Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మాంగళ్యధారణ చేయునప్పుడు మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు..?
హిందూ వివాహ సంప్రదాయంలో మాంగల్య ధారణ అనేది చాలా ప్రధానమైన ఘట్టం. మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అంటే ధరించటం అని అర్ధం. పెళ్లికూతురి మెడలో పెళ్ళికొడుకు ఒకటి పెళ్లికూతురి తరుపు, రెండొవది పెళ్ళికొడుకు త
హిందూ వివాహ సంప్రదాయంలో మాంగల్య ధారణ అనేది చాలా ప్రధానమైన ఘట్టం. మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అంటే ధరించటం అని అర్ధం. పెళ్లికూతురి మెడలో పెళ్ళికొడుకు ఒకటి పెళ్లికూతురి తరుపు, రెండొవది పెళ్ళికొడుకు తరుపున, ఇలా రెండు మంగల్యాలను కడతాడు.
అంటే మాంగల్యానికి రెండు బిళ్ళలు వ్రేలడతాయి. ఈ మాంగల్యం రక్షణ, నమ్మకం, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడు నీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక. ఇంతకీ మూడు ముళ్ళకున్న దైవాంశిక పరమార్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

ప్రాచీనుల కాలం నుండి
ప్రాచీనులు ‘మూడు' అనే అంకెకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు.

దేవుళ్ళకు సంబంధించి:
దేవుళ్ళకు సంబంధించి: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.

సృష్టి పరంగా
సృష్టి పరంగా :సృష్టి, స్థితి, లయలు మూడు అని మనకు తెలిసిందే.

ఆధ్యాత్మిక పరంగా :
ఆధ్యాత్మిక పరంగా : ఆధి దైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక శాంతులు మూడు.

యాగంలో ప్రత్యేకంగా :
యాగంలో ప్రత్యేకంగా : యాగానికి కావలసిన అగ్నులు మూడు.

తాంబూలంలో :
తాంబూలంలో : ఆకు, వక్క, సున్నం ఈ మూడూ తాంబూలంకు ముఖ్యం.

యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం : యజ్ఞోపవీతంలోని పోగులు మూడు. ఒక్కో పోగులోని లోపలి పోగులు మూడు.

బ్రహ్మ సూత్రంలోని
బ్రహ్మ సూత్రంలోని ముడులు మూడు.

మోక్ష్యం కోసం:
ధర్మ, అర్థ, కామ అనే మూడింటితో మోక్షాన్ని పొందటానికి.

మంగలసూత్రపు పేటలు
అలాగే మంగలసూత్రపు పేటలు మూడు, ముడులు కూడా మూడు.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:
ప్రతీ వ్యక్తికీ మూడు శరీరాలుంటాయి : స్థూల - సూక్ష్మ - కారణ శరీరాలు.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:
మాంసం, రక్తం, ఎముకలు - వీటన్నింటినీ కప్పే ఈ కనిపించే శరీరం స్థూల శరీరం. వ్యక్తిని ఆకర్షించేది ఈ శరీరమే.( ఒడ్డు, పొడుగు, రంగు మొదలైన వాని ద్వారా)
శరీరానికి ఆధారభూతుడైన జీవుడు నివసించే శరీరం సూక్ష్మ శరీరం. జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా? లేదా? అని సాక్షిభూతంగా పరమాత్మ చూసే శరీరం కూడా ఇదే.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:
పూర్వ జన్మలో చేసిన ఏ పుణ్య పాపాల బాకీని తీర్చుకోవడానికి ఈ శరీరం పుట్టిందో అది కారణ శరీరం. రోగాలూ, నొప్పులూ, బాధలూ, మానసిక శాంతీ, ఆధ్యాత్మిక చింతనా ఏది వచ్చినా అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. అది ఈ శరీరానికి కలుగుతుంది.

ఇవి కాక మరొక ముఖ్య విశేష విషయం ఏమిటంటే:
విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యవంతునికి ఆరోగ్యవంతుడే పుట్టవలసి ఉన్నా, కారణ శరీరం ద్వారా అనారోగ్యవంతుడు పుట్టవచ్చు. చాలా మంది పుత్రులు తల్లిదండ్రులలాగ ఉండకపోవడానికి ప్రత్యక్షసాక్ష్యం కారణ శరీరం. ఇలా మూడు శరీరాలకు మూడు ముడులు వేస్తాడు వరుడు.



Click it and Unblock the Notifications