Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
యేసుక్రీస్తు వివాహ రహస్యం: ఆశ్చర్యం కలిగించే వివాదాస్పద విషయాలు
2003 లో నవలాకారుడు డాన్ బ్రౌన్ తన అత్యంత వివాదాస్పద నవల ద డా వించి కోడ్ విడుదల చేసినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ పుస్తకం క్రైస్తవంలోని అతి పెద్ద రహస్యం జీసస్ పెళ్లి గురించి చర్చించి౦ది. క్రైస్తవం చరిత్ర అంతటా ఒక వేశ్యగా పెర్కొనబడుతూ వచ్చిన మేరీ మాగ్దాలిన్ ను అతడు పెళ్ళాడినట్లు ఆ పుస్తకం వాదించింది. అతను మేరీ మాగ్దాలిన్ ద్వారా ఒక బిడ్డను కన్నట్లు కూడా ఆ పుస్తకం లో చెప్పబడినది. ఇందులో చాలా వాదనలని అవాస్తవాలుగా కొట్టివేశారు.
అయితే బ్రిటిష్ గ్రంధాలయం అరల్లో దొరికిన 1500 ఏళ్ళ నాటి ఒక పాత రాతప్రతి ప్రపంచాన్ని మళ్ళీ కుదిపెయడానికి సిద్ధంగా వుంది. జీసస్ జీవితం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలిపే ఆ రాత ప్రతిని అరమైక్ లిపి నుంచి అనువదించడానికి ప్రొఫెసర్ బారీ విల్సన్, రచయిత సిమ్చా జాకోబొవిచ్ చాలా ఏళ్ళు శ్రమించారు. జీసస్ క్రీస్ట్ కు పెళ్లైందని, అతని మేరీ మగ్దాలిన్ ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారని ఆ రాత ప్రతి చెప్తుంది. ఆ పుస్తకం పేరు “ది లాస్ట్ గాస్పెల్’.

క్రీ.శ. 570 వ సంవత్సరానికి చెందిన ఈ రాత ప్రతి నుంచి అనువదించబడిన భాగాల ఆధారంగా ఈ వాదనలు బయలుదేరాయి. జీసస్ కు, మేరీ మాగ్దాలిన్ కు ఈజిప్ట్ దేశపు ఫారో పెళ్లి చేయించాడని, అతనికి ఆ వివాహం ద్వారా ఇద్దరు కొడుకులు కలిగారని ఆ పుస్తకం చెప్తుంది.
జీసస్ క్రీస్ట్ వైవాహిక జీవితం గురించి ఇలాంటి వాదనలు బయలు దేరడంఇదే మొదటిసారేమీ కాదు.జీసస్ కు పెళ్లి అయిందా లేదా అన్న విషయం మీద చరిత్రకారులు ఏమంటున్నారో చూద్దాం..

కథారిస్ట్ నమ్మకాల ప్రకారం జీసస్ క్రీస్ట్ కు మాగ్దాలిన్ కు ఏదో ఒక స్థాయిలో సంబంధం వుందని 13 వ శతాబ్దపు సిస్టీరికల్ సన్యాసి పీటర్ ఆఫ్ వాక్స్ డి సర్నే అంటారు. ఫ్రెంచ్ సోషలిస్టు రాజకీయ నాయకుడు లూయీ మార్టిన్ ‘లెస్ ఎవాంజైల్స్ సాంస్ డై’ అనే తన పుస్తకంలో ఇంకో అడుగు ముందుకు వేసి చరిత్రలో జీసస్ నాస్తికుడిగా మారి, మేరీ మాగ్దాలిన్ ను పెళ్ళాడి ఫ్రాన్స్ దక్షిణానికి వెళ్లి కొడుకును కన్నాడని రాసారు.
20వ శతాబ్దంలో వచ్చిన డోనోవాన్ జాయిస్ పుస్తకం జీసస్ స్క్రోల్ జీసస్ సంతానం గురించి, అతనికి మేరీ మాగ్దాలిన్ కి వున్న సంబంధం గురించి మాట్లాడిన మొదటి పుస్తకాల్లో ఒకటి. 1977లో ప్రచురితమైన – ఆండ్రియాస్ ఫేబర్-కైసర్ రాసిన ‘జీసస్ డైడ్ ఇన్ కాశ్మీర్ : జీసస్, మోసెస్ అండ్ ది టెన్ లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇశ్రాయిల్’ పుస్తకంలో జీసస్ కాశ్మీర్ వచ్చారని, అక్కడ అతను కాశ్మీరీ స్త్రీని కలిసి పెళ్ళాడి పిల్లలను కన్నాడని రాసాడు.

