Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
ఎలుకల దెబ్బతో దేవుడికే రక్షణ లేకుండా పోయింది, పూరీ జగన్నాథ్ గుడిలో
ఎంతో ప్రసిద్ది చెందిన పూరీ జగన్నాథ ఆలయంలో ఎలుకలు భయం సృష్టించాయి. పూరీ జగన్నాథ ఆలయం నిర్వాహకులు, అర్చకులకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇటీవల ఈ ఎలుకలు బలభద్ర భగవానుడు, సుభద్రా దేవి దుస్తులను ఎలుకలు కొరికేశాయి. ఇప్పుడు చెక్కతో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఎలుకల దెబ్బతో పాడైపోతాయనే భయం నెలకొంది. ప్రధాన పూజలు చేసేందుకు తీసుకొచ్చిన దేవతా దుస్తులను ఎలుకలు పాడు చేశాయని, విగ్రహాలకు వేసే పూల దండలు, మాలలు కొరికేశాయని ప్రధాన అర్చకులు అంటున్నారు.
పూరీ జగన్నాథ ఆలయం గర్భగుడిలో కూడా ఎలుకలు అపరిశుభ్రతను వ్యాపింపజేస్తున్నాయి. ఇటీవల, ఆలయ నిర్వాహకులు ఎలుకలు, కోతులు మరియు పావురాలను తరిమివేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపెద్ద సౌండ్ లు చేస్తూ ఎలుకలు, కోతులు, పావురాలను తరిమికొట్టడానికి ఒక భక్తుడు విరాళంగా ఇచ్చిన యంత్రాన్ని ఉపయోగించారు. కొంతకాలం క్రితం ఆ యంత్రం గుడి దగ్గర అమర్చారు.

అయితే ఈ శబ్దాల కారణంగా బలభద్ర భగవానుడిని, సుభద్ర దేవి నిద్రను భంగపరుస్తుందని భక్తులు ఆరోపించారు. తర్వాత ఈ యంత్రాన్ని తొలగించారు. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదికల ప్రకారం ఆలయంలో పూజలు చెయ్యడానికి వినాయకుడు, దేవతా విగ్రహాల నిర్మాణానికి చెక్కతో తయారు చేసిన విగ్రహాలను తీసుకొచ్చారు. అయితే చెక్క విగ్రహాలకు ఎలాంటి నష్టమేమీ జరగలేదని, కానీ ఎలుకలు దేవుడి దుస్తులు, పూలు, తులసి ఆకులను పాడుచేశాయని అర్చకులు చెప్పారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించింది.
సాధారణంగా రాత్రి ఆలయాన్ని మూసివేసిన తర్వాత ఎలుకల బెడద పెరుగుతుంది. ఇవి సాధారణంగా పవిత్ర బలిపీఠం పరిసర ప్రాంతాల్లో దాక్కుంటున్నాయి. అంతేకాదు ఎలుకలు నిత్యం నానా హంగామా సృష్టించడంతో దేవస్థానం పూజారులు విసిగిపోతున్నారని వెలుగు చూసింది. రాత్రంతా ఎలుకలను తరమడానికి నిద్రలేకుండా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పూజార్లు అంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సేవక్ రామచంద్ర దశమోహాపాత్ర ఈ విపత్తు నివారణకు ఆలయ నిర్వాహకులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరామని అన్నారు. దేవతలను గంధం మరియు కర్పూరంతో నిత్యం శుద్ది చేస్తారని చెబుతారు.

ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక కేంద్రం పూరీ జగన్నాథ ఆలయం పర్యవేక్షణ చూసుకునే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) జోక్యం చేసుకోవాలని పూజార్లు, భక్తులు అంటున్నారు. ఎలుకల సమస్య నుండి బయటపడటానికి ఆలయ పరిపాలన విభాగం అధికారుల సమిష్టి కృషి అవసరమని దశమోహాపాత్ర అంటున్నారు. ఇది వార్షిక రథయాత్ర ప్రారంభానికి ముందు ఎలుకల నుండి ఆలయంలో అలజడి మొదలైయ్యిందని అర్చకులు అంటున్నారు.
పూరీ జగన్నాథ రథయాత్ర ఇప్పటికే ప్రారంభం అయ్యింది. జూన్ 28వ తేదీ బుధవారం పూరీ జగన్నాథ రథయాత్ర తిరిగి రానుంది. ఈ ఎనిమిది రోజుల రథయాత్రలో, బలభద్ర భగవానుడు, సుభద్ర దేవతలను వారి తల్లి ఇంటి నుంచి అత్త ఇంటికి గుండిచా ఆలయానికి తీసుకువెళుతారు. పూరీ జగన్నాథ దేవాలయంలో ఎలుకల బెడద ఇప్పుడు కొత్త ఏమీ కాదు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 2 సంవత్సరాల పాటు ఆలయం మూసివేయబడింది. ఈ సమయంలో ఎలుకల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రధాన అర్చకులు అంటున్నారు.

పూరీ జగన్నాథ ఆలయానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రూల్ బుక్‌లో పద్ధతులు, విధులు, బాధ్యతలు వివరించబడ్డాయి. ఇది ఎలుకలు, కోతులు, పావురాలు వంటి ఇతర జంతువుల బెదిరింపులతో వ్యవహరించే నియమాలను కూడా కలిగి ఉంది. ఆలయ రూల్‌బుక్ ఎలుకలను చంపడాన్ని నిషేధించారు, కాబట్టి పరిపాలన విభాగం సిబ్బంది ఎలుకలను సజీవంగా పట్టుకోవడానికి ఉచ్చులు వేసి, ఆలయ ప్రాంగణం వెలుపల వాటిని వదిలిపెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మొత్తం మీద పూరీ జగన్నాథ ఆలయంలో ఎలుకల బెడదతో పూజర్లు, అక్కడి సిబ్బంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వెలుగు చూసింది.



Click it and Unblock the Notifications