For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏదైతే కర్మ, శాస్త్రబద్దముగా, రాగద్వేష రహితముగా ఉండి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడునో, అది సత్త్వగుణములో ఉందని అర్ధం : శ్రీ కృష్ణ భగవానుడు

ఏదైతే కర్మ, శాస్త్రబద్దముగా, రాగద్వేష రహితముగా ఉండి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడునో, అది సత్త్వగుణములో ఉందని అర్ధం : శ్రీ కృష్ణ భగవానుడు

|

ఏదైతే కర్మ, శాస్త్రబద్దముగా, రాగద్వేష రహితముగా ఉండి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడునో, అది సత్త్వగుణములో ఉందని అర్ధం : శ్రీ కృష్ణ భగవానుడు

నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్ ।

అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ।। 23 ।।

భగవద్గీత – 18 వ అధ్యాయం 23 వ శ్లోకం

ఈ భౌతిక వాద ప్రపంచంలో పుట్టిన మనం, సమాజం పరంగా కొన్ని నియమ నిబందనలకు లోబడి, కట్టుబడి జీవనాన్ని నడుపుతూ ఉంటాము. తద్వారా రెండు రకాలుగా జీవితం సాగుతుంది, విజ్ఞత కలిగిన లేదా బావిలో కప్పులా. నిజ జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఒక లాభాపేక్షను కలిగి ఉండడం సహజం. అది మంచైనా చెడైనా. ఇది మానవ సహజం.

Set Thy Heart Upon Thy Work; But Not On Its Reward,

మహాభారతం లో కృష్ణుడు ఏం చెప్పాడు:

మహాభారతం భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం ప్రకారం, ఏ పనైతే నీవు లాభాపేక్ష లేకుండా, మనస్పూర్తిగా కర్మానుసారంగా చేస్తావో అది సత్త్వగుణములో ఉందని అర్ధం. ఈ అలవాటు లేదా పద్దతి ప్రాచీనకాలం నుండి మన పూర్వీకులు మనకు నేర్పుతూనే ఉన్నారు. కానీ మనకు తెలిసినా, నిజజీవితంలో ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితుల్లో ఉంటాము. దీనికి కారణం సమాజంలో ప్రతి ఒక్కరూ లాభాపేక్ష మార్గాలలో పయనించడం, మరియు గంజాయి వనంలో తులసి మొక్క మనుగడ సాగించలేకపోవడం.

ఏంటి లాభాపేక్ష లేకుండా పని చేయాలా? వినడానికే ఇబ్బందిగా ఉంది కదా? ఫలితాన్ని ఆశించకుండా, పని మెరుగ్గా ఎలా అని అనుకుంటారు అందరూ. ఈ ఆధునిక ప్రపంచం కూడా మీ లక్ష్య నిర్దేశం అనేది, రాబోవు ఫలితాలపై ఆధారపడి ఉండాలి అని సూచిస్తుంది.

ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఒక పని కోసం మీ శ్రమనoతా ధారపోసారు, కాని ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయారు. తద్వారా మీకు ముట్టజెప్పిన ధనం కూడా తక్కువగా ఉండవచ్చు. మీకు పనిచ్చిన వ్యక్తి స్వార్ధపరుడు కావొచ్చు, లేదా మీ పని యందు సంతృప్తి చెందకపోవడం కావొచ్చు లేదా మరే ఇతర కారణాలవలన అయినా కావొచ్చు. చాలా భాదేస్తుంది మరియు మీ పనిని చులకన చేసిన భావాన్ని కలుగజేస్తుంది అవునా ?

అదే మరోపక్క పని బాగా చేసి, ఆ పనికి తగ్గ ఫలితాన్ని కూడా ఇవ్వగలిగినప్పుడు, పని ఇచ్చిన యజమాని సంతృప్తికి లోనై, మీరు ఆశించిన ధనాన్ని ముట్టజెబుతాడు లేదా మీకు మరింత పనిని అప్పగించేలా తోడ్పాటు అందివ్వగలడు. అలా కాకుండా ఆశించిన ఫలితాన్ని సమయానుసారం పొందలేకపోయినా కూడా, మీ కష్టాన్ని గుర్తించి మరికొన్ని గంటలు మీకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా మీ పనికి తగ్గ గుర్తింపు, సంఘంలో పేరు ప్రఖ్యాతల మూలంగా నెమ్మదిగా మీరు ఒక మంచి స్థానంలో నిలదొక్కుకోగలరు.

ఇక్కడ మీరు సరిగ్గా పని చేయని పక్షంలో, పనికి తగ్గ ప్రతిఫలాన్ని కోల్పోవడమే కాకుండా, పేరు ప్రఖ్యాతలను కూడా కోల్పోతారు. తద్వారా, మీ జీవితానికి కూడా సరైన ఎదుగుదల ఉండదు. కావున లాభాపేక్ష చూడకుండా, మీ పని యందు ఇష్టంతో దృష్టి పెట్టి పని చేస్తే, ఆ సమయంలో మీకు లాభo కలుగకపోయినా మీ పని అందరికీ తెలుస్తుంది. తద్వారా భవిష్యత్తులో అనేక లాభాలను చూడగలుగుతారు.

ఈ పైన చెప్పిన అన్ని సందర్భాలలో, వ్యక్తి పని గురించి మరియు ఫలితం గురించి ఆలోచిస్తాడు ఇతర లాభాపేక్ష లేకుండా.

