Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
saphala ekadashi 2024: సఫల ఏకాదశి నాడు అరుదైన యాదృచ్చికం..ఇలా చేస్తే మీ పంట పండినట్లే..పాపాలన్నీ పోతాయ్
సనాతన ధర్మంలో ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సంవత్సరంలో ప్రతి నెలా రెండు ఏకాదశిలు ఉంటాయి. ఒకటి కృష్ణ పక్షంలో,మరొకటి శుక్ల పక్షంలో ఉంటుంది. అంటే ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణువు కోసం ఉపవాసం ఆచరిస్తారు, ఆచారాల ప్రకారం పూజలు చేస్తారు. హిందూ మతంలో ఏకాదశి ఉపవాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అయితే 2024 సంవత్సరంలో వచ్చే చివరి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. అసలు ఈ ఏడాది సఫల ఏకాదశి ఎప్పుడు? ఎందుకు ఈ ఏడాది అంత స్పెషల్? ఈ రోజున ఏం చేస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం.
సఫల ఏకాదశి 2024 ముహూర్తం
పంచాంగం ప్రకారం సంవత్సరం చివరి మాసాన్ని పౌష మాసం అంటారు. పౌష మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని సఫల ఏకాదశి(saphala ekadashi 2024) అంటారు. ఇది 2024 సంవత్సరంలో చివరి ఏకాదశి.
పంచాంగం ప్రకారం ఈ ఏడాది సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 25 రాత్రి 10:29 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 26న మధ్యాహ్నం 12:43 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో డిసెంబర్ 26,2024న సఫల ఏకాదశి జరుపుకుంటారు. డిసెంబర్ 26నే సఫల ఏకాదశి వ్రతం నిర్వహించబడుతుంది.

ఈ ఏడాది సఫల ఏకాదశి చాలా చాలా ప్రత్యేకమైనది
హిందూ మతంలో గురువారం విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ సందర్భంలో ఈ ఏడాది డిసెంబర్ 26న అంటే గురువారం వచ్చే సఫల ఏకాదశి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజునే స్వాతి నక్షత్రంతో పాటు సుకర్మ, ధృతి యోగం కూడా ఏర్పడుతోంది. ఈ గ్రహ స్థానంతో ఈ ఏడాది సఫల ఏకాదశి ప్రాముఖ్యత మరింత ప్రత్యేకం కానుంది.
విష్ణుపూజ ముహూర్తం
డిసెంబర్ 26న ఉదయం 7.12-8.30 గంటల మధ్యలో పూజ యొక్క శుభ సమయం ఉంటుంది. ఈ కాలంలో మీరు విష్ణువు,లక్ష్మీదేవిని పూజించవచ్చు.
ఇంట్లో పూజా విధానం
-ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలస్నానం ఆచరించి పూజ గదిని అలంకరించుకోవాలి.
-ఇప్పుడు లక్ష్మీ నారాయణుల ఫొటోకు గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి.
-ఆ ఫొటో ఎదురుగా వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి.
-ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి. జాజిపూలు, నందివర్దనం, తెల్లగన్నేరు,తుమ్మి పూలు, జాజిపూలు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి.
-పూలతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణాయ,ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ రెండు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూలతో పూజించాలి.
-ఆ తర్వాత విష్ణువుకు ఇష్టమైన ఆహారా నైవేద్యంగా పెట్టి పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే విష్ణు సహస్రనామం పఠించండి. ఇలా చేయడం ద్వారా విష్ణువు చాలా సంతోషిస్తాడు మరియు మీ ప్రతి క్లిష్టమైన పనిని చేస్తాడు. రాబోయే కొత్త సంవత్సరం 2025 ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది.
-సఫల ఏకాదశి పూజను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చని పండితులు తెలిపారు.
ఉపవాస సమయం
ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాది పాటు ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా తెలిసీ తెలియక చేసిన పాపాలన్ని కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు. అందుకే ఈ ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు. డిసెంబర్ 26న ఉపవాసం మొదలుపెట్టి.. మరుసటి రోజు అంటే డిసెంబర్ 27 ఉదయం 7:12 నుండి 9:16 మధ్యలో విరమించాలి.



Click it and Unblock the Notifications