Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
అమృతం కురిసేది ఇవాళ రాత్రే..భూలోకానికి లక్ష్మీదేవి!..శరద్ పూర్ణిమ వ్రత కథ, శుభ సమయం
దేశవ్యాప్తంగా హిందువులు ఇవాళ(అక్టోబర్ 6,2025) శరద్ పూర్ణిమ పండుగను జరుపుకుంటున్నారు. సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో శరద్ పూర్ణిమ ఒకటి. ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో వచ్చే శుక్ష పక్ష పౌర్ణమిని ఈ పండుగగా జరుపుకుంటారు. శరత్కాలపు రాత్రిలో చంద్రుడు తన పదహారు కళలలో పరిపూర్ణంగా ప్రకాశిస్తూ భూమికి చాలా దగ్గరగా వచ్చే రోజు ఇది. ఈ పవిత్రమైన రాత్రి కొన్ని ప్రాంతాల్లో రాస పూర్ణిమ, కోజాగర్ పూర్ణిమ అని కూడా పిలుస్తుంటారు.
శరద్ పూర్ణిమ రోజు రాత్రి చంద్రుడి కిరణాల నుంచి అమృతం వర్షిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాపం. అందుకే ఆ అమృత కిరణాలు సోకేలా ఆరుబటయ పాయసం ఉంచి దానిని ప్రసాదంగా స్వీకరించే సంప్రదాయం ఉంది. ఈ ఆచారం కొసం శుభ సమయం రాత్రి 10: 46 గంటలకు స్టార్ట్ అవుతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు రాత్రి సాక్షాత్తూ లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది. అందుకే ఎవరు రాత్రంతా మేల్కొని అమ్మవారిని మనస్పూర్తిగా ఆరాధిస్తారో వారి ఇంట్లో సిరిసంపదలు వస్తామని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా శరద్ పూర్ణిమ వ్రత కథను వినడాన్ని శుభప్రదంగా భావిస్తారు.

శరద్ పూర్ణిమ వ్రత కథ
పూర్వం ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉండేవాళ్లు. ఇద్దరూ పౌర్ణమి వ్రతాన్ని ఆచరించేవాళ్లు. అయితే పెద్ద కూతురు చాలా శ్రద్దాభక్తులతో నియమనిష్ఠలతో వ్రతాన్ని చేసేది..చిన్న కూతురు మాత్రం ఏదో నామమాత్రంగా చేసేమంటే చేశాం అన్నట్లుగా వ్రతాన్ని ఆచరించేది..మధ్యలోనే దాన్ని విరమిస్తుండేది. కాలక్రమేణా ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. పెద్దమ్మాయికి ఆరోగ్యకరమైన అందమైన పిల్లలు పుట్టారు,చిన్నమ్మాయికి మాత్రం బిడ్డ పుట్టినట్లే పుట్టి మరణిస్తుండటంతో ఆమె తీరని దు:ఖంలో మునిగిపోయింది. దీంతో కన కష్టానికి కారణం,పరిష్కారం ఏంటో తెలుసుకోడానికి చిన్నమ్మాయి ఓ మహర్షి దగ్గరికి వెళ్లింది. ఆ మహర్షి తమ దివ్యదృష్టితో ఆమె వ్రతభంగాన్ని గ్రహించారు. అమ్మా నువ్వు పౌర్ణమి వ్రతాన్ని అశ్రద్ధ చేస్తున్నావు..అందుకే నీకీ దుస్థితి వచ్చింది అని చెప్పాడు. దీంతో ఇప్పుడు నన్మేమి చేయంటారు అని అడగ్గా..రాబోయే శరద్ పూర్ణిమ వ్రతాన్ని సంపూర్ణ భక్తితో ఆచరించు,చంద్రుడి దయతో నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు మహర్షి.
దీంతో చిన్నమ్మాయి ఆ మహర్షి చెప్పినట్లేు చేసింది..ఆ తర్వాత ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు..కానీ ఆ బిడ్డ కూడా పుట్టిన కొద్దిసేపటికే చనిపోయాడు. అప్పుడు ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన అక్క స్పర్శకు దివ్య శక్తి ఉందని నమ్మి మరణించిన తన బిడ్డను ఒక పీఠంపై పడుకోబెట్టి వస్త్రంతో కప్పింది. తన అక్కను ఇంటికి పిలిచి ఆ పీఠంపై కూర్చోమంది. ఆమె కూర్చున్న వెంటనే ఆమె వస్త్రం ఆ పసికందును తాకగానే ఆ శిశువు ఒక్కసారిగా ప్రాణం పోసుకొని ఏడవడం మెదలుపెట్టింది. అప్పుడు చెల్లెలు జరిగిందంతా అక్కకు వివరించింది. అక్కా ఇదంతా నీ వ్రత మహిమ,చంద్రుడి దయ వల్లే ఇదంతా సాధ్యపడింది..నీ స్పర్శతో నా బిడ్డ బతికాడు అని చెప్పింది, అప్పటి నుంచి శరద్ పూర్ణిమ వ్రత మహాత్యం లోకమంతా వ్యాపించింది.
పౌరాణిక గాథలు
క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు కూడా ఇదేనని మన పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపికలతో మహారాసక్రీడ జరిపిన రాత్రి కూడా ఇదేనని చెబుతారు.



Click it and Unblock the Notifications