Latest Updates
-
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!
అభిషేకం నిర్వహించడానికి కారణాలేంటి ?
మనందరమూ కూడా గుడికి వెళ్ళినప్పుడు చాంతాడంత క్యూ లైన్లో నిల్చుని ఒకరినొకరు తోసుకుంటూ అక్కడ జరిగే అభిషేకం చూడటానికి పోటీ పడతాము కదా.కానీ అసలు అభిషేకం ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా??ఈరోజు ఈ ఆర్టికిల్‌లో మేము వివిధ రకాల అభిషేకాలు, అవి ఎందుకు చేస్తారో కారణాలూ ఇచ్చాము చూడండి.
గుడిలో విగ్రహన్ని నల్లరాయి లేదా తెల్లని పాలరాతితో చెక్కుతారు. విగ్రహనికి ఒక రూపు వచ్చాకా శూభముహుర్తంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఆ విగ్రహాన్ని గర్భ గుడిలో నెలకొల్పుతారు. విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టేముందు విగ్రహం కింద నవరత్నాలని వేసి హోమాలు తదితర పవిత్ర కార్యక్రమాలని చేసి విగ్రహాన్ని గర్భగుడిలో నెలకొల్పుతారు.
దాదాపు అన్ని దేవతా విగ్రహ ప్రతిష్ఠాపనకీ ఇదే పద్ధతి. 48 రోజులపాటు హోమాన్ని నిర్వహిస్తారు. అన్ని రోజులు హోమం చెయ్యడంవల్ల గర్భగుడి బాగా వేడెక్కిపోతుంది. గర్భగుడిలో ఉష్ణొగ్రతని చల్లబరచడానికి అభిషేకాలు చేస్తారని ఒక నమ్మకం. ప్రతీరోజూ గర్భగుడిలో విగ్రహానికి ఆలయ పూజారి అభిషేకం చెయ్యాలి. అభిషేక తీర్ధం లేదా పంచామృతాన్ని భక్తులకి పంచుతారు.
అభిషేకంలో ఉపయోగించే ముఖ్య పదార్ధాలయిన పాలు, పెరుగు, నెయ్యీ ఆవు నుండి లభించినవే వాడాలి. హైందవ ధర్మం ప్రకారం ఆవు చాలా పూజ్యనీయం ఎందుకంటే ఆవులోనే 33 కోట్ల దేవతలూ కొలువై ఉంటారు. అందువల్లే హిందువులకి ఆవు చాలా పవిత్రమైనది.
అభిషేకానంతరం ప్రసాదంగా మనం తీసుకునే పదార్ధాల వల్ల మన శరీరం శుభ్రపడుతుంది. వివిధ రకాల అభిషేకాలకి ఉపయోంచే పదార్ధాలలో ఒక్కోదానికీ ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. గుడిలో లేదా ఇంట్లో విగ్రహాలకి రకరకాల అభిషేకాలు చేస్తారు. వివిధ రకాల అభిషేకాలూ, అందులో ఉపయోహించే పదార్ధాల ప్రాశస్త్యం చూద్దాము.

1.కుంకుమాభిషేకం:
మొట్టమొదట కుంకుమాభిషేకం చేస్తారు. అన్ని విగ్రహాలకీ ఈ అభిషేకాన్ని చేస్తారు.

2. పసుపు అభిషేకం:
పసుపూ కుంకుమలు హిందువులకి చాలా ముఖ్యమైనవి.అందువల్ల పసుపుని నీళ్ళల్లో కలిపి విగ్రహం మీదుగా ఆ పసుపు నీళ్ళని పోస్తారు.

3.పాలాభిషేకం:
దాదాపు సకల ప్రాణికోటికీ పాలు ముఖ్య ఆహారం. ఆవు నుండి వచ్చే పాలల్లో ఆరోగ్యకరమైన చర్మానికి కావాల్సిన పదార్ధాలుండటం వల్ల మన చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. గర్భ గుడిలో విగ్రహానికి కూడా మెరుపు రావాలని విగ్రహ్మ మీదుగా పాలు పోసి అభిషేకం చేస్తారు.

4.పెరుగు అబిషేకం:
పాలాభిషేకం తరువాత పెరుగు అభిషేకం చేస్తారు.పంచామృతాల్లో పెరుగుని ఉపయోగిస్తారు. ఈ అభిషేకం చెయ్యడం వల్ల సత్సంతానం కలుగుతుందని నమ్మకం.

5.తేనె అభిషేకం:
పంచామృతాల్లో పాలూ, పెరుగు తరువాత ముఖ్యమైన పదార్ధం తేనె.తేనె సేవించడం వల్ల తీయని కంఠస్వరం మీ సొంతమవుతుంది.

6.పంచదార అభిషేకం:
పంచదార లేదా చెరకు రసం పంచామృతాల్లో ఉపయోగించే మరొక ముఖ్య పదార్ధం.మీ మనసులోనుండి చెడు ఆలోచనలని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పంచదార.

7.లేత కొబ్బరి నీటి అభిషేకం:
లేత కొబ్బరి నీటితో అభిషేకం చెయ్యడం వల్ల జీవితంలో తృప్తి కలిగి అత్యాశ కలగదు అని ఒక నమ్మకం.

8.డ్రై ఫ్రూట్స్ మరియూ అరటి పండు అభిషేకం:
ఎండు ద్రాక్షలు, ఎండు ఖర్జూరాలు,జీడిపప్పు,ఖర్జూరాలు,అంజీరాలు తదితర డ్రై ఫ్రూట్స్ తో పాటు ముక్కలుగా కోసిన అరటిపండు కలిపి విగ్రహానికి అభిషేకం చేస్తారు.ముఖ్యం గా విగ్రహం యొక్క చేతులు, నుదురు, చాతీ, మోకాళ్ళు, కాళ్ళు, పాదాలమీద ఈ పదార్ధాలని వేసి అభిషేకం చేస్తారు.

9 నీటితో అభిషేకం:
అభిషేకం మొదట్లో మరియూ చివరనా విగ్రహం మీద నీటిని పోస్తారు.అభిషేకంలో ఉపయోగించే ఈ నీటిని దగ్గరలో ఉన్న పవిత్రమైన బావి లేదా నది నుండి పూజారి తీసుకుని వస్తారు.



Click it and Unblock the Notifications