Latest Updates
-
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి!
దేవుని ఉంగరాన్ని ఎలా ధరించాలి? పాటించాల్సిన నియమాలేంటి..!?
సాధారణంగా మనలో చాలా మంది ఉంగరాల్లో, మెడలో వేసుకునే చైన్ లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు ఆదుకోవడం, దండం పెట్టుకోవటం వంటి పనులు చేస్తుంటారు. చాలా మంది ఆ ప్రతిమలలో దైవత్యం ఆపాదించుకుంటుంటారు. అసలు దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి? తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం...
ఉంగారాలు కానీ, మెడలోని గొలుసులు కానీ దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు అభిషేకాలు చేయించి జాతక రిత్యా ధారణ చేయాలి. అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది. అప్పుడే సాక్షాత్తు భగవంతుడు మన వెంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి...

దేవుడు ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు
ఉంగరం ఉన్న దేవుడు ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు, కాళ్ళు గోర్లవైపు ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం చేతివేళ్ళు, గోళ్లు భూమిని చూస్తూ ఉంటాయి.

గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి.
ఉంగరం కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి.

బహిష్టు సమయంలో
ఇక స్త్రీలు అయితే బహిష్టు సమయంలో కంటే ముందే ఉంగరాలు, లాకెట్లు తీసి భద్ర పరుచుకోవాలి.

భార్య, భర్తలు కలిసే సమయంలో
భార్య, భర్తలు కలిసే సమయంలో దేవుడి ఉంగరాలు చేతికి ఉండకూడదు.

భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకుండా
దేవుడి ఉంగరాలు ధరించినప్పుడు, భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకుండా తినాలి.

మాంసాహారం ముట్ట రాదు.
దేవుడు ఉంగరాలు ధరించి మాంసాహారం ముట్ట రాదు. ఎందుకంటే మాంసాహారం తినేటప్పుడు, ఆ మాంసం దేవుడు ప్రతిమకు తగులుతుంటే ఒక్కసారి ఊహించుకోండి మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలుస్తుంది.

ధూమపానం చేయకూడదు.
మగవారు దేవుడు ఉంగరాలు ధరించి ధూమపానం చేయకూడదు. ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు. తెలిసి తెలిసి చేసే తప్పును ఆ భగవంతుడు కూడా క్షమించడు. అంతే కాదు మద్యపానం కూడా అంతే..

జాగ్రత్తలు పాటించేట్లైతేనే దేవుడి ప్రతిమలు కలిగిన ఉంగరాన్ని ధరించాలి.
ఇన్ని జాగ్రత్తలు పాటించేట్లైతేనే దేవుడి ప్రతిమలు కలిగిన ఉంగరాన్ని ధరించాలి. లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉన్నది.



Click it and Unblock the Notifications