Latest Updates
-
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?
రక్షాబంధన్ 2026: రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు తీసేయాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.!
సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగానికి ప్రతీక రక్షాబంధన్. ప్రతి యేటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకొంటాం. అక్కాచెల్లెళ్లు ఎంతో ఆప్యాయంగా రాఖీని తమ అన్నదమ్ముళ్ల చేతికి కట్టి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. సోదరులు తమ సోదరీమణుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ దీవిస్తారు. అయితే పండుగ తర్వాత మగవారు రాఖీని ఎంతకాలం చేతి మణికట్టుకి ఉంచుకోవచ్చు.. దానిని ఏ పద్ధతిలో తీయాలి.. అనే విషయాలపై చాలా మందిలో సందేహం నెలకొంటుంది. దీనిపై శాస్త్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం..

రాఖీ పౌర్ణమి వచ్చిందంటే ప్రతి ఇంటా సందడి వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువుల రాకతో అన్నదమ్ముళ్ల ముఖాల్లో సంతోషం, సంబరం నిండిపోతుంది. పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లయి అత్తవారింటికి వెళ్లిన ఆడపడుచులు.. తమ తోడబుట్టిన సోదరులకు నచ్చిన రాఖీలను తీసుకువచ్చి నోరు తీపి చేసి వారికి బొట్టు పెట్టి మంగళ హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. కుటుంబీకుల మధ్య అనుబంధాలను పెంచే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఇది..
తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి తిథి ఆగష్టు 27న ప్రారంభమై 28న ఉదయం 9.09 గంటలకు ముగుస్తుంది. దీంతో ఉదయం తిథి కారణంగా ఆగష్టు 28న రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా రాఖీ కట్టిన తర్వాత శాస్త్రాల ప్రకారం రాఖీని ఎలా తీసేయాలి.. ఎన్ని రోజుల వరకు ఉంచుకోవాలి.. తెలుసుకుందాం..

ఎంతకాలం రాఖీని ఉంచుకోవచ్చు..
మత విశ్వాసాల ప్రకారం రాఖీని కనీసం ఒకరోజు లేదా సుమారు 24 గంటలపాటు మణికట్టుకి ఉంచుకోవడం శుభప్రదంగా చెబుతున్నారు. అయితే కొందరు రాఖీని మూడు నుంచి ఏడు రోజుల వరకు ఉంచుకునే సంప్రదాయం పాటిస్తారు. మరికొన్ని ప్రదేశాల్లో శ్రీకృష్ణజన్మాష్టమి వరకు రాఖీని మణికట్టుకి ఉంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కృష్ణాష్టమి పూజల తర్వాత రాఖీని గౌరవప్రదంగా తీసేయవచ్చు.
ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..
రాఖీ కట్టించుకున్న తర్వాత దానిని గౌరవప్రదంగా తీసివేయడం మంచిది. ఎలా పడితే అలా దారంలాగా తొలగించకూడదు. రాఖీ తీసే ముందు స్నానం చేసి దేవుడిని ప్రార్థించి ప్రశాంతమైన మనసుతో దారాన్ని విప్పాలి. తర్వాత దీనిని చెత్తలో పారేయకుండా.. భద్రపరచడం లేదా నిమజ్జనం చేయాలి. ఇంట్లో ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి పూజా స్థలంలో లేదా శుభ్రమైన ప్రదేశంలో భద్రపరచాలి. లేదంటే ప్రవహించే నది లేదా చెరువులో నిమజ్జనం చేయవచ్చు.



Click it and Unblock the Notifications
