Latest Updates
-
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.! -
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ.. -
గుడ్లు,చికెన్ కంటే వీటిలోనే ఎక్కువ ప్రొటీన్,మినరల్స్..బరువు తగ్గాలన్నా,కండలు పెంచాలన్నా ఇవే బెస్ట్ -
ఇడ్లీ, దోసెలు కాదు పొద్దున్నే ఇది తినండి..100 ఏళ్లు ఆరోగ్యంగా బతికేస్తారు! -
కాల సర్ప దోషంతో కష్టాలు.. నాగుల పంచమి రోజున ఈ ఐదు పనులు చేయండి.!
ఈ పదాలు వాడినా.. ఈ పనులు చేసినా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుందట..
పురాణాల్లో యోగ వశిష్టుని మాటలను బట్టి అదృష్టం (లక్కీ) అనే మాట మీ ఇంట్లో మూడుసార్లకు మించి వినబడితే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.
ప్రస్తుత ప్రపంచంలో ఎవరికైనా ఏ పని కావాలన్నా ముందుగా లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సిందే. ప్రస్తుత నాగరిక కాలంలో లక్ష్మీదేవి కటాక్షం లేనిదే ఏ పని జరగదు. మీ దగ్గర ఎన్ని లకారాలు ఉంటే సమాజంలో మీపై అంత గౌరవం, మర్యాదలు ఉంటాయి. అందుకే లక్ష్మీదేవిని అందరూ అంతలా ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి చంచల, చపల అనే పేర్లున్నాయి.

వీటి అర్థం లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండకపోవడం. నిత్యం హిందువుల ఇంట్లో వెలిగించే దీపమే లక్ష్మీదేవి రూపం అని కూడా చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే చీకటి నుండి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం. అదే సంపద, జ్ఞానం. ఇవి రెండు భిన్నమైనవి కావు. ఎందుకంటే వీటిలో ఒకటి ఉంటే మరొకటి కచ్చితంగా వెంట ఉంటుంది. అలాగే ఇతరులను మోసం చేసి, అడ్డదారుల్లో అక్రమంగా, సులభంగా ధనం ఆర్జిస్తే చాలు అని కొందరు అనుకుంటారు. అలాంటి వారిని లక్ష్మీదేవి వరించినట్టు కనిపించినా అది చంచలం. ఇంతకీ ఏయే పదాలను పలికితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టదు. ఆ పదాలను మూడు సార్లకు మించి పలికితే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెంటనే వెళ్లిపోతుందా? ఆ పదాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే.

అదృష్టం..
పురాణాల్లో యోగ వశిష్టుని మాటలను బట్టి అదృష్టం (లక్కీ) అనే మాట మీ ఇంట్లో మూడుసార్లకు మించి వినబడితే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. ఎందుకంటే ఏ ఇంట్లో కష్టపడి పని చేయకుండా అదృష్టంపైనే ఆధారపడి ఉంటారో.. అదృష్టాన్నే నమ్ముకుని ఏ పని చేయకుండా సోమరితనం పెంచుకుని ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదట. వెంటనే మీ ఇంటి నుండి వెళ్లిపోతుందట. అందుకే మీరు ఎప్పుడు అదృష్టంపైనే ఆధారపడకండి. ఎవరినీ ఉద్దేశించి ఈ పదాన్ని వాడకండి.

దురదృష్టం..
యోగ వశిష్టుడు మాటల ప్రకారం అదృష్టంతో పాటు దురదృష్టం (అన్ లక్కీ) అనే పదాన్ని కూడా మూడుసార్లకు మించి మీ ఇళ్లలో వాడితే లక్ష్మీదేవి వెళ్లిపోతుందట. ఎందుకంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా పొరపాటు చేసినప్పుడు వారు దాన్ని ఒప్పుకోకుండా మా టైమ్ బాగాలేదు. లేదా దురదృష్టం (అన్ లక్కీ) వల్లే ఇలా జరిగింది అని అంటుంటారు. ఈ ‘దురదృష్టం‘ పదాన్ని మూడుసార్లకు మించి వాడినా కూడా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటి నుండి వెళ్లిపోతుందట. కాబట్టి ఈ పదాన్ని వాడటం కూడా మానుకోండి.

పాలు ఒలికితే..
మన ఇళ్లలో ఉండే పాలు పొరపాటున ఒలికినా కూడా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుందట. కలలో కూడా పాలు ఒలికిపోయినట్లు కనిపిస్తే లక్ష్మీదేవి వెళ్లిపోయిన మీకు కష్టాలు వస్తున్నాయడానికి సంకేతం. అలాగే ఆవు పాలు అయినా, గేదే పాలు అయినా లేదా ప్యాకెట్ పాలు అయినా కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రతిరోజూ పాలు ఒలికిపోతుంటే వారికి కష్టాలు మొదలైనట్టే. ఇవి దరిద్రానికి సంకేతం. అలాగే ఎవరి ఇంట్లో పాలు పుష్కలంగా, జాగ్రత్తగా ఉంటే వారి ఇంట్లో ధనం పుష్కలంగా ఉంటుంది.

పాలు నేలను తాకరాదు..
చాలా మంది ఇళ్లలో పాలు ఒలికిపోయినపుడు దానిపైన మ్యాట్ వేసి లేదా ఏదైన బట్టను దాని మీద వేసి కాలితో తుడిచేస్తారు. అలాగే దానిపైనే నడుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు దరిద్రం పడుతుందట. కాబట్టి ఒకవేళ ఇలా పాలు ఒలికిపోతే దానిపైనే కొన్ని నీళ్లు చల్లి దానిపైన ఒక బట్టతో తుడవాలి. తర్వాత మరికొన్ని నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పూర్వం మన పెద్దవారు ఇలాగే చేసేవారట. ఎందుకంటే పాలు కింద నేలను ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు.

పాలు లక్ష్మీదేవికి సంకేతం..
పురాణాల ప్రకారం పాలను ఎవరైతే పవిత్రంగా భావిస్తారో.. పాలను ఎవరైతే ఆరాధిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలాగే పాలకు లక్ష్మీదేవికి, చంద్రుడికి లక్ష్మీదేవికి సంకేతం. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఐశ్వర్యాలను ఇస్తాడు. అందుకే ఎవరికైతే పాలలో చంద్రుడు కనిపిస్తాడో లేదా పాలలో ఎవరికైతే లక్ష్మీదేవి కనిపిస్తుందో వారికి అష్టఐశ్వర్యాలు లభిస్తాయి. అందుకే గృహ ప్రవేశం చేసినప్పుడు పాలను పొంగిస్తారు.

ఈ మూడు రోజుల్లో ఉప్పును కొంటే..
మన ఇళ్లలో ఉప్పు లేకుండా వంట పూర్తి కాదు. ఉప్పు లేకుండా ఏ పని కూడా జరగదు. అందుకే ఈ ఉప్పును ఎప్పుడు పడితే కొనకూడదు. అది కూడా శనివారం,సోమవారం, అమావాస్య రోజున ఉప్పును అస్సలు కొనకూడదు. అలా కొంటే మీకు దరిద్రం పడుతుందట. అలాగే ఉప్పును కింద పడకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరైతే లక్ష్మీదేవి నిత్యం ఇంట్లో ఉండాలని కోరుకుంటారో అలాంటి వారు ఆ మూడు రోజుల్లో ఉప్పు(సాల్ట్)ను కొనకండి. ఆ మూడు రోజుల్లో ఉప్పును కొనకుండా ఉంటే మీ ఇంటికి మీరు లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించినట్లే.

ఎవరైతే మాట మీద నిలబడతారో..
ఎవరైతే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో.. ధర్మానికి కట్టుబడి ఉంటారో.. సత్యం ఎక్కువ మాట్లాడుతుంటారో.. నీతి, నిజాయితీగా ఎవరైతే బతుకుతుంటారో అలాంటి వారిని విడిచి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లదట. అలాగే పక్షపాతం లేని చోట కూడా ధనలక్ష్మీ స్థిరంగా ఉంటుంది. అలాంటి వారికి లక్ష్మీదేవి కరుణా, కటాక్షలు లభిస్తాయట. కానీ ఇవేవీ పాటించకుండా నిత్యం ఇంట్లో, దేవాలయాల్లో లక్ష్మీదేవి కోసం ఎన్ని పూజలు చేసినా ఫలితం శూన్యమేనట.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications