవచ్చు. అడవిలో కూర్చొని ధ్యానం చేస్తూ వున్నట్లయితే మీ ముందు నాగుపాములు వచ్చి చేరుతాయ్. అవి మీ కోసం ఎదురు చూస్తున్నట్టుగా వుంటాయ్. మిమ్మల్ని ఏమాత్రం కాటువేయవు. ఇలాంటి సంఘటనలో ఎంతో మంది యోగులను వేల, లక్షల సార్లు జరిగింది. మనలో ఎలాంటి అలజడులూ లేనప్పుడు అవి పసిగట్టగలుగుతాయ్. ఏ జీవులైతే తమ శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేయగలవో అవన్నీ దీన్ని పసిగట్టుగలవు.

పరిణామ క్రమంలో భాగంలో కొన్ని ప్రాణులు తమ శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేస్తాయ్. ఎందుకంటే అవి వున్న పరిస్థితుల్లో విషయం లేకపోతే బ్రతకలేవు. అయినా సరే అవి నిత్యం భయపడుతూ వుంటాయ్. ఎవరైతే ఎక్కువ భయపడతారో వాళ్లు తమలో విషాన్ని నింపుకొని వుంటారు. విషపూరితమైన అన్ని ప్రాణుల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వున్నాయని కనుగ్గొన్నారు. విషంలో కొన్ని సంక్లిష్టమైన ప్రొటీన్లు కూడా వుండొచ్చని పండితులు చెబుతున్నారు. ఎన్నో రోగాలకు జంతువుల్లో వుండే విషయం పరిష్కారం కానుంది. దీనిపై ప్రఖ్యాత ల్యాబరేటరీల్లో పరిశోధనలు కూడా జరుగుతున్నాయ్.
హిమాలయాల్లో ఇప్పటికీ చాలా మంది యోగులు తాము తపస్సు చేసేటప్పుడు తమ వెంట పొడవైన తేళ్లను డబ్బాలో పెట్టుకొని వెళ్తారు. ఈ తేల్లతో ఆ యోగులు కుట్టించుకుంటారు. ఇలా కుట్టించుకున్నప్పుడు వారి శరీరంలో వున్న నాడీ వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా ప్రకంపనలకు గురౌతుంది. నాడీ వ్యవస్థ మొత్తాన్ని కుదిపేయడానికి వీరు తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు.
కొన్ని విఫపూరితమైన ప్రాణులు ఎక్కడైతే చైతన్యం ఉట్టిపడుతుందో వాటిని గ్రహించగలుగుతాయ్. అతి తక్కువ ప్రకంపణలు కలిగిన ప్రాణులను, శరీరాలను అవి గుర్తించగలుగుతున్నాయ్. ఎక్కడైతే ప్రకంపనలు తక్కువగా వుంటాయో. వాటికి అది శూన్యతలాగా వుంటుంది. అవి వాళ్ల వైపు ఆకర్శింపబడతాయ్. ఆ రకమైన ప్రకంపనలు వున్న శరీరాలకు హానీ చేయలేవు. ఎందుకంటే అవి నిశ్చలత్వాన్ని అనుభూతి చెందాతాయ్.



Click it and Unblock the Notifications