Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
Ram Navami 2023: శ్రీరాముని నామాలు వాటి అర్థాలు
శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి దేశవ్యాప్తంగా శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేది ప్రతి ఏటా సంప్రదాయంగా వస్తోంది. చైత్రమాసంలోని శుక్ల పక్షంలో నవమి తిథి నాడు శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజును శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం శ్రీరామ నవమి మార్చి 30వ తేదీన వస్తోంది.
పద్నాలుగేళ్లు వనవాసం, రావణుడిని మట్టుబెట్టి అనంతరం శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం పొందాడు. ఈ శుభ సమయం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చాలా మంది ప్రజలు నమ్ముతారు. అంతేకాదు శ్రీ సీతారాములోరి కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని చాలా మంది నమ్మకం.

శ్రీరాముడిని అనంతగుణ, దయాసార, జానకీ వల్లభ, కౌసలేయ, రాఘవ, రాజీవ లోచన లాంటి అనేక పేర్లతో పిలుస్తుంటారు. శ్రీరాముని వివిధ పేర్లు వాటి అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అనంతగుణ
శ్రీరాముడు అంటేనే పరిపూర్ణమైన వ్యక్తిగా భావిస్తారు. ఆయన విధేయత, వినయం, ప్రేమ, గౌరవం, వ్యక్తిత్వం లాంటి అన్ని సద్గుణాలు కలిగిన వాడు రాముడు. అందుకే ఆయనను అనంతగుణ అని పిలుస్తుంటారు.
2. దయాసార
రాముడు ఎంతో దయగల వ్యక్తి. దయాగుణుడు శ్రీరాముడు. అందుకే శ్రీరాముడిని దయాసార అని పిలుస్తారు.
3. జానకీ వల్లభ
రాముడు జనక రాజు కుమార్తె సీతను వివాహమాడాడు. సీతా దేవిని జానకి అని కూడా పిలుసతారు. సీతా దేవిని వివాహం చేసుకున్న తర్వాత రాముడు జానకీ వల్లభుడు అయ్యాడు. జానకీ వల్లభ అంటే జానకీ భర్త అని అర్థం.
4. జితామిత్ర
రాముడు తన జ్ఞానం, దయ, శౌర్యంతో శత్రువులను గెలిచేవాడు. రాముడి శౌర్యానికి, దయాగుణానికి ప్రతి ఒక్కరూ లొంగిపోయేవారు, స్నేహాన్ని ప్రారంభించేవారు. అందుకే శ్రీరాముడిని జితామిత్ర అని పిలుస్తారు. అంటే శత్రువులను గెలిచేవాడు అని అర్థం
5. కౌసలేయ
దశరథ మహారాజు, కౌసల్యకు జన్మించాడు శ్రీరాముడు. హిందూ సంస్కృతిలో పిల్లలను వారి తల్లిదండ్రుల పేరుతో కూడా పిలుస్తారు. అలా రాముడిని కౌసలేయ అని పిలుస్తారు. కౌసలేయ అంటే కౌసల్య కుమారుడు అని అర్థం.
6. రాజీవ లోచన
రాజీవ లోచన అంటే తామర రేకుల ఆకారాలం కళ్లు ఉన్నవాడు అని అర్థం. శ్రీరాముని కళ్లు చాలా అందాగ ఉంటాయట అందుకే రాజీవ లోచన అని పిలుస్తారు.
7. రామచంద్ర
శ్రీరాముడు చాలా సౌమ్యుడు, అందమైన వాడు. అందం, సౌమ్యం గురించి ప్రస్తావన వస్తే చంద్రునితో పోలుస్తుంటారు. అందుకే శ్రీరాముడిని శ్రీరామచంద్ర అని కూడా పిలుస్తుంటారు.
8. రఘువీర
రాముడు సూర్యుని వంశమైన ఇక్ష్వాకులో జన్మించాడు. అలా శ్రీరాముడిని రఘువీర అని పిలుస్తారు. రఘు వంశానికి చెందిన వీరుడు అని అర్థం.
9. అత్యవిక్రమ
శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. ఆయనే సత్యం అని చెప్పడానికి అత్యవిక్రమ అని అంటారు.
10. వ్రతధార
రాముడు ధర్మాత్ముడు, న్యాయాన్ని, ధర్మాన్ని సమర్థించేవాడు, పాటించేవాడు. దుర్మార్గులను, తప్పు చేసిన వారిని శిక్షించేవాడు. మానవాళి కోసం కఠినమైన తపస్సులు కూడా చేస్తాడని వ్రతధార అని పిలుస్తారు.



Click it and Unblock the Notifications