ఇప్పుడు చెప్పబోయే విషయం పైసందర్భాలకు భిన్నమైనది .. !

వ్యక్తి కేవలం లాభాపేక్ష గురించి ఆలోచిస్తూ పని యందు శ్రద్ద లేని వారైన నేపధ్యంలో, లేదా ధనం మూలం మిదం జగత్ అన్న నానుడినే ఎక్కువగా నమ్మే వ్యక్తి అయిన పక్షంలో., పనిని పని గంటలలో మాత్రమే భావిస్తూ ఉంటారు. పని పూర్తయిందా లేదా అన్న ఆలోచన కన్నా, పనిగంటలలో పని చేశామా లేదా అన్న ఆలోచనను మాత్రమే కలిగి ఉంటారు. ఒక్కోసారి ఇది పని యందు అశ్రద్దకు కూడా దారి తీస్తుంది.

లాభం అంటే ధనమేనా .. !

మీరు మనస్పూర్తిగా పనియందు దృష్టిపెట్టి, మీ శ్రమను, మీ కష్టాన్ని ధారపోసి ఫలితం దృష్ట్యా పని చేసిన ఎడల, లాభం ఏ రూపంలో అయినా మిమ్ములను చేరుతుంది. ఇక్కడ లాభం అనేది డబ్బు మాత్రమే కాదు, మీ పనికి తగ్గ గుర్తింపు మరియు సంఘంలో పేరు కూడా. ఇదే ఆలోచనను మనస్పూర్తిగా ఎవరు కలిగి ఉంటారో, వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. లాభాపేక్షను జీవిత పరమార్ధంగా భావించిన ఎడల, ఎన్నో నష్టాలను, ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మీ పని యందు మీరు ప్రేమను కలిగి ఉంటే, ఆ పనే మీకు జీవితంలో మంచి రోజులను ప్రసాదిస్తుంది.

ఎవరైతే లాభాపేక్ష గురించిన ఆలోచనలు చేస్తారో, వారు పని యందు అస్సలు శ్రద్ధను ఉంచలేరు., మరియు పనిని ఇష్టంగా చేసేవారు, లాభాపేక్ష గురించిన ఆలోచనలు చేయరు అన్నది జగమెరిగిన సత్యం. ఇదే గీతలో కృష్ణుడు కూడా చెప్పింది. ఎప్పటికైనా ఏదో ఒకరూపంలో మీ పనికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. మనిషి మనీషిగా మారడంలో అతని పనే ఎప్పటికైనా నిలుస్తుంది అన్నది నిజం. నిజానికి సత్వర పరిష్కారం (ఇన్స్టంట్ జస్టిస్) ఆలోచనలు చేసే ప్రస్తుత సమాజంలో ఓపిక, సహనం లేకపోవడం కూడా కొన్ని స్వార్ధపూరిత ఆలోచనలకు తావిస్తున్నాయి.

ఎవరు ఉత్తములు :

కొన్ని పరిశీలనల ప్రకారం, సానుకూల దృక్పధంతో పని చేసే వ్యక్తి, ఒత్తిడితో కూడుకుని పనే చేసే వ్యక్తికన్నా ఉత్తమంగా కనిపిస్తాడు. పనిని ప్రేమించడం, పనిని ఆస్వాదించడం ఈ రెండే సానుకూల దృక్పధాన్ని అలవరచి మానసిక ప్రశాంతతను కూడా అందివ్వగలదు. తద్వారా పనిని ఇష్టంతోనే కాకుండా సంతోషంగా పూర్తి చేయగలరు.

ఒకవేళ మనిషి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉన్న ఎడల , పనిని ఆస్వాదించడమే కాకుండా ఫలితాలను కూడా సానుకూలంగా అందివ్వగలరు. కృష్ణుడు చెప్పిన విధానం ప్రకారం, మానసిక సమతుల్య స్థితిలో మనిషి ఉన్న ఎడల, ఈ సమతుల్య స్థితి “ఆనందం” గా పరిగణించబడుతుంది. తద్వారా పనిలో సానుకూల దృక్పధం పెంపొంది, ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి.

శ్రీకృష్ణుని వేణుగానామృతంలోని మర్మo:

శ్రీకృష్ణుడు వేణుగానామృతo, గోపికల కోసం, తన మిత్రులైన గోపాలుర కోసం చేయలేదు. తన సంతోషం కోసం చేశాడు, తద్వారా ఫలితాలను కూడా అంతే అందంగా పొందగలిగాడు. తన పరిసరాలను అందంగా మలచుటలో ఈ వేణుగానం తన పని తనం చూపింది. ఇక్కడ కేవలం గోపికలు, గోపాలురు మాత్రమే ఆకర్షించబడలేదు. ప్రకృతి కూడా ఈ వేణుగానం తో ప్రేమలో పడింది. అదే విధంగా మన పని కూడా ఉండాలి అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు.

English summary

Set Thy Heart Upon Thy Work; But Not On Its Reward

Having born in the materialistic world, we are bound to follow the system that the world runs with. There are two ways that the life can be lived in, either as a sage or as a householder. In either case, once we take up the way of life, it is inevitable that at some point or the other, we will think about the outcomes and would wish for the desired results. This is human nature. This is something that we can not escape from.
Story first published: Saturday, April 28, 2018, 11:02 [IST]
Desktop Bottom Promotion