Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
Ram Navami 2022:ఈ నెలలో శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది? శుభ ముహుర్త వివరాలివే..
2022 సంవత్సరంలో శ్రీరామ నవమి తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత మరియు విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
'రామ' అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తోంది.

ఈ పండుగను హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శ్రీరాముడు త్రేతా యుగంలో వసంత కాలంలో ఛైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహుర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు.

ఆ మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజునే భారతీయులంతా పండుగగా జరుపుకుంటారు. పద్నాలుగేళ్లు అడవిలో వనవాసం చేసి, లంకలో రావణాసరుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవవత్సరం ఛైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత సరిగ్గా తొమ్మిది రోజుల తర్వాత శ్రీరామ నవమిని జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా ఆలయాల్లో సీతారాములోరి కళ్యాణం జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాణాన్ని ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీరామ నవమి శుభ ముహుర్తంతో పాటు శ్రీరామనవమి ప్రాముఖ్యత, విశిష్టత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శుభ ముహుర్తం..
హిందూ పంచాంగం ప్రకారం, 2022 సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదీన ఆదివారం నాడు శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన శుభముహుర్తం ఎప్పుడంటే ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:39 గంటల వరకు ఉంటుంది. అంటే సుమారు 2 గంటల 33 నిమిషాల పాటు ఉంటుంది. ఈ వ్యవధిలోనే శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిపించాలి.
నవమి తిథి ప్రారంభం : ఏప్రిల్ 10న అర్థరాత్రి 1:23 గంటలకు
నవమి తిథి ముగింపు సమయం : ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు

నవమి రోజున..
హిందూ క్యాలెండర్ ప్రకారం, శ్రీరాముడు ఛైత్ర మాసంలోని శుక్ల పక్షంలో నవమి రోజున జన్మించాడు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీరాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీసీతారాముల కళ్యాణాన్ని ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రాముడు జన్మించాడని చాలా మంది నమ్ముతారు. అందుకు సంబంధించిన అనేక ఆధారాలు అక్కడున్నాయి. అంతేకాదు రాముని జ్ణాపకార్థం అక్కడ రామాలయం కూడా నిర్మిస్తున్నారు.

శ్రీరాముని జననం..
చరిత్రను పరిశీలిస్తే.. ఛైత్ర మాసంలో తొమ్మిదో రోజైన నవమి రోజున మధ్యాహ్నం సమయంలో కౌసల్యకు జన్మించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రఘ్నలు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు ఏడో అవతారమే రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసమే రాముడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం 51114 నుండి జనవరి 10వ తేదీన జన్మించి ఉంటారని భావిస్తున్నారు.

ఉపవాస దీక్ష..
శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేస్తారు. ముందుగా పూజ గదిని శుభ్రం చేసి ఉతికిన బట్టలను లేదా కొత్త బట్టలను వేసుకుంటారు. అదే విధంగా ఈరోజున ఉపవాస దీక్షను కూడా చేస్తారు. సూర్యోదయం నుండి సూర్యస్తమయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.

శ్రీరాముని శోభాయాత్ర..
శ్రీరాముని రాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి మార్చి లేదా ఏప్రిల్ మాసాలలో వస్తుంది. శ్రీరాముడు పుట్టిన సమయం మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే చాలా మంది ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో శ్రీరాములోరి శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తారు.

మహా విష్ణువే..
శ్రీరామ నవమి వేసవి కాలంలో ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. అందుకే రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే.. ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే‘ అనే శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని చాలా మంది నమ్మకం. దుష్ట శిక్షణ, శిష్ట రకషణ కోసం ఛైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే కౌసల్య పుత్రుడిగా ఈ భూమిపై జన్మించాడని నమ్ముతూ శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications