సాయి బాబా గురువారం వ్రతం గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర విషయాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

సాయి బాబా గురువారం వ్రతం గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర విషయాలు

సాయిబాబా హిందువుల మరియు ముస్లింల ప్రముఖ ఆరాధ్యదైవంగా కీర్తింపబడుచున్నారు. అతన్ని దేవుని ప్రతిరూపంగా నమ్ముతారు. సాయిబాబా యొక్క భోధనలు హిందూ, ముస్లింల అంశాలు రెండింటినీ కలపడం ద్వారా అత్యధిక ప్రాచుర్యాన్ని సంతరించుకున్నాయి. సాయిబాబా ప్రేమ, సహనం, శాంతి మరియు వివేచనా సంకేతాలను భోధించారు. సబ్ కా మాలిక్ ఏక్ హై అనునది సాయిబాబా నిర్వచనం, అనగా దేవుళ్ళందరూ ఒక్కటే అని.

తొమ్మిది వరుస గురువారాల యందు చేయు ఉపవాసాల ద్వారా సాయి కృపాకటాక్షాలు సిద్ధిస్తాయని ప్రజల ప్రఘాడ విశ్వాసం. ఇలా చేయు ఉపవాసాల ద్వారా సాయి కరుణ పొందడం ద్వారా కోరికలు నేరవేరడంతో పాటు ఆశించిన అన్నీ రంగాలలో విజయం సిద్దిస్తుంది అని భక్తుల నమ్మకం.

Sai Baba | Thursday Vrata | Sai Baba Blessings

సాయిబాబా భక్తులు ఇలా ప్రతి గురువారం ఉపవాసం చెయ్యుట కాని, ఆరోజు ప్రత్యేకంగా సాయి మందిరానికి కాని వెళ్లి భజనల్లో పాలుపంచుకోవడం మూలంగా వ్రత లాభం పొందుతారు. భక్తులకి కఠోరమైన తపస్సు అవసరం లేదు, ఒక్క గురువార ఉపవాస దీక్ష చాలు సాయి కృపకు పాత్రులవడానికి. మీరు సాయిబాబా కృపని, ఆశీర్వాదాన్ని గురువారం దీక్ష ద్వారా పొందాలి అనుకుంటున్నవారైతే , మీరు పాటించాల్సిన కొన్ని నియమాలు, తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ పొందిక చేయబడ్డాయి.

సాయి బాబా గురువారం వ్రతం గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు

Sai Baba | Thursday Vrata | Sai Baba Blessings

1. ఈ వ్రతాన్ని కులమతాలకు అతీతంగా ఎవరైనా చెయ్యవచ్చ్చు.

2. ఈ వ్రతం గురువారం మాత్రమే చెయ్యవలసి ఉంటుంది.

3. తర్వాత కనీసం 9 గురువారాలు ఈ ఉపవాస దీక్ష చెయ్యవలసి ఉంటుంది.

4. ఉపవాసం సమయంలో ఖాళీ కడుపుతో ఉండవలసిన అవసరం లేదు. దీక్షా సమయంలో పాలు, పండు, పళ్ళ రసాలను తీసుకొనవచ్చు మరియు రోజుకు ఒకపూట మాత్రమే ఆహారాన్ని స్వీకరించవలసి ఉంటుంది.

Sai Baba | Thursday Vrata | Sai Baba Blessings

5. వీలైతే, మీరు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని సందర్శించాలి.

6. ఇంటిలో, మీరు ఉదయం మరియు సాయంత్రం కూడా ప్రార్ధించవలసి ఉంటుంది.

7. ప్రార్ధన చెయ్యుటకు ముందుగా ఒక చెక్క బోర్డు ని శుభ్రమైన లేక శుభ్రపరచిన స్థలమునందు ఉంచి, దానిని ఒక పసుపు వస్త్రముతో కప్పి సాయి బాబా విగ్రహాన్ని ఉంచవలసి ఉంటుంది. విగ్రహం,లేదా పటం యొక్క నుదుటి పై కుంకుమని ఉంచండి. దేవునికి పూలదండలతో అలంకరించి, ఏవైనా పండ్లను లేదా పాలను నైవేద్యంగా పెట్టండి. సాయిబాబా భోధనల పుస్తకాన్ని లేదా చాలీసా లేదా గురుచరిత్రని చదవడం పూపూర్తి చేశాక , నైవేద్యాన్ని నలుగురికీ పంచండి.

8. తొమ్మిదవ గురువారం, 5 పేద ప్రజలకు ఆహారం ఇవ్వడం తప్పనిసరి.

9. ఋతు చక్రం వల్ల ఒక మహిళ గురువారం వ్రతాన్ని కోల్పోయి ఉంటే, ఆ గురువారం దాటవేసి, మరుసటి గురువారం నుండి కొనసాగించవచ్చు. ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు సాయి బాబా యొక్క ఆశీస్సులను పొంది, అపజయం లేనివారై అన్నిటా కార్యసిద్ది లభిస్తుంది.

English summary

Sai Baba | Thursday Vrata | Sai Baba Blessings

Sai baba is a popular figure among Hindus as well Muslims. It is believed that he was an incarnation of God. Sai baba's teachings combined both the elements of Hinduism and Islam. He taught the code of love, tolerance, contentment, charity and inner peace. His teachings can be summarized under his one epigram ‘Sabka Malik Ek Hai' meaning God is one.