Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Sri Rama Navami Talambralu: కన్నుల పండుగగా భద్రాచలం సీతారాముల కళ్యాణం, కోటి ముత్యాల తలంబ్రాలు సిద్దం..
Sri Rama Navami Talambralu: భద్రాచలం, ఒంటిమిట్ట సితారాముల కళ్యాణోత్సవాలకు సర్వం సిద్దం చేస్తున్నారు. గోటితో ఒలిచిన కోటి ముత్యాలు సితారాముల కళ్యాణోత్సవాలకు సిద్దంగా ఉన్నాయి. ఓ యజ్ఞలా, ఎంతో భక్తిశ్రద్దలతో ఎంతో పవిత్రంగా పండించిన ముత్యాలను గోటితో ఒలిచి వాటిని శుభ్రం చేసిన ముత్యాలను సీతారాముల కళ్యాణోత్సవాలకు ఉపయోగిస్తారు.
భద్రాచలం, ఒంటిమిట్టలోని రాముడి ఆలయాల్లో కోటి తలంబ్రాలతో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించడానికి సర్వం సిద్దం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని తుర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలోి అచ్యుతాపురంలోని గ్రామంలోని వ్యవయాయ భూమిలో ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించకుండా ముత్యాల పంట పండిస్తారు.

మొదట విత్తనాలను తెలంగాణలోని భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలోని ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. తరువాత ప్రత్యేక కళశాలలో వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి శ్రీరామరామస్మరణంతో వాటిని పంట పండిస్తారు. ఎంతో పవిత్రంగా పండించిన పంటను భక్తి శ్రద్దలతో పంటను కోసి, వాటిని విడిపించి వాటిని తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 3 వేల మంది భక్తులకు పంపిస్తారు.
శ్రీరామనామస్మరణంతోనే ఆ ముత్యాలను గోటితో ఒలిపిస్తారు. ఇలా గోటితో ఒలిపించిన కోటి ముత్యాలను తెలంగాణలోని భద్రాచలంకు. మరో కోటి ముత్యాలను ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట ఆలయానికి అందిస్తారు. ప్రత్యేక కళశాలలో ముత్యాలను భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు తరలిస్తారు. శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కళ్యాణోత్సవం చాలా ఘనంగా, వైభంగా నిర్వహిస్తారు.
సీతారాముల కళ్యాణోత్సవానికి ఉపయోగించిన కోటి ముత్యాల తలంభ్రాలను ముట్టుకుంటేనే ఎంతో పుణ్యం అని భక్తులు అనుకుంటారు. గత 12 ఏళ్ల నుంచి ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎంతో పవిత్రంగా పండిచిన ముత్యాలను గొటితొ ఒలిపించి వాటిని భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాలకు పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శ్రీసీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడానికి తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం. ఒంటిమిట్ట ఆలయాలు సర్వం సిద్దం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications