Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మంచుకొండల్లో శివయ్య దర్శనం..అమరనాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రారంభం..ఎలా బుక్ చేసుకోవాలో చూడండి
జమ్మూకశ్మీర్ లోని ముంచుకొండల్లో అమరనాథ్ గుహలో మంచురూపంలో ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తుంటారు. అయితే అమరనాథ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఈ ఏడాది అంటే 2025 అమరనాథ్ యాత్రకు సంబంధించి ఏప్రిల్ 14 నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అమరానాథ్ యాత్ర ఈ సంవత్సరం జులై 3,2025న ప్రారంభమై.. ఆగస్టు 8,2025న ముగియనుంది. భక్తులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో అమరనాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి
step 1: శ్రీ అమరనాథ్ పుణ్యక్షేత్ర బోర్డు(SASP)అధికారిక పోర్టల్ ని ఓపెన్ చెయ్యండి.
step 2: హోంపేజీలో ఆన్ లైన్ సర్వీసెస్(Online Services)ట్యాబ్ ని క్లిక్ చెయ్యండి.
step 3: యత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్(Yatra Permit Registration)సెలక్ట్ చేసుకోండి.
step 4: గైడ్ లైన్స్,ఇన్ స్ట్రక్షన్స్ కనిపిస్తాయి..దాని కింద 'I Agree' అని కనిపిస్తుంది. దానిని క్లిక్ చెయ్యాలి.
step 5: రిజిస్టర్(registar)అని కనిపిస్తుంది. దానిని క్లిక్ చెయ్యండి.

ప్రతిరోజూ ఎంతమందికి అనుమతి,ఏయే డాక్యుమెంట్లు సమర్పించాలి
అమరనాథ్ యాత్ర జమ్మూకశ్మీర్ లో జరుగుతుంది కాబట్టి యాత్రికుల భద్రత,వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజూ సుమారు 15వేల మంది యాత్రికులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. దరఖాస్తుదారులు తమ పేరు, ఇష్టపడే యాత్ర తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అందిచాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ సైజు ఫొటో, హెల్త్ సర్టిఫికెట్ ను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్ OTP ద్వారా ధృవీకరించబడుతుంది. ఇవన్నీ సమర్పించిన తర్వాత రెండుగంటల్లోపు పేమెంట్ లింక్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.220గా ఉంది,దీనిని ఆన్ లైన్ లోనే చెల్లించాలి. పేమెంట్ చెల్లించిన తర్వాత యాత్ర రిజిస్ట్రేషన్ పర్మిట్ ను పోర్టల్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ ఎలా
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం..అయరనాథ్ యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకువాళ్లకి ఆఫ్ లైన్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 540 గుర్తించిన బ్యాంకు బ్రాంచ్ లలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వైష్ణవి ధామ్, పంచాయితీ భవన్, మహాజన్ హాల్ వంటి సెంటర్లలో ఎంచుకున్న యాత్ర డేట్ కి 3 రోజుల ముందు టోకెన్ స్లిప్ లు జారీ చేస్తారు. యాత్రికులు మరుసటి రోజు హెల్త్ చెకప్, అధికారిక రిజిస్ట్రేషన్ కోసం సరస్వతి ధామ్ కు వెళ్లాల్సి ఉంటుంది.తర్వాత జమ్మూలోని RFID కార్డ్ సెంటర్ ని కూడా సందర్శించాలి.



Click it and Unblock the Notifications