Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
Shani Amavasya 2022: శని అమావాస్య ఎప్పుడు? పూజా విధానాలేంటో చూడండి...
శని అమావాస్య 2022 తేదీ, ముహుర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి క్రిష్ణ పక్షం చివరి తేదీ రోజున అమవాస్య వస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడిలో జాబిల్లి పూర్తిగా కలిసిపోతాడు.

అందుకే ఆ రోజు మొత్తం ఆకాశమంతా చీకటిగా మారిపోతుంది. అమావాస్య అంటే ఆధ్యాత్మిక పరంగా ఎంతో గొప్పది. పురాణాల ప్రకారం నింగిలో జాబిల్లి కనబడని రోజునే అమావాస్య అని చాలా మంది విశ్వసిస్తారు.

హిందూ మత విశ్వాసాల ప్రకారం శనివారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని దేవుని అనుగ్రహం పొందడానికి ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

మరోవైపు ఈరోజు ఎలాంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తి కావు అని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా 2022లో శని అమావాస్య ఎప్పుడొచ్చింది.. శుభముహుర్తం ఎప్పుడు.. ఈ శని అమావాస్య శుభ ముహుర్తం ఎప్పుడు.. వైశాఖ అమావాస్య ప్రత్యేకతలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

శని అమావాస్య తేదీ..
హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఈ రోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఈరోజున దేవుళ్లకు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలొస్తాయని భక్తుల విశ్వాసం.

పూజా విధానం..
శని అమావాస్య రోజున తెల్లవారు జామున అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి గంగా నదిలో లేదా ప్రవహించే ఏదైనా నీటిలో స్నానం చేయాలి. అనంతరం శని దేవుని విగ్రహం ఎదుట నల్లని గుడ్డను ఉంచి, తమలపాకులతో అలంకరించి, ఆవనూనెతో దీపారాధన చేయాలి. అనంతరం నీలి రంగుంలోని పువ్వులను సమర్పించాలి. అలాగే మీకు దగ్గర్లోని శని దేవాలయానికి వెళ్లి శని దేవుని విగ్రహం ఎదుట ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి.

శని మంత్రాలను..
శని అమావాస్య రోజున శని మంత్రాన్ని 5, 7, 11 లేదా 21 సార్లు జపించండి మరియు శని చాలీసాను కచ్చితంగా పఠించాలి. చివరగా శని దేవునికి హారతి ఇవ్వడం మరచిపోవద్దు. ఈ పవిత్రమైన రోజున ఆవనూనెతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి.

శని అనుగ్రహం కోసం..
శని అమావాస్య రోజున నల్ల నువ్వులు, నల్ల ఉసిరి, నల్లని గుడ్డలు, ఏదైనా ఇనుము వస్తువులు మరియు ఆవనూనె మొదలైన వాటిని అవసరాన్ని బట్టి లేదా పేదవారికి దానం చేయాలి. అనంతరం శని స్తోత్రాన్ని మూడుసార్లు పఠించండి. ఇలా చేయడం వల్ల మీకు శని మహాదశ బాధలు తగ్గడంతో పాటు శని దేవుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు.

ఉపవాసం ఉంటే..
వైశాఖ మాసంలోని శని అమావాస్య రోజున ఉపవాసం ఉంటే.. అనేక ప్రయోజనాలు చేకూరతాయని చాలా మంది నమ్మకం. ఈ రోజున ఉపవాసం ఉంటే.. మన పూర్వీకుల బాధతలను తీర్చడమే కాక.. రాహువు బలహీనత మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. అలాగే శని దేవుని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ బహుళ అమావాస్య 2022 సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీన అంటే శనివారం నాడు అర్ధరాత్రి 12:57 గంటలకు ప్రారంభమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం, ఆరోజు నుండే వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30వ తేదీ అర్థరాత్రి 1:57 గంటలకు పూర్తవుతుంది. ఈరోజున దేవుళ్లకు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలొస్తాయని భక్తుల విశ్వాసం.



Click it and Unblock the Notifications
