Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
పూరీ జగన్నాధ్ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండె.. అంతు చిక్కని ఎన్నో మిస్టరీలు..!
పూరీ జగన్నాధ ఆలయంలో వున్న రహస్యాలు బహుషా ఇంకే ఆలయాల్లో కూడా లేవా అని అనిపిస్తుంది. ఒడిస్సాలో సముద్ర తీరంవద్ద వుండే ఈ పూరీ జగన్నాద్ ఆలయం శాస్త్రవేత్తలకు కూడా ఎన్నో ప్రశ్నలను సంధించింది. కృష్ణుడి గుండె ఇదే ఆలయంలో వుందని కూడా చెబుతుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన మిస్టరీల గురించి తెలుసుకుందాం.
క్రీస్తు పూర్వ 3,102 వ సంవత్సరంలో జరా అనే వేటగాడు ఒక బాణాన్ని శ్రీకృష్ణుడిపై అనుకోకుండా బాణం వేయడంతో ఆ బాణం శ్రీ కృష్ణుడి అరికాలికి తాకడంతో శ్రీకృష్ణుడు మరణిస్తాడు. శ్రీకృష్ణుడికి అంతిమ సంస్కారాలను కూడా ఆ వేటగానే పూర్తి చేస్తాడు. శ్రీకృష్ణుడి శరీరం కాలుతుండగా శరీరంలోని ఒక వస్తువు కాలకుండా అలాగే ప్రకాశిస్తూ వుంటుంది. జరా దీనిని తీసుకొని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎవ్వరు కూడా దానికి కొనరు. దీంతో జరా దానిని ఒక చెక్కకు కట్టేసి నదిలో వదిలేస్తాడు.

అన్న ఆలయాల్లో దేవుడి విగ్రహాలు రాయితో తయారు చేయబడతాయ్. కానీ పూరీ జగన్నాధ్ ఆలయంలో మాత్రం చెక్కతో తయారు చేయబడుతుంది. దీని వెనక ఒక కథ వుంది. పుర్వం గుప్తుల కాలంలో ఒక రాజుకు శ్రీకృష్ణుడు కలలోకి వచ్చి సముద్రం వద్ద దర్శనం ఇస్తానని అంటాడు. సముద్రం వద్దకు వెళ్తే ఒక చెక్క కనబడుతుంది. ఈ చెక్కతో శ్రీకృష్ణుడు విగ్రహాన్ని తయారు చేయమని చెబుతాడు. ఇలా శ్రీకృష్ణుడి విగ్రహం తయారవుతుంది.
అప్పటి నుంచి ఈ చెక్క విగ్రహాలను ఆలయంలో వుంచుతూ వస్తున్నారు. శ్రీకృష్ణుడు గుండె లోహం రూపంలో ఈ ఆలయంలో వున్న విగ్రహంలో వుంటుందని అంటారు. ఆ లోహం నుంచి అనంతమైన శక్తి ఎప్పుడూ ప్రసరిస్తుందట. ఆ శక్తి అలా ప్రసరించకుండా వుండడానికి చెక్క విగ్రహం లోపల పెడతారని అంటారు. అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయంలో వున్న కృష్ణుడు గెండెనో మరో చెక్క విగ్రహంలోకి మారుస్తారు.
శ్రీకృష్ణుడి గుండెను మార్చే టప్పుడు నగరం మొత్తం విద్యత్తును తీసివేస్తారు. ఆలయ ప్రధాన పూజారీ చేతులకు గ్లోవ్స్ వుసుకొని, కళ్లకు గంతలు కట్టుకొని ఈ గుండెను మార్చుతాడు.
ఆలయం గోపురం పైన వున్న జండాను ప్రతి రోజూ మారుస్తారు. గాలికి వ్యతిరేక దిశలో ఈ జెండా వీయడం ఇప్పటికీ పెద్ద మిస్టరీగా చెప్పుకుంటారు.
ఆలయంలో ప్రసాదం తయారు చేసే విధానం కూడా అద్భుతంగా వుంటుంది. ఏడు మట్టికుండలను ఒకదానిపై ఒకటి వుంచి వండుతారు. కానీ కిందవున్న కుండకన్నా మొత్తం పైన వున్న కుండలోనే ప్రసాదం త్వరగా ఉడకడం ఒక పెద్ద మిస్టరీ.
ఈ ఆలయం నీడకూడా ఎక్కడా కనిపించదు. నీడ రాకుండా ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా నిర్మించారనేది కూడా ఇప్పటికీ మిస్టరీగా మారింది.
పక్షులు దేవాలయంపైన గోపురం పైన వాలుతాయ్. కానీ ఒక్క పక్షి కూడా ఈ ఆలయంపైన ఇప్పటి వరకు వాలకపోవడం కూడా ఒక పెద్ద మిస్టరీగా చెప్పుకుంటారు.
ఆలయంపైన వుండే సుదర్శన చక్రాన్ని ఎక్కడి నుంచి చూసినా అది మనవైపే తిరిగి వుందనే భ్రమను కలిగిస్తుంది. ఇలా ఎలా నిర్మించారనేది కూడా అంతుచిక్కడం లేదు.
ఆలయం లోపలికి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం వుంటుంది. ఇతర మతాల వారికి అస్సలు ప్రవేశం వుండదు. వారందరూ బయట నుంచే దర్శించుకొని వెళ్లిపోవాలి.
పూరీ జగన్నాధ్ ఆలయంలోని దేవుడు ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు అనారోగ్యానికి గురవుతాడు. ఆ సమయంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఇలాంటి ఎన్నో మిస్టరీలు పూరీ జగన్నాధ్ ఆలయం చుట్టూ వున్నాయ్.



Click it and Unblock the Notifications