తరువాత 1982 లో మైకేల్ బైజేంట్, రిచర్డ్ లీ, హెన్రీ లింకన్ రాసిన ‘ది హోలీ బ్లడ్ అండ్ ది హోలీ గ్రెయిల్’ అనే పుస్తకంలో ఈ వాదనను మరింత ప్రచారం చేస్తూ – జీసస్ వంశావళి అతని కూతురు ద్వారా కొనసాగిందని, ఇప్పటికీ మేరోవింజియన్ వంశం ద్వారా ఇప్పటికీ నిలిచే ఉందనీ రాసారు.
ది లాస్ట్ గాస్పెల్ లో ప్రకటనల వల్ల తెలిసేదేమంటే ఆ పత్రం కోడ్ చేయబడింది, ఓల్డ్ టెస్టమెంట్ లో జీసస్, మాగ్దాలిన్ ల పెళ్లి విషయం రహస్యంగా దాచి ఉంచారు. జోసెఫ్, అతని భార్య అసేనేత్ పాత్రలు నిజానికి జీసస్, మేరీ మాగ్దాలిన్ లవేనని, జీసస్ పిల్లలిద్దరి పేర్లూ, వారికి రోమన్ సామ్రాజ్యంలో శక్తిమంతులైన రాజకీయ నాయకులతో వున్న సంబంధాలను తెలియచేస్తానని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఎక్లేసియాస్టికల్ హిస్టరీ ఆఫ్ జాకరియాస్ రేటోర్ అనే పేరిట శుద్ది చేసిన జంతు చర్మం మీద వచ్చిన ఒక పాత పుస్తకానికి అనువాదమే ది లాస్ట్ గాస్పెల్. 1847 లో బ్రిటిష్ మ్యూజియం వారు ఈజిప్షియన్ మొనాస్టరీ నుంచి కొనడంతో ఈ పుస్తకం ఇంగ్లాండ్ కు చేరింది. చాలా మంది పండితులు దాన్ని చదివాక పెద్దగా పస లేనిదని వదిలేసారు.
కానీ ది లాస్ట్ గాస్పెల్ రచయితలు మాత్రం ఆ రాత ప్రతిలో నిగూడార్ధాలు వున్నాయని ఆరేళ్ళు పరిశోధించి తెలియచేసారు. సిరియాక్ భాషలో (జీసస్ మాట్లాడిన మధ్య ఆసియా భాష) జంతు చర్మం మీద రాసిన ఆ ప్రతి బ్రిటిష్ గ్రంథాలయంలో 20 ఏళ్ళ నుంచీ వుంది.

చాలా మంది పండితులు కూడా ఈ వాదనలన్నీ పస లేనివని కొట్టి పారేశారు. కానీ, మేరీ మాగ్దాలిన్ ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. బైబిల్ పాత్రల్లో ముఖ్యమైన మాగ్దాలిన్ చుట్టూ ఇప్పటికీ ఎన్నో ఊహాగానాలు వున్నాయి. వీటిలో కొన్ని ఊహలను సమర్ధించే సిద్ధాంతాలు కూడా వున్నాయి. కానీ అవన్నీ ఊహాగానాలు గానే ఉండిపోయాయి.
నిజమైనా కాకపోయినా, ది లాస్ట్ గాస్పెల్ మాత్రం మళ్ళీ జనం మనసుల్ని కదిలించింది. జీసస్ కు మేరీ మాగ్దాలిన్ తో పెళ్లి అయిందా, వారి పిల్లలు ఇలాంటి ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా వివాదాలు మాత్రం తప్పక రేకెత్తిస్తాయి.



Click it and Unblock the Notifications